Showing posts with label CUURENT AFFAIRS. Show all posts
Showing posts with label CUURENT AFFAIRS. Show all posts

నౌకాదళంలో ముఖ్యమైన నౌకలు

 

 


– ఐఎన్‌ఎస్ సావిత్రి : భారత నావికా దళంలో తొలి యుద్ధ నౌక
-ఐఎన్‌ఎస్ అశ్విని : నావికా దళంలో వైద్య సేవలు అందిస్తుంది
– ఐఎన్‌ఎస్ తరంగిణి : ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి యుద్ధనౌక
-ఐఎన్‌ఎస్ కార్భా : 8 యుద్ధనౌకల శ్రేణి
– ఐఎన్‌ఎస్ గోదావరి : 3 యుద్ధనౌకల శ్రేణి
-ఐఎన్‌ఎస్ బట్టి మాల్వ్ : ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్
– ఐఎన్‌ఎస్ జలాశ్వ : ఆంస్టిన్ రకానికి చెందిన యుద్ధనౌక
-ఐఎన్‌ఎస్ ఢిల్లీ : దేశంలో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక

 

 విమాన నౌకలు
– ఐఎన్‌ఎస్ విక్రాంత్ : దేశంలో తొలి విమాన వాహక నౌక (ప్రస్తుతం ఉపయోగిచడం లేదు)
– ఐఎన్‌ఎస్ విరాట్ : నౌకాదళంలో పనిచేస్తున్న ఏకైక విమాన వాహక నౌక
– ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య : రష్యా నుంచి కొనుగోలు చేసిన అడ్మిరల్ గోర్షకోవ్. దీనిని మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చి విక్రమాదిత్యగా పేరు పెట్టారు.
– ఐఎన్‌ఎస్ విభూతి – స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి నౌక
– ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర : ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, హెలీకాప్టర్లను తీసుకెళ్లే నౌక

 

2022 మంత్రులు- కేటాయించిన శాఖ‌లు

 

 

1. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి:  ముఖ్యమంత్రి, మంత్రుల‌కు కేటాయించని ఇతర అన్ని శాఖ‌లు
2. ధర్మాన కృష్ణదాస్:  రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్(డిప్యూటీ సీఎం)
3. కళత్తూరు నారాయణస్వామి:  ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్ (డిప్యూటీ సీఎం)
4. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని):  వైద్య, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
5. పాముల పుష్పశ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
6. షేక్ అంజాద్ బాషా: మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
7. మాలగుండ్ల శంకర్ నారాయణ: రోడ్లు & భవనాలు
8. బొత్స సత్యనారాయణ: మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
9. ముత్తంశెట్టి శ్రీనివాస్: టూరిజం, కల్చర్ & యూత్ అడ్వాన్స్మెంట్
10. కురసాల కన్నబాబు: వ్యవసాయం & సహకారం, మార్కెటింగ్, ఆహర తయారీ
11. పినిపే విశ్వపరూప్: సాంఘిక సంక్షేమం
12. చెరుకువాడ శ్రీరంగనాథరాజు: గృహ నిర్మాణం
13. తానేటి వనిత: మహిళా, శిశు సంక్షేమం
14. కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (కొడాలి నాని): పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
15. పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని): రవాణా, సమాచార శాఖ
16. వెల్లంపల్లి శ్రీనివాస రావు: దేవాదాయ శాఖ
17. మేకతోటి సుచరిత: హోం, విపత్తు నిర్వహణ
18. సీదిరి అప్పలరాజు: మత్స్య, పశుసంవర్ధక శాఖ
19. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి: ఎనర్జీ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
20. ఆదిమూలపు సురేశ్: విద్యా శాఖ
21. అనిల్‌కుమార్ యాదవ్: ఇరిగేషన్
22. మేకపాటి గౌతమ్‌రెడ్డి: పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ
23. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు & భూగర్భ శాస్త్రం
24. బుగ్గన రాజేంద్రనాథ్: ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
25. గుమ్మునూరు జయరామ్: కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు
26. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమ శాఖ

ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

 

జిల్లాల వారీగా కలెక్టర్ల వివరాలు..

  1. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు
  2. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు
  3. మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌
  4. విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు
  5. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌
  6. అనకాపల్లి కలెక్టర్‌గా రవి సుభాష్‌
  7. కాకినాడ కలెక్టర్‌గా కృతికా శుక్లా
  8. తూర్పు గోదావరి కలెక్టర్‌గా మాధవీలత
  9. కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
  10. పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా పి.ప్రశాంతి
  11. ఏలూరు కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌
  12. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా
  13. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు
  14. గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి
  15. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివశంకర్‌
  16. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ
  17. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్
  18. నెల్లూరు జిల్లాగా చక్రధర్‌ బాబు
  19. శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి
  20. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ
  21. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష
  22. కడప కలెక్టర్‌గా విజయరామరాజు
  23. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌
  24. అనంతపురం కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి
  25. నంద్యాల కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌
  26. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

 

ఎస్పీల వివరాలు..

  1. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక
  2. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు
  3. పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు
  4. అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి
  5. అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్
  6. కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు
  7. కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి
  8. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
  9. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రవిప్రకాశ్‌
  10. ఏలూరు ఎస్పీగా ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి
  11. కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు
  12. విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు
  13. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు
  14. పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి
  15. బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌
  16. ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు
  17. నెల్లూరు ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు
  18. తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి
  19. చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి
  20. అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు
  21. కడప ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు
  22. అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు
  23. శ్రీసత్యసాయి ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌
  24. కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి
  25. నంద్యాల ఎస్పీగా కె.రఘువీరారెడ్డి
  26. విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్

 

 

 

 

 

ఆస్కార్ 2022 - 94వ అకాడమీ అవార్డ్స్

  • కరోనా కారణంగా రెండు సంవత్సరాల వరకు ఆగిపోయిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు 2022 సంవత్సరంలో తిరిగి కోలాహాలంగా ప్రారంభమైంది.
  • స్మిత్ మరియు ప్రెజెంటర్ మధ్య చిన్నపాటి ఘర్షణ మినహా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో కన్నుల పండుగగా జరిగింది.
  • ఈ ఏడాది కూడా ఉత్తమ డైరెక్టర్ అవార్డును లేడీ డైరెక్టర్ గెలుచుకోవడం మరో విశేషం. ఇక ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు), ఉత్తమ నటిగా జెస్సికా ఎంపికయ్యారు.
  • ఈ ఏడాది ఉత్తమ సినిమాగా 'కోడా' నిలిచింది. మనలోని భావాలను వ్యక్తీకరించడానికి మాటలే కాదు.. సైగలు కూడా సరిపోతాయని.. అవి కూడా మనల్ని హత్తుకుంటాయని ఆస్కార్ కమిటీ అభిప్రాయపడింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి చిత్రం ఇదే. కోడా తన స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
  • 12 ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న 'ది పవర్ ఆఫ్ ది డాగ్' కేవలం ఒకే ఒక్క(ఉత్తమ డైరెక్టర్ విభాగం) అవార్డుతో సరిపెట్టుకుంది.
  • పది నామినేషన్లు దక్కించుకున్న 'డ్యూన్' చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను కైవశం చేసుకుంది.బెస్ట్ ఫారిన్ సినిమాగా జపాన్ సినిమా 'డ్రైవ్ మై కార్' నిలిచింది.
  • 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్ డైరక్షన్ చేసిన 'రైటింగ్ విత్ ఫైర్' నామినేషన్ దక్కించుకున్నప్పటికీ, ఆస్కార్ తేలేక పోయింది.

 


 అంతర్జాతీయం 24.03.2022 - 30.03.2022

2022 ఆస్కార్ విజేతలు వీరే.. 
* బెస్ట్ ఫిల్మ్ - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA) 
* బెస్ట్ యాక్టర్ - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) 
* బెస్ట్ యాక్ట్రెస్ - జెస్సికా చస్టేన్(ద ఐస్ ఆఫ్ టామీ ఫే)
 * బెస్ట్ డైరెక్టర్ - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్) 
* బెస్ట్ సపోర్ట్ యాక్టర్ - ట్రాయ్ కోట్సర్(CODA) 
* బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) 
* బెస్ట్ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్(డ్యూన్) 
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై 
* బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్ 
* బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - షాన్ హెడర్ (CODA) 
* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - బెల్ ఫాస్ట్ (కెన్నత్ బ్రానా) 
* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్(క్రూయెల్లా) 
* బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్(జపాన్) 
* బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్ కాంటో 
* బెస్ట్ ఒరిజినల్ స్కోర్ -హన్స్ జిమ్మర్(డ్యూన్)
 * బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ - డ్యూన్(పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్ జర్) 
* బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్(డ్యూన్) 
 * బెస్ట్ సౌండ్ -డ్యూన్(మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్ లెట్) 
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ 
* బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే 
* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్ - ది లాంగ్ గుడ్ బై 
* బెస్ట్ యానిమేటెడ్ ఫార్ట్ ఫిలిమ్ - ది విండ్ షీల్డ్ పైపర్ 
* బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ - ద క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్




బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2022

 

         75వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో మార్చి 13న ప్రదానం చేశారు.



  • ఉత్తమ చిత్రం- ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌
  • ఉత్తమ దర్శకుడు- జేన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)
  • ఉత్తమ నటి- జొవానా స్కాన్లన్‌ (ఆఫ్టర్‌ లవ్‌)
  • ఉత్తమ నటుడు- విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
  • ఔట్‌స్టాండింగ్‌ (అత్యుత్తమ) బ్రిటిష్‌ ఫిల్మ్‌- బెల్‌ఫాస్ట్‌
  • బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ (నటి)- అరియానా డిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
  • బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌- ట్రాయ్‌ కొట్సుర్‌ (కోడ)
  • అత్యుత్తమ తొలి ప్రదర్శన (బ్రిటిష్‌ రచయిత లేదా నిర్మాత)- ది హార్డర్‌ దే ఫాల్‌
  • ఇంగ్లిష్‌ భాషలో లేని బెస్ట్‌ ఫిల్మ్‌- డ్రైవ్‌ మై కార్‌
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌- ఎన్‌కాంటో
  • బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ది బ్లాక్‌ కాప్‌, చెరిష్‌ ఒలేకా
  • ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే- లికోరైస్‌ పిజ్జా (పాల్‌ థామస్‌ అండర్సన్‌)
  • అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే- కోడ (సియాన్‌ హెడర్‌)
  • ఒరిజినల్‌ స్కోర్‌- డూన్‌ (హాన్స్‌ జిమ్మెర్‌)
  • కాస్టింగ్‌- వెస్ట్‌ సైడ్‌ స్టోరీ (సిండి టోలన్‌)

కింజల్ హైపర్ సోనిక్ మిసైల్‌

 


 

  • కింజల్‌ అంటే రష్యన్‌ భాషలో పిడిబాకు. 
  • ‘కేహెచ్‌–47ఎం2 కింజల్‌’గా పిలిచే ఈ అత్యాధునిక క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 2018 మార్చి నెలలో ఆవిష్కరించారు. వీటిని ఐడియల్‌ వెపన్‌ (ఆదర్శ ఆయుధం)గా అభివర్ణించారు. ఇతర ఆధునిక క్షిపణులతో పోలిస్తే కింజల్‌ వేగం, కచ్చితత్వం చాలా ఎక్కువ.
  • కింజల్‌ మిస్సైళ్లను గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ధ్వనివేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలవు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకునే సామర్థ్యం వీటి సొంతం. అడ్డొచ్చే క్షిపణులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ దూసుకెళ్తాయి.
  • గంటలో ఏకంగా 12,350 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూమి లోతుల్లోకీ చొచ్చుకెళ్లగలవు.
  • 1,500 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. 
  • 480 కిలోల బరువైన సంప్రదాయ లేదా అణు పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇది రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఫ్యాట్‌మ్యాన్‌ బాంబు బరువు కంటే 33 రెట్లు ఎక్కువ!
  • టూ–22ఎం3 లేదా మిగ్‌–31కే ఇంటర్‌సెప్టర్ల నుంచి వీటిని ప్రయోగిస్తారు.
  • ఇస్కాండర్‌–ఎం షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైళ్లను అభివృద్ధి చేసి కింజల్‌ క్షిపణులను రూపొందించిందని రక్షణ నిపుణుల అంచనా.
  •  ఉక్రెయిన్‌పై యుద్ధంలో తొలిసారిగా కింజల్‌ హైపర్‌సోనిక్‌ ఏరో బాలిస్టిక్‌ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా

 


ఆంధ్రప్రదేశ్ - 26 కొత్త జిల్లాల స్వరూపం

         రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం  నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
          ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
  • ప్రకాశం జిల్లా (Praksam District) పెద్ద జిల్లా - 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
  • విశాఖపట్నం (Visakhapatnam) అతి చిన్న జిల్లా – 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
  • కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా
  • అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు) 9.54 లక్షల జనాభాతో చిన్న జిల్లా
 

 


 

1.శ్రీకాకుళం జిల్లా

  • కేంద్రం – శ్రీకాకుళం
  • 8 నియోజకవర్గాలు: ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట.
  • రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16)
  • మొత్తం 30 మండలాలు.
  • జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ,
  • జనాభా 21.91 లక్షలు ఉంది.

 

2. విజయనగరం జిల్లా

  • కేంద్రం - విజయనగరం
  • 7 నియోజకవర్గాలు: రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట.
  • రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15)
  • మొత్తం మండలాలు 26 ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,846 చ.కి.మీ.
  • జనాభా 18.84 లక్షలు ఉంది.

 

3.  మన్యం జిల్లా

  • కేంద్రం – పార్వతీపురం
  • 4 నియోజకవర్గాలు: పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు.
  • రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10).
  • మొత్తం 16 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,935 చ.కి.మీ.
  • జనాభా 9.72లక్షలు ఉంది.

 

4. అల్లూరి సీతారామరాజు జిల్లా

  • కేంద్రం – పాడేరు
  • 3 నియోజకవర్గాలు: పాడేరు, అరకు, రంపచోడవరం.
  • రెవెన్యూ డివిజన్లు కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11).
  •  మొత్తం 22 మండలాలు.
  • జిల్లా వైశాల్యం 12,251 చ.కి.మీ.
  • జనాభా 9.54 లక్షలు ఉంది.


5. విశాఖపట్నం జిల్లా

  • కేంద్రం – విశాఖపట్నం
  • 6 నియోజకవర్గాలు: భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక.
  • రెవెన్యూ డివిజన్లు కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5)
  • మొత్తం 10 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 928 చ.కి.మీ.
  • జనాభా 18.13 లక్షలుగా ఉంది.

 

6. అనకాపల్లి జిల్లా

  • కేంద్రం – అనకాపల్లి
  • 7 నియోజకవర్గాలు: పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి.
  • రెవెన్యూ డివిజన్లు నర్సీపట్నం(10), అనకాపల్లి(15).
  • 25 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 4,412 చ.కి.మీ.
  • జనాభా 18.73 లక్షలు ఉంది.

 

7. తూర్పుగోదావరి జిల్లా

  • కేంద్రం – కాకినాడ
  • 7 నియోజకవర్గాలు: తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం.
  • రెవెన్యూ డివిజన్లు పెద్దాపురం(12),కాకినాడ(7)
  • మొత్తం 19 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,605 చ.కి.మీ.
  • జనాభా 19.37 లక్షలు ఉంది.

 

8. కోనసీమ జిల్లా

  • కేంద్రం – అమలాపురం
  • 7 నియోజకవర్గాలు: రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం.
  • రెవెన్యూ డివిజన్లు రామచంద్రాపురం(8), అమలాపురం(16).
  • మొత్తం 24 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,615 చ.కి.మీ.
  • జనాభా 18.73 లక్షలు ఉంది.

 

9. రాజమహేంద్రవరం జిల్లా

  • కేంద్రం – రాజమహేంద్రవరం
  • 7 నియోజకవర్గాలు: అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం.
  • రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10).
  • 20 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,709 చ.కి.మీ.
  • జనాభా: 19.03 లక్షలు ఉంది.

 

10. నరసాపురం జిల్లా

  • కేంద్రం – భీమవరం
  • 7 నియోజకవర్గాలు: ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.
  • రెవెన్యూ డివిజన్లు నరసాపురం(8), కొత్తగా భీమవరం(11).
  • మొత్తం 19 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ.
  • జనాభా 17.80 లక్షలు ఉంది.

 

11. పశ్చిమగోదావరి జిల్లా

  • కేంద్రం – ఏలూరు
  • 7 నియోజకవర్గాలు: ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు కలిపి.
  • రెవెన్యూ డివిజన్లు ఏలూరు(12), జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6).
  • మొత్తం 27 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 6,413 చ.కి.మీ.
  • జనాభా: 20.03 లక్షలుగా ఉంది.

 

12. కృష్ణా జిల్లా

  • కేంద్రం – మచిలీపట్నం
  • 7 నియోజకవర్గాలు: గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ.
  • రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12).
  • మొత్తం 25 మండలాలు.
  • జిల్లా వైశాల్యం: 3,775 చ.కి.మీ.
  • జనాభా: 17.35 లక్షలు.

 

13. ఎన్టీఆర్ జిల్లా

  • కేంద్రం – విజయవాడ
  • 7 నియోజకవర్గాలు: పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు.
  • రెవెన్యూ డివిజన్లు విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
  • మొత్తం కలిపి 20 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,316 చ.కి.మీ.
  • జనాభా: 22.19 లక్షలు.

 

14. గుంటూరు జిల్లా

  • కేంద్రం – గుంటూరు
  • 7 నియోజకవర్గాలు: తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి కలుపుకొని.
  • రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8).
  •  మొత్తం 18 మండలాలు.
  • జిల్లా వైశాల్యం: 2,443 చ.కి.మీ.
  • జనాభా: 20.91 లక్షలు.

 

15. బాపట్ల జిల్లా

  • కేంద్రం – బాపట్ల
  • 6 నియోజకవర్గాలు: వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల.
  • రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
  • మొత్తం 25 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం : 3,829 చ.కి.మీ,
  • జనాభా : 15.87 లక్షలు ఉంది.

 

16. పల్నాడు జిల్లా

  • కేంద్రం – నరసరావుపేట
  • 7 నియోజకవర్గాలు: పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి.
  • రెవెన్యూ డివిజన్లు గురజాల (14), నరసరావుపేట(14)
  • మొత్తం 28 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 7,298 చ.కి.మీ,
  • జనాభా : 20.42 లక్షలు.

 

17. ప్రకాశం జిల్లా

  • కేంద్రం – ఒంగోలు
  • 8 నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి.
  • రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
  • మొత్తం 38 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 14,322 చ.కి.మీ,
  • జనాభా : 22.88 లక్షలు.

 

18. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

  • కేంద్రం – నెల్లూరు
  • 8 నియోజకవర్గాలు: కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు.
  • రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12)
  • మొత్తం 35 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 9,141 చ.కి.మీ,
  • జనాభా : 23.37 లక్షలు.

 

19. కర్నూలు జిల్లా

  • కేంద్రం – కర్నూలు
  • 8 నియోజకవర్గాలు: పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు.
  • రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17)
  • మొత్తం 28 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 8,507 చ.కి.మీ,
  • జనాభా : 23.66 లక్షలు.

 

20. నంద్యాల జిల్లా

  • కేంద్రం – నంద్యాల
  • 6 నియోజకవర్గాలు: నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు.
  • రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10)
  • మొత్తం 27 మండలాలు.
  • వైశాల్యం : 9,155 చ.కి.మీ,
  • జనాభా : 16.87 లక్షలు.

 

21. అనంతపురం జిల్లా

  • కేంద్రం – అనంతపురం
  • 8 నియోజకవర్గాలు: రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌.
  • రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8)
  • మొత్తం 34 మండలాలు.
  • వైశాల్యం : 11,359 చ.కి.మీ
  • జనాభా : 23.59 లక్షలు.

 

22. శ్రీసత్యసాయి జిల్లా

  • కేంద్రం – పుట్టపర్తి
  • 6 నియోజకవర్గాలు: మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి.
  • రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
  • మొత్తం 29 మండలాలు ఉంటాయి.
  • వైశాల్యం : 7,771 చ.కి.మీ,
  • జనాభా : 17.22 లక్షలు.

 

23. వైఎస్సార్‌ కడప జిల్లా

  • కేంద్రం – కడప
  • 7 నియోజకవర్గాలు: కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు.
  • రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12)
  • మొత్తం 34 మండలాలు ఉన్నాయి.
  • వైశాల్యం : 10,723 చ.కి.మీ,
  • జనాభా : 19.90 లక్షలు.

 

24. అన్నమయ్య జిల్లా

  • కేంద్రం – రాయచోటి
  • 6 నియోజకవర్గాలు: రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి.
  • రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
  • మొత్తం 32 మండలాలు.
  • వైశాల్యం : 8,459 చ.కి.మీ,
  • జనాభా : 17.68 లక్షలు.

 

25. చిత్తూరు జిల్లా

  • కేంద్రం – చిత్తూరు
  • 7 నియోజకవర్గాలు: నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు.
  • రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15)
  • మొత్తం కలిపి 33 మండలాలు ఉంటాయి.
  • వైశాల్యం : 7,210 చ.కి.మీ,
  • జనాభా : 19.85 లక్షలు

 

26. శ్రీ బాలాజీ జిల్లా

  • కేంద్రం – తిరుపతి
  • 7 నియోజకవర్గాలు: సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి కలుపుని.
  • రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11)
  • మొత్తం 35 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 9,176 చ.కి.మీ,
  • జనాభా : 22.18 లక్షలు ఉంది.