కర్ణాటక ఆక్రమణ (లేక) ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు
- దేశానికి వ్యాపారం కోసం వచ్చి బ్రిటిష్, ఫ్రెంచ్ వారి పోటీ తట్టుకోలేక వెళ్లిపోయింది – పోర్చుగీసు, డచ్చివారు పోర్చుగీసు,
- డచ్చివారు వెళ్లిపోవడంతో దేశంలో మిగిలిన యూరోపియన్లు – బ్రిటిష్, ఫ్రెంచివారు
- వాణిజ్యం విషయంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి మధ్య తలెత్తిన పోటితో పాటు
దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వారు తర్వాత చేసిన ప్రయత్నాలు
చివరికి కర్ణాటక యుద్ధానికి దారి తీశాయి. దేశంలో బ్రిటిష్, ఫ్రెంచి వారి
మధ్య జరిగిన
- యుద్ధాలను ఆంగ్లో, కర్ణాటక యుద్ధాలంటారు. మొత్తం 3 యుద్ధాలు జరిగాయి.
- మొదటి కర్ణాటక యుద్ధం – 1744-18
- రెండో కర్ణాటక యుద్ధం – 1749-54
- మూడో కర్ణాటక యుద్ధం – 1766-63
- మూడో కర్ణాటక యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లకు ఫ్రెంచ్ వారి నుంచి పోటీ
లేకుండా పోయింది. దీంతో దక్షిణ భారత రాజకీయాల్లో బ్రిటిషర్లు బలమైన శక్తిగా
ఎదిగారు.
- దక్కన్‌లో రాజకీయ అనిశ్చితి, యూరప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య, రాజ్యకాంక్ష, తీవ్రమైన వ్యాపార పోటీ
ఆంగ్లో-ఫ్రెంచ్ సంఘర్షణ లేదా కర్ణాటక ఆక్రమణ
- ఆంగ్లో-ఫ్రెంచి కంపెనీలు భారతదేశంలోని స్థానిక పాలకులతో కలిసి చేసిన యుద్ధాలనే కర్ణాటక యుద్ధాలు అంటారు.
- కర్ణాటక ప్రాంతం మొగల్ సామ్రాజ్యంలో అంతర్భాగమయ్యాక మొగల్ చక్రవర్తిచే నియమించబడిన నవాబు కర్ణాటకను పాలించేవాడు.
- ఔరంగజేబు (1707లో) మరణించిన తరువాత మొఘలులచే నియమింపబడిన కర్ణాటక నవాబు
సాదుతుల్లా ఖాన్ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కర్ణాటక రాజ్యమును
స్థాపించిచాడు.
- సాదుతుల్లా ఖాన్ తర్వాత నవాబు దోస్త్ అలీ. దోస్త్ అలీ కొడుకు సఫదర్ అలీ. దోస్త్ అలీ అల్లుడు చాంద్ సాహెబ్.
- 1710 నుంచి 1732 వరకు సాదతుల్లాఖాన్ కర్ణాటక నవాబుగా పరిపాలించాడు.
అతని తర్వాత దోస్త్ అలీ 1732 నుండి 1740 వరకు పాలించాడు. ఇతని కాలంలో
పీష్వాలు, హైదరాబాద్ నిజాం కర్నాటక ప్రాంతాన్ని ఆక్రమించారు.
- తంజావూరు రాజు నుంచి కరైకల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రెంచ్
గవర్నర్ ‘డ్యూమాస్’ ప్రయత్నం చేశాడు. ఇతనికి దోస్త్ అలీ అల్లుడైన
చందాసాహెబ్ సహకరించాడు.
- తంజావూరు రాజుగారి పిలుపు మేరకు మరాఠా పాలకుడు సాహూ తన సైన్యాలను పంపాడు.
- కర్ణాటక ఆక్రమణ కోసం ఇక్కడ జరిగిన యుద్ధం దామలచెరువు యుద్ధం (1742).
- సాహు, తంజావూరు రాజు కలిసి దోస్త్ అలీ, చాంద్ సాహెబ్, డ్యూమస్ (ఫ్రెంచి గవర్నర్)పై యుద్ధం చేశారు.
- కర్నాటక (ఆర్కాట్) నవాబ్ దోస్త్ అలీ మరణించగా యుద్ధం తరువాత దోస్త్ అలీ
కొడుకు సఫదత్ అలీ నవాబుగా వస్తాడు. ఇతన్ని వేలూరు పాలకుడు ముర్తాజ్ అలీ
చంపేస్తాడు.
- చందాసాహెబ్‌ను బందీని చేసి మరాఠాలు మొదట బీరార్‌కు, తరువాత సతారాకు తీసుకువెళ్లారు.
- ఆ తరువాత జరిగిన అంతర్గత అల్లర్లను ఆసరాగా తీసుకొని దోస్త్ ఆలీ సహచరుడు అన్వరుద్దీన్ కర్ణాటక పాలకునిగా ప్రకటించుకున్నాడు.
- కానీ ఇతన్ని హైదరాబాద్ నిజాం, దోస్త్ అలీ బంధువులు నవాబుగా
గుర్తించలేదు. ఇదే టైంలో బంధీగా ఉన్న చందాసాహెబ్‌ను మరాఠీలు విడుదల చేశారు.
- ఈ టైంలోనే ఐరోపాలో ఆస్ట్రియా సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది.
- అన్వరుద్దీన్ కాలంలో మొదటి, రెండవ కర్ణాటక యుద్ధాలు జరిగాయి.
మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం | First Carnatic War (1744-48)
- ఈ యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే. ఈ సమయంలో బ్రిటిష్ సేనాని బార్నెట్
- యుద్ధంలో గెలిచిన డూప్లే మద్రాసును ఆక్రమించాడు.
- యుద్ధం జరగడానికి ముఖ్యకారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆక్సిలా చాపెల్ సంధితో ఈ యుద్ధం ముగిసింది.
- 1740 మార్చి నెలలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఆ
యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పాల్గొనడంతో వారి వాణిజ్యం, కంపెనీలున్న
భారతదేశానికీ వారి వైషమ్యాలు వ్యాపించాయి.
- ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వల్ల దేశంలో బ్రిటిష్, ఫ్రెంచి వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
- దేశంలో ఫ్రెంచి నౌకలపై బ్రిటిష్ జరనల్ బార్నెట్ దాడి చేసి వాటిని ధ్వంసం చేశాడు.
- దేశంలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మారిషస్‌లో ఉన్న బోర్డినాయిస్‌ను భారత్
పిలిపించి ఇద్దరూ కలసి బ్రిటిష్ స్థావరమైన మద్రాస్ను ఆక్రమించారు.
- కానీ బోర్డినాయిస్ లంచం తీసుకొని మద్రాస్‌ను బ్రిటిషర్లకు అప్పగించి మారిషస్ వెళ్లిపోతాడు.
- అప్పుడు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సాయంతో మద్రాస్ను తిరిగి ఫ్రెంచ్ జనరల్ డూప్లే ఆక్రమించాడు.
- దీనికంటే ముందు డూప్లే, అన్వరుద్దీన్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని
ప్రకారం మద్రాస్ను ఆక్రమించి తర్వాత దాన్ని అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచాలి.
కాని డూప్లే అందుకు నిరాకరించాడు.
- దీంతో తన డిమాండ్లను తీర్చాలని హెచ్చరిస్తూ 10 వేల మంది సైనికులను అన్వరుద్దీన్ మద్రాసు వైపు పంపాడు.
- డూప్లే కెప్టెన్ పారడైజ్ నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటక వైపు పంపాడు. వీరిద్దరి మధ్య సాంథోయ్ లేదా అడయార్ యుద్ధం జరిగింది (1748లో) అన్వరుద్దీన్ సైనికులు ఓడించబడ్డారు.
- మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం సాంథోయ్/అడయార్ యుద్ధం.
కర్ణాటక రాజ్యం కొరకు జరిగిన వారసత్వ యుద్ధాల్లో బ్రిటిష్ వారి మద్దత పొందింది అన్వరుద్దీన్. - ఫ్రెంచి వారి మద్దతు పొందినది చాంద్ సాహెబ్.
- అడయార్ యుద్ధంలో ఫ్రెంచి పక్షం (చాంద్సాహెబ్ , డూప్లే) గెలిచింది. బ్రిటిష్ పక్షం (బార్నెట్, అన్వరుద్దీన్) ఓడింది.
తొలిసారి యురోపియన్ సేనలు భారతీయ రాజును ఓడించాయి. - 1748లో ఆక్స్-లా-చాపెల్ (ఫ్రాన్స్‌లోని పట్టణం) ఒప్పందం ప్రకారం యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది.
దీంతో ఇండియాలో కూడా మొదటి ఆంగ్లో-కర్ణాటక యుద్ధం అంతమైంది. - ఆ ఒప్పందం ప్రకారం మద్రాస్ తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వబడింది.
రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం | Second Carnatic War (1749-1754)
- హైదరాబాద్, కర్ణాటక రాజ్యాలలో వారసత్వ తగాదాల వల్ల రెండో ఆంగ్లో కర్నాటక యుద్దం జరిగింది.
- బ్రిటిష్ వాళ్లు నాజర్ జంగ్ (హైదరాబాద్), అన్వరుద్దీన్ (కర్ణాటక)కు మద్దతు తెలిపారు.
- ఫ్రెంచ్ వారు ముజాఫర్ జంగ్ (హైదరాబాద్), చాంద్ సాహెబ్ (కర్ణాటక)కు మద్దతు ప్రకటించారు.
- మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు సాధించిన విజయాలు డూప్లేలో రాజ్యకాంక్షను ప్రేరేపించాయి.
- బ్రిటిష్ పలుకుబడిని తగ్గించటానికి స్థానిక రాజ్యాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు.
- 1748లో హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ మరణించాడు.
- ఇతని మరణానంతరం నాజర్ జంగ్ హైదరాబాద్ నవాబయ్యాడు. ఇతని వ్యతిరేకి ముజఫర్ జంగ్.
- కర్ణాటకలో అన్వరుద్దీన్ వ్యతిరేకి చాంద్ సాహెబ్.
- ఫ్రెంచి గవర్నర్ డూప్లే ముజఫర్ జంగ్, చాద్ సాహెబ్‌కు మద్దతు పలికాడు. వీరి కూటమి 1749లో అంబూర్ యుద్ధంలో అన్వరుద్దీన్‌ణు చంపేసింది.
- దీంతో ఫ్రెంచి వారు మద్దతు తెలిపిన చాంద్ సాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు.
- 1750లో నాజర్ జంగ్ తొలగించబడి ఫ్రెంచి వారి మద్దతు తెలిపిన ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబు అయ్యాడు.
- ముజఫర్ జంగ్ మచిలీపట్నం, యానాం దీవులను ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
- 1751లో ముజఫర్ జంగ్ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి వద్ద కడప కర్నూలు నవాబులచే హత్యకు గురయ్యాడు.
- హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెంచి జనరల్ బుస్సీ సలాబత్ జంగ్ (ముజఫర్ జంగ్ సోదరుడు)ను నవాబు చేశాడు. దీనికి గాను 1752లో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులు (కొండవీడు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం) ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
- కర్ణాటకలో అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ తిరుచిరాపల్లి బ్రిటీష్ ఆశ్రయాన్ని పొందాడు.
- తిరుచిరాపల్లిలో బ్రిటిష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ 500 మంది
సైనికులతో కర్ణాటక రాజధాని ఆర్కాట్‌పై దాడి చేసి ఆక్రమించాడు. అందుకే
క్లైవ్‌ను ఆర్కాట్ వీరుడు అంటారు.
- అనేక చిన్న చిన్న యుద్ధాలలో చాంద్ సాహెబ్ మద్దతుదారులు ఓడించబడ్డారు. చివరకు చాంద్ సాహెబ్ పట్టుబడి ఉరి తీయబడ్డాడు.
- మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అయ్యాడు. ఇతను ‘వల్లాజా‘ అనే పేరును పొందాడు. ఇతని వంశాన్ని వల్లాజా వంశం అంటారు.
- చాంద్ సాహెబ్ పరాజయాలను తెలుసుకొన్న ఫ్రెంచి ప్రభుత్వం డూప్లేను వెనకకు పిలిపించి గదోహోను గవర్నర్గా పంపింది. గదోహో బ్రిటిషర్లతో పాండిచ్చేరి ఒప్పందం చేసుకొని రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధమును అంతం చేశాడు.
పాండిచ్చేరి సంధి
- రెండవ కర్ణాటక యుద్ధం ముగియడానికి కారణమైన సంధి పాండిచ్చేరి సంధి.
- ఈ యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేని తొలగించి గదాహోను గవర్నర్‌గా నియమించారు.
- 1754లో గదాహో బ్రిటిషర్లతో పాండిచ్చేరి సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం సలాబాత్ జంగ్ హైదరాబాద్ నవాబుగా నియమించబడ్డాడు.
- మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా నియమించబడ్డాడు.
3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం | Third Carnatic War (1756-1763)
- ఐరోపాలోని సప్త వర్ష సంగ్రామం వల్ల భారత్‌లో మూడో కర్నాటక యుద్ధం జరిగింది. ఈ సంధి పారిస్ సంధితో ముగిసింది.
- మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఏర్పడిన తగాదాల వల్ల జరిగింది.
- యూరప్‌లోని సప్త వర్ష యుద్ధాల వల్ల భారత్‌లో 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది.
- సప్తవర్ష సంగ్రామంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పోరాటం ప్రారంభించగానే వీళ్ల వర్తక సంఘాలు దేశంలో కూడా గొడవలకు దిగాయి.
- ఫ్రెంచి ప్రభుత్వం కౌంట్-డీ-లాలీని గవర్నర్‌గా భారతదేశానికి పంపింది.
- కౌంట్-డీ-లాలీ దేశానికి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటిష్ స్థావరాలపై దాడి చేశాడు.
- 1760లో వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ సర్ అయ్యర్ కూట్, ఫ్రెంచి
జనరల్ కౌంట్-డీ-లాలీని, బుస్సీలను ఓడించి ఖైదీగా పట్టుకున్నాడు. ఈ యుద్ధంతో
ఫ్రెంచి వారు దేశంలో పూర్తిగా తమ ఆధిపత్యం కోల్పోయారు.
- 1763లో పారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు యూరప్లో అంతమయ్యాయి. దీని
ప్రకారం భారత్లో కూడా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంతమైంది. ఫ్రెంచి వారు
పాండిచ్చేరికి మాత్రమే పరిమితమయ్యారు.
- భారత్‌లో ఫ్రెంచి వారిని తుదముట్టించిన యుద్ధం – వందవాసి యుద్ధం (1760)
- కర్ణాటక నవాలు మహ్మద్ అలీ మద్రాస్లోని చెపాక్ భవంతిలో విశ్రాంతి పొందుతూ పాలనా బాధ్యతలను బ్రిటిష్కు అప్పగించాడు.