ఏపీపీఎస్సీ మెటీరియల్

Labels

  • ARTHEMATICS
  • BUDGETS
  • CHEMISTRY
  • CUURENT AFFAIRS
  • DM
  • ECONOMY
  • ENVIRONMENT
  • GEOGRAPHY
  • INDIAN SOCIETY
  • NOTIFICATIONS
  • PDF'S
  • PERSONS
  • POLITY
  • PRACTICE BITS
  • SCIENCE AND TECHNOLOGY
  • SYLLABUS
  • అవార్డులు
  • జనరల్ నాలెడ్జ్
  • జీవశాస్త్రం
  • పాలిటి
  • ఫిజిక్స్
  • విపత్తు నిర్వహణ
  • హిస్టరీ
Showing posts with label విపత్తు నిర్వహణ. Show all posts
Showing posts with label విపత్తు నిర్వహణ. Show all posts

విపత్తు నిర్వహణ ప్రశ్నలు 6

 

1. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
సి) రెడ్‌క్రాస్‌, రెడ్‌ క్రిసెంట్‌ డి) వరల్డ్‌ బ్యాంక్‌
2. భారతదేశంలోBuilding Materials Techno logy Promotion Council (BMTPC) ÔájáÖsÁT తయారు చేసిన Vulnerability Atlas ర ప్రకారం వరదలు సంభవించే శాతం?
ఎ) 58 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 30 శాతం
3. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారినపడుతున్న భూభాగం?
ఎ) 68 శాతం బి) 58 శాతం
సి) 78 శాతం డి) 48 శాతం
4. మన దేశంలో ఏటా ఎంతమంది వరదలకు గురవుతున్నారు?
ఎ) 500 మిలియన్లు బి) 100 మిలియన్లు
సి) 200 మిలియన్లు డి) 400 మిలియన్లు
5. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 మధ్య సంభవించిన విపత్తుల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లగా రెవెన్యూలో ఎంత శాతం నష్టం వాటిల్లింది?
ఎ) 13.15 శాతం బి) 12.15 శాతం
సి) 10.15 శాతం డి) 11.15 శాతం
6. కింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినవి?
ఎ) 2001 భుజ్‌ భూకంపం
బి) 2004 హిందూ మహాసముద్రంలోని సునామీ
సి) 2005 జమ్మూకాశ్మీర్‌ భూకంపం
డి) పైవన్నీ
7. 2005-10 మధ్య కాలంలో విపత్తులకు కేటాయించిన నిధులు?
ఎ) 21,333 కోట్లు బి) 20,333 కోట్లు
సి) 25,333 కోట్లు డి) 15,333 కోట్లు
8. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2344 బి) 5344 సి) 4344 డి) 9344
9. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల నివారణ దశాబ్దంగా  (Internati onal Decade for Natural Disaster Reduction)  ప్రకటించింది?
ఎ) 1995-2005 బి) 1990-2000
సి) 1980-1990 డి) 2000-2010
10. 'జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు'ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది?
ఎ) 2005, డిసెంబరు 12
బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15
డి) 2005, డిసెంబరు 23
11. SDMAకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ముఖ్యమంత్రి
12. నేషనల్‌ ఎగ్జ్జిక్యూటివ్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) లోకసభ స్పీకర్‌ బి) హోమంత్రి
సి) హోం ప్రధాన కార్యదర్శి డి) ప్రధాన మంత్రి
13. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2005, డిసెంబరు బి) 2006, డిసెంబరు
సి) 2005, నవంబర్‌ డి) 2006, నవంబరు
14. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2008 బి) 2006 సి) 2009 డి) 2010
15. భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నింటిలో వరదలు వచ్చే అవకాశం ఉంది?
ఎ) 20 బి) 23 సి) 25 డి) 26
16. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం?
ఎ) 30 బి) 50 సి) 20 డి) 40
17. దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2000 బి) 3000
సి) 1600 డి) 1000
18. దేశంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్న పరి వాహక ప్రాంతం?
ఎ) గంగా-బ్రహ్మపుత్ర బి) గంగా-సింధు నది
సి) క ష్ణా-గోదావరి డి) నర్మద-తపతి
19. వరదలు సంభవించడానికి కారణాలు?
ఎ) అధిక వర్షపాతం బి) తుపానులు
సి) ఆటుపోటులు డి) పైవన్నీ
20. ప్లాష్‌ ఫ్లడ్స్‌ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి?
ఎ) 6 బి) 5 సి) 3 డి) 8
21. పేదవాడి అణ్వాయుధాలు (పూర్‌ మ్యాన్స్‌ న్యూక్లియార్‌ బాంబ్స్‌) అని వేటిని అంటారు?
ఎ) మిథైల్‌ ఐసోసైనేట్‌ బి) ట్రైనైట్రోటోలిన్‌
సి) బయోలాజికల్‌ డిజాస్టర్స్‌ డి) గ్రీన్‌హౌస్‌ వాయువులు
22. కింది వాటిలో విపత్తులతో సంబంధమున్న అంశం ఏది?
ఎ) హ్యూగో డిక్లరేషన్‌ బి) కార్టిజనో ఒప్పందం
సి) నగోయ ఒప్పందం డి) క్యోటో ప్రోటోకాల్‌
23. భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్‌ ఏది?
ఎ) బార్‌ గ్రాఫ్‌ బి) సిస్మో గ్రాఫ్‌
సి) టెక్టా గ్రాఫ్‌ డి) ఏదీకాదు
24. అవలాంచెస్‌ అంటే?
ఎ) కొండ చరియలు విరగటం
బి) మట్టి గడ్డలు విరిగి పడటం
సి) మంచు చరియలు విరిగి పడటం
డి) పైవన్నీ
25. మంచు చరియలు విరిగి పడటానికి కారణం?
ఎ) ఉష్ణోగ్రత పెరగటం
బి) వాలు కోణం (Slope angle)
సి) మంచు విస్తరణ (Snow pack) డి) పైవన్నీ
26. భూపాతాలు (Landslides) ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి?
ఎ) హిమాలయ ప్రాంతం బి) పశ్చిమ కనుమలు
సి) నీలగిరి కొండలు డి) పైవన్నీ
27. భూపాతాలు (Landslides) సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) కొండ వాలుగా ఉండటం
బి) అడవులను నిర్మూలించడంతో మత్తిక కొట్టుకొని పోవడం
సి) దిగువ ప్రాంతాల్లో గనుల తవ్వకం
డి) పైవన్నీ
28. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50 వేల మంది సైనికులు మతి చెందారు?
ఎ) ఆల్ఫ్స్‌ పర్వతాలు బి) ఆండీస్‌ పర్వతాలు
సి) రాఖీ పర్వతాలు డి) మిక్కెన్లీ పర్వతాలు
29. కింది వాటిలో భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు?
ఎ) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
బి) వాడియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ
సి) డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ డి) పైవన్నీ
30. కొండచరియలు విరిగి పడటానికి సంబంధించిన అట్లాసును రూపొందించిన సంస్థ?
ఎ) బిల్డింగ్‌ మెటీరియల్‌ అండ్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌
బి) అన్నా యూనివర్శిటీ సి) ఎ, బి డి) ఏదీ కాదు
31. కింది వాటిలో పెద్ద భూపాతాలు సంభవించిన ప్రదేశాలు ఏవి?
ఎ) అస్సాం బి) కోహిమా, నాగాలాండ్‌
సి) మల్పా, ఉత్తరాఖండ్‌ డి) పైవన్నీ
32. 'జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం' ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
ఎ) 2005, డిసెంబరు 12 బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15 డి) 2005, డిసెంబరు 23
33. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ప్రధాన కార్యదర్శి
34. National Disaster Management Authority (NDMA)లో సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 10 బి) 8 సి) 15 డి) 7
35. చీణవీAకు ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ప్రధాన కార్యదర్శి బి) లోక్‌సభ స్పీకర్‌
సి) కేబినెట్‌ హోదాలోని మంత్రి డి) ఏదీ కాదు
36. NDMAకు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) ఎస్‌.సి. విజ్‌ బి) మర్రి శశిధర్‌ రెడ్డి
సి) మాంటెక్‌ సింగ్‌ డి) షిండే
37. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను అమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం, మార్గదర్శకాలు రూపొందించడం వంటివి దేని బాధ్యతలు?
 a) 2005, &™d+‹sÁT 12         _) 2005, &™d+‹sÁT 10
 d¾) 2005, &™d+‹sÁT 15         &) 2005, &™d+‹sÁT 23
3
38. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?
ఎ) 10 బి)12 సి) 11 డి) 9
9. విపత్తులపై విద్యార్థుల్లో అవగాహన కల్గించడానికి జదీూజు ఏ తరగతుల్లో విపత్తు నిర్వహణ పాఠ్యాంశా లను చేర్చింది?
ఎ) 6, 7 బి) 7, 8 సి) 8,9 డి) 9, 10
40. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన North-Eastern Council డిక్లరేషన్‌కు సంబం ధించింది ఏది?
ఎ) Mizoram Declaration
 b) Shillong Declaration 
 c) Nagaland Declaration   
 d) Tripura Declaration
41. వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తి స్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన దళం?
a) National Disaster Response Force (NDRF)
b) Integrated coastal zone management project
c) National Institute of Disaster Management
c) State Disaster Management Authority
42. వరదల వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
ఎ) మ త్తికా క్రమక్షయం బి) పంట నష్టం
సి) తాగునీరు కలుషితమవడం డి) పైవన్నీ
43. గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణా, నిర్వహణకు 1972లో జల వనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది?
ఎ) ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
బి) గంగా ఫ్లడ్‌ కంట్రోల్‌ కమిషన్‌
సి) ఫ్లడ్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు డి) పైవన్నీ
44. కేంద్ర జల కమిషన్‌ ఏర్పడిన సంవత్సరం
ఎ) 1940 బి) 1945 సి) 1950 డి) 1955
45. కింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ?
ఎ) ఎమ్‌.కె. శర్మ కమిటీ
బి) ఆర్‌. రంగాచారి కమిటీ
సి) కేస్కర్‌ కమిటీ డి) పైవన్నీ
46. వాలు స్థిరత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి?
ఎ) వాలులో గడ్డి మొక్కలు నాటడం
బి) వాలును బలపరుచుట
సి) వాలులో సహజ ఉద్భిజ సంపదను పెంచడం
డి) పైవన్నీ
47. విపత్తుకు మొదటగా ఎవరు స్పందిస్తారు?
ఎ) ప్రభుత్వ సంస్థలు బి) ఇరుగు పొరుగు వారు
సి) కమ్యూనిటీ ప్రజలు డి) పైవన్నీ
48. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్‌ ఎవరు?
ఎ) కె.అయ్యంగార్‌ బి) బ్రిజేశ్‌
సి) జె.సి. పంత్‌ డి) మర్రి శశిధర్‌ రెడ్డి
49. ఆంధ్రప్రదేశ్‌లో కరువును అత్యధికంగా ఎదుర్కొం టున్న జిల్లాల సంఖ్య?
ఎ) 8 బి) 6 సి) 4 డి) 9
50. ప్రకతి వైపరీత్యాల వల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు మరిణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది?
ఎ) ఇందిరా క్రాంతి బి) ఆపద్భందు పథకం
సి) అభయ హస్తం డి) రాజీవ్‌ ఆవాస్‌ యోజన
సమాధానాలు
1.సి 2.బి 3.ఎ 4.సి 5.బి
6.డి 7.ఎ 8.సి 9.బి 10.ఎ
11.డి 12.సి 13.డి 14.సి 15.బి
16.డి 17.సి 18.ఎ 19.డి 20.ఎ
21.సి 22.ఎ 23.బి 24.సి 25.డి
26.డి 27.డి 28.ఎ 29.డి 30.సి
31.డి 32.డి 33.సి 34.బి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.సి 40.బి
41.ఎ 42.డి 43.బి 44.బి 45.డి
46.డి 47.బి 48.సి 49.ఎ 50.బి

విపత్తు నిర్వహణ ప్రశ్నలు 5

 1) విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో Disaster అంటారు. ఈ పదం ఎందులో నుంచి పుట్టింది?
జ: Disastre అనే ఫ్రెంచి పదం నుంచి
2) Disastre అనే ఫ్రెంచి పదానికి అర్థం ఏంటి ?
జ: చెడు (Dis) నక్షత్రం (aster) : చెడు నక్షత్రం
నోట్: ఇటలీలో disastro అని, గ్రీకులో dusastro
3) ‘‘సమాజపు సాధారణ నిర్మాణానికి మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా మరియు తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’’ అని నిర్వచించింది ఎవరు ?
జ: ఐక్యరాజ్య సమితి (UNO)
4) విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. మరియు పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’ అన్న నిర్వచనం ఎవరిది ?
జ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
5) 1999-2000ల మధ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో విపత్తుల మరణాల శాతం ఎంత ?
జ: 4 శాతం
6) ప్రతి ఏడాది ప్రపంచంలో విపత్తుల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య ఎంత ?
జ: 211 మిలియన్లు
7) 1980-2010 మధ్య మన దేశంలో విపత్తుల వల్ల మరణించిన వారి సంఖ్య ఎంత ?
జ: 1,43,039 మిలియన్లు
8) ప్రతి ఏడాది మన దేశంలో సంభవిస్తున్న మరణాల సంఖ్య ఎంత ?
జ: 4,334 మంది
9) విపత్తుల వల్ల భారత్ లో ఏటా ఎంత నష్టం జరుగుతోంది ?
జ: 10 బిలియన్ల డాలర్ల నష్టం
10) ప్రపంచ యుద్దాలు, ఉగ్రవాదం, నక్సలిజం, అణుబాంబులు లాంటివి ఏ విపత్తుల కిందకి వస్తాయి ?
జం మానవకారక విపత్తులు


11) 1984లో జరిగిన పెద్ద మానవ కారక విపత్తు ఏది ?
జ: భోపాల్ గ్యాస్ దుర్ఘటన
12) వైపరీత్యాన్ని ఇంగ్లీషులో Hazard అంటారు. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఆకస్మికంగా జరిగే సంఘటననే వైపరీత్యం. అయితే ఈ పదం ఏ భాషకు చెందినది ?
జ: Hazard అనేది Hassard అనే ఫ్రెంచి పదం, Az-zhar అనే అరబిక్ పదాల నుంచి వచ్చింది
13) ఫ్రెంచి భాషలో Hazard అంటే అర్థం ఏంటి ?
జ: Chance (అవకాశం)
14) విపత్తు పరిస్థితిని లేదా నష్టం తీవ్రతను తెలుసుకోడానికి ఏవి లెక్కలోకి తీసుకుంటారు ?
జ: ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం
15) మన దేశంలో ఎంతశాతం భూమి వరదలకు గురవుతోంది ?
జ: 12శాతం ( 8శాతం తుఫాన్లకు)
16) International day for Disaster Reduction( అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం )గా ఎప్పుడు పాటిస్తారు ?
జ: అక్టోబర్ 13న
(నోట్: విపత్తుల కుదింపు దశాబ్దం- 1990-99)
17) National Day for Disaster Reduction ( జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం)ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: అక్టోబర్ 29న


18) 21వ శతాబ్దం మొదటి దశాబ్దంలోనే భారత్ అనేక భయంకర విపత్తులు ఎదుర్కొంది. అవి ఏంటి  జ: 2001 లో - భుజ్ భూకంపం
2004లో - హిందూ మహాసముద్రంలో సునామీ
2008లో - కోసి నదికి వరదలు
19) భారత్ లో పునరావృతమయ్యే వరదలకు ఎంతమంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు ?
జ: 20 కోట్ల మంది ( 200 మిలియన్లు)
20) దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏయే రాష్ట్రాలు ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది ?
జ: ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్
21) సహజ విపత్తులను ఎదుర్కోవడంలో ప్రాథమిక బాధ్యత ఉంటుంది ?
జ: స్థానిక ప్రభుత్వం
22) 1556 సంవత్సరంలో ప్రపంచంలో నమోదైన మొదటి భూకంపం ఏ దేశంలో సంభవించింది ?
జ: చైనా
23) రాపిడ్ అన్ సెట్ డిజాస్టర్ కు ఉదాహరణ ఏది ?
జ: భూకంపం
24) సామాజిక ఆధారిత విపత్తు నష్ట నివారణను మన దేశంలో చేపట్టేది ఎవరు ?
జ: UNDP

విపత్తు నిర్వహణ - విశ్లేషణ

                     భారతదేశంలో విపత్తు నిర్వహణ కంటే, దాని నిర్వహణ ఒక పెద్ద విపత్తు.. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు కానీ, ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఉపద్రవం దానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించిన తీరు చూస్తే ఆ వ్యాఖ్యలు సమంజసమేమోననిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల తరచూ ప్రకృతి సిద్ధమైన విపత్తులు/ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 1990-2000 కాలాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. ఆస్తి, ప్రాణనష్టాలను తగ్గిస్తూ, సామాజిక - ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి అంతర్జాతీయంగా సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చింది.

                    విపత్తులను ఎదుర్కోవడంలో భారతదేశానికి ఎంతో అనుభవం ఉంది. దేశంలో గత 110 సంవత్సరాలలో 90 లక్షలకు పైగా జన నష్టం జరిగింది. దేశంలో భూగర్భ, వాతావరణ, జీవ వైవిధ్యం అపారం. దీనికితోడు హిమాలయ పర్వతాలు భూకంపాలకు నిలయం. దాదాపు 60 శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది. 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద బారినపడుతుంది. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలు (ఎనిమిది శాతం భూమి) తుపానుల వల్ల తరచూ నష్టపోతుంటాయి. 68 శాతం భూభాగం దుర్భిక్షానికి గురవుతోంది. తరచూ సంభవిస్తున్న ఉపద్రవాలు భారతదేశంలో పరిమితంగా ఉన్న వనరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విపత్తు పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత దశాబ్దంలో భారతదేశం వివిధ విపత్తుల వల్ల 24 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇందులో వరదల వల్ల 17 బిలియన్ డాలర్లు, భూకంపాల వల్ల 4.5 బిలియన్ డాలర్లు, దుర్భిక్షం వల్ల 1.5 బిలియన్ డాలర్లు. దేశంలో దాదాపు ప్రతి ఏటా కరువులు, వరదలు సంభవిస్తున్నాయి.


విపత్తు అంటే ఏమిటి?
                    అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవ పూరిత సంఘటనే విపత్తు. దీని వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు ప్రస్ఫుటమౌతాయి.

విపత్తు ప్రధానంగా:

  1. సాధారణ జీవితానికి అంతరాయం కలిగిస్తుంది.
  2. అత్యవసర చర్యలకు ప్రతిబంధకంగా నిలుస్తుంది.
  3. దైనందిన అవసరాలైన, తిండి, బట్ట, వసతి వంటివి లభించడం దుర్లభమవుతుంది.

                    విపత్తులు ప్రకృతి సిద్ధమైనవి కావచ్చు, మానవ పూరితం (Man made) కావచ్చు. ఇవి భారీ ఎత్తున సంభవించవచ్చు లేదా స్వల్పమైనవి కావచ్చు.

  1. భారీఎత్తున సంభవించే ప్రకృతి సిద్ధ విపత్తులు: వరదలు, తుపానులు, సునామీ, కరవు, భూకంపాలు
  2. భారీ ఎత్తున సంభవించే మానవపూరిత విపత్తులు: యుద్ధాలు, రసాయన విస్ఫోటనాలు, కాలుష్యం, అణు ప్రమాదం, అడవుల నిర్మూలన (Deforestation)
  3. స్వల్ప ప్రకృతి సిద్ధ విపత్తులు: చలిగాలులు (Cold wave) ఉరుములతో కూడిన తుపానులు, వడగాలులు (Heat wave)
  4. స్వల్ప మానవ పూరిత విపత్తులు: రోడ్డు, రైలు ప్రమాదాలు, కొట్లాటలు, విషపూరిత ఆహారం (Food poisoning), పారిశ్రామిక విస్ఫోటనం, అగ్నిప్రమాదాలు.

భారతదేశంలో ఇటీవల కాలంలో సంభవించిన ఘోర విపత్తులు.

  • ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్)లో భూకంపం (1991)
  • లాతూర్‌లో (మహారాష్ర్ట) భూకంపం (1993)
  • ఒడిశాలో తుపాను (1999)
  • భుజ్ (గుజరాత్)లో భూకంపం (2001)
  • దక్షిణ కోస్తాలో సునామీ (2004)
  • గుజరాత్, ముంబైలో వరదలు (2005)
  • ముంబై మీద ఉగ్రవాదుల దాడి (2008)
  • లే (కాశ్మీర్)లో కుండపోత వర్షాలు (Cloud burst)
  • ఉత్తరాఖండ్ జలప్రళయం (2013)

విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు:

  1. సంసిద్ధత (Preparedness)
  2. ఉపశమన చర్యలు (Mitigation)
  3. సహాయ చర్యలు (Relief)
  4. పునరావాసం (Rehabilitation)

                    విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనబడకపోవచ్చు. భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవిస్తాయి. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని ప్రమాదం నుంచి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించడం. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారి అవసరాలను తీర్చడం సహాయచర్య. తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం మొదలైన చర్యలు, ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం.


విపత్తు నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన యంత్రాంగం:
కేంద్ర ప్రభుత్వం 1999లో నియమించిన కె.సి.పంత్ కమిటీ కింది సిఫార్సులు చేసింది.

  1. విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలి (విపత్తు నివారణ, సంసిద్ధత, ఉపశమనం).
  2. విపత్తు నిర్వహణ కోసం కేంద్ర, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో 10 శాతం ప్రణాళికా నిధులు కేటాయించాలి.
  3. భూకంపాలు సంభవించే పట్టణ ప్రాంతాల్లో పటిష్ట నిర్మాణాలకు ప్రమాణాలు రూపొందించాలి.

                    దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సిఫార్సులను సక్రమంగా అమలు చేయలేదు. అయితే, 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును ఆమోదించింది. చట్ట రూపాన్ని సంతరించుకొన్న ఈ విధానం ప్రకారం జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పని చేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ, శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థ (National institute of disaster management) ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని (National disaster response force) ఏర్పాటు చేశారు. వీటికి తోడు 1. జాతీయ అగ్నిమాపక కళాశాల (National fire service college). 2. జాతీయ పౌర రక్షణ కళాశాల (National civil defence college) లను ప్రారంభించారు.


ప్రభుత్వ పథకాలు:
                    కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న పథకాలు...

  1. రాష్ర్ట విపత్తు స్పందన నిధి (State disaster response fund)
  2. విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదల (Capacity building for disaster response) రాష్ర్ట, జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు తగిన తర్ఫీదునిచ్చి ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు.
  3. అగ్నిమాపక సేవల పునరుద్ధరణ (Revamping of fire services)
  4. పౌర రక్షణ పునరుద్ధరణ (Revamping of civil defence setup)

అంతర్జాతీయ స్థాయిలో:

  1. భారత ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ వ్యవస్థ భాగస్వామ్యం.
  2. భారత ప్రభుత్వం- అమెరికా ప్రభుత్వం భాగస్వామ్యం. ఈ రెండు కార్యక్రమాలు విపత్తు నిర్వహణ ప్రక్రియను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి.

                    పైన వివరించినట్లు భారీ పాలనా యంత్రాంగాన్ని రూపొందించినప్పటికీ వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నప్పటికీ విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి.

మానవ తప్పిదాల వల్లే:

                    వాస్తవానికి ప్రపంచంలో పెద్ద, చిన్న విపత్తులన్నీ మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ లోయలో సంభవించిన జలప్రళయం చాలా వరకూ మానవ తప్పిదమే. పర్యావరణానికి హాని కలిగించే పలు చర్యలు ఈ ఉపద్రవానికి కారణం. విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం, యాత్రికుల సౌకర్యార్థమై విస్తృత రోడ్ల నిర్మాణం, హోటళ్లు, వసతి గృహాలు, షాపుల నిర్మాణం వంటి కార్యకలాపాలు పెళుసుగా ఉన్న కొండ చరియలు విరిగిపోవడానికి కారణం. దీనికితోడు విపత్తు నివారణసంభవిస్తే దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తగిన సాధన సంపత్తి లేకపోవడం, ఒకవేళ ఉన్నా దాన్ని సకాలంలో వినియోగించే స్థితిలో పాలనా యంత్రాంగం లేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, ఒకరిని ఇంకొకరు తప్పుపడుతూ, వేల మంది ప్రజలు ఆహుతికి, వేల కోట్ల ఆస్తి నష్టానికి కారణమయ్యారు.

చికిత్స కంటే నివారణే చౌక:
                    ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రస్తావించినట్లు విపత్తు సంభవించే వరకు వేచి ఉండవద్దు. ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను, ఆస్తిని కాపాడవచ్చు. నివారణ చర్యలు తీసుకోవడానికి మా వద్ద వనరులు లేవని తృతీయ ప్రపంచ దేశాలు తరచుగా వినిపించే మాట. వాస్తవానికి చికిత్స కంటే నివారణ వ్యయమే తక్కువ. ఉదాహరణకు చైనా 1960-2000 మధ్యలో వరదల ఉద్ధృతిని తగ్గించడానికి 3.5 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని నివారించగలిగింది. 2010లో హైతీ, చిలీ, కాలిఫోర్నియా (అమెరికా)లో భూకంపాలు సంభవించాయి. చిలీ, కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపాలు హైతీలో కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నప్పటికీ హైతీలో 2,30,000 మంది మరణిస్తే, చిలీలో కొన్ని వందల మంది, కాలిఫోర్నియాలో నలుగురు మరణించారు. దీనికి కారణం హైతీలో భవన నిర్మాణ విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం. మిగిలిన రెండు దేశాలు ప్రమాణాలను పాటించడం. ఈ రెండు దేశాలు విపత్తు నిర్వహణలో తగిన శ్రద్ధ చూపించాయి. అందుకే ఈ దేశాలలో జరిగిన జననష్టం, ఆస్తి నష్టం కూడా తక్కువే.


హైగో కార్యాచరణ:

                    ఐక్యరాజ్యసమితి చొరవతో 2005లో హైగో కార్యాచరణ పథకం (Hyogo framework for action) రూపొందింది. 168 సభ్యదేశాలు దీన్ని ఆమోదించాయి. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ మౌలిక సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి. ఉత్తరాఖండ్‌లో సహాయక కార్యక్రమాలు సకాలంలో చేపట్టలేకపోవడానికి ముఖ్య కారణం బలహీన మౌలిక సదుపాయాలే. రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, విద్యుచ్ఛక్తి; ముఖ్య, నిత్యావసర వస్తువుల నిల్వకు సరైన వసతి లేకపోవడం, సంక్షోభ సమయాల్లో శీఘ్రగతిన మానవహిత సహాయం (Humanitarian aid) అందకపోవడం. అందుకు సకాలంలో వనరుల సేకరణ, వాటిని వెంటనే నిర్దేశిత ప్రాంతాలకు తరలించడం, వినియోగించేంత వరకు భద్రంగా దాచిపెట్టడం జరగాలి. ఇది సరైన వ్యూహం. సంక్షోభ సమయాల్లో మన రక్షణ దళాలు అందిస్తున్న సేవలు అమోఘం. వాటికి మనమెప్పుడూ రుణపడి ఉంటాం. వీటితోపాటు రెడ్‌క్రాస్, యునిసెఫ్, ప్రపంచ ఆహార, ఆరోగ్య సంస్థలు ఆక్స్‌ఫామ్ అందిస్తున్న సేవలు కూడా శ్లాఘనీయం. బడా పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు వ్యక్తిగతంగా సహాయం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యం మాత్రం ఆశించిన రీతిలో లేదు.

కొరవడిన సమన్వయం:
                    పౌర రక్షణ (Civil defence) వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ అది ప్రజలకు తగిన అవగాహన కల్పించడంలో, శిక్షణనివ్వడంలో విజయవంతమైనట్లు కనిపించడం లేదు. సంక్షోభ సమయంలో తాను ఎలా స్పందించాలనే విషయంలో సగటు పౌరునికి తగిన శిక్షణ లేదు. పాఠశాల స్థాయిలో విపత్తు నిర్వహణ పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ, బోధనలో దానికి తగిన ప్రాధాన్యత కొరవడింది. దీనికితోడు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం లేదు. విధ్వంసక చర్యల నివారణలో భాగంగా జాతీయ ఉగ్రవాద నివారణ కేంద్రం (National counter terrorism) ఏర్పాటు విషయంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందనే నినాదంతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చడం విచారకరం. దీనికి కొంత వరకు మీడియా మితిమీరిన స్పందన కూడా కారణం. ఈ సంస్థలు వాటి రేటింగ్ కోసం ప్రతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చి గోరంతలు కొండంతలుగా చేస్తుంటాయి. విపత్తు నిర్వహణ సరిగా లేకపోతే దేశభద్రతకు విఘాతం కలుగుతుంది. అది మన ఉనికికే ప్రమాదం. విభేదాలు పక్కన పెట్టి సంఘటితంగా స్పందించినప్పుడే విపత్తు నివారణ, విపత్తు సంభవిస్తే ఉపశమన చర్యలు, సకాలంలో సహాయం, పునరావాసం వీలవుతుంది. అదే జాతీయ భద్రత (National security).

Older Posts Home
Subscribe to: Posts (Atom)
Awesome Inc. theme. Powered by Blogger.