ప్లాసీ యుద్ధం | Battle of Plassey (1757)

 

  • సిరాజ్ ఉద్దౌలా మ‌రియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగిన యుద్ధం ప్లాసీ యుద్ధం. 1757లో జ‌రిగింది.
  • యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కు మద్దతు తెలిపిన కుట్రదారులు మీర్ జాఫర్. ఇత‌ను సిరాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు.
  • సైన్యాధ్య‌క్షుడిని మీర్ భక్షి అంటారు. మ‌రొక‌రు మిరాన్. ఇత‌ను మీర్ జాఫర్ కొడుకు. ఇంకా వ్యాపారి అమీన్ చంద్ (మధ్యవర్తి), కలకత్తా ఇన్చార్జ్ మాణిక్ చంద్, బెంగాగ్‌లో అత్యంత ధనికుడు జగత్ సేట్ స‌హ‌క‌రించారు.
  • సిరాజ్ సైనిక అధికారులు రాయ్ దుర్లభ్, ఖాదీమ్ ఖాన్.
  • 1757లో జూన్ 23న జ‌రిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ‘సిరాజ్ ఉద్దౌలాను ఓడించాడు.
  • మీర్ మదన్, మోహన్ లాల్ సైనికులు సిరాజ్ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
  • పారిపోతున్న సిరాజ్‌ను మీర్ జాఫర్ కొడుకు మిరాన్ పట్టుకొని ఉరితీశాడు.
  • 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. 1757 నుంచి 1760 వ‌ర‌కు పాలించాడు.
  • ఈ యుద్ధం త‌ర్వాత‌ బెంగాలులో, తరువాత భారత్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ఆంగ్లేయులకు మార్గం సుగమమయింది.
  • యుద్ధ నష్ట పరిహారం కింద రూ. 177 లక్షలు, కలకత్తా సమీపంలోని 24 పరగణాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించాయి.
  • కంపెనీ తొలిసారి 1757లో కలకత్తాలో టంకశాల తెరిచింది. తమ అధికారులకు పెద్దగా జీతాలు ఇవ్వడం ప్రారంభించింది.
  • వీటన్నింటి కన్నా ముఖ్యంగా ప్లాసీ యుద్ధంతో దేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ పెద్ద ఎత్తున ప్రారంభమైంది.
  • 1760లో ఆంగ్లేయులు మీర్ జాఫర్‌ను తొలగించి మీర్ ఖాసింను బెంగాల్ నవాబుగా నియమించారు.
  • కృతజ్ఞతగా మీర్ ఖాసిం ఆంగ్లేయులకు బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను ఇచ్చాడు.
  • మీర్ ఖాసీం బెంగాల్ రాజధానిని ముర్షీదాబాద్ నుంచి మాంఘీర్‌కు మార్చాడు.
  • 1760లో క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్లాక కొంతకాలం హాల్వెల్ గవర్న‌ర్‌గా చేశాడు. ఆ తర్వాత వాన్సిట్టార్ట్ బెంగాల్ గవర్న‌ర్‌గా చేశాడు.
  • 1763లో ఆంగ్లేయులు మీర్ ఖాసింనూ బెంగాల్ నవాబుగా తొలగించారు. మళ్లీ మీర్ జాఫర్ గ‌వ‌ర్న‌ర్ అయ్యాడు.
  • భారత్‌లో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసింది, తూర్పు ఇండియా కంపెనీ ఓ రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం.