జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది.
127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.
జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.
సభ్యులు: అజయ్ నారాయణ్, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్, కార్యదర్శి అరవింద్ మెహతా
ఇది బహుళ సభ్య సంస్థ. ప్రారంభంలో 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబర్ 15 వరకు ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది. 1989, అక్టోబర్ 16న బహుళసభ్య కమిషన్‌గా మారింది. కానీ 1990లో తిరిగి ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది. చివరికి 1993 నుంచి ఒక ప్రధాన ఎన్నికల కమిషన్‌తో పాటు ఇద్దరు కమిషనర్లను కలిగి ఉండి బహుళసభ్య సంస్థగా పనిచేస్తుంది.
నోట్: జనవరి 25ను ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మొదటిసారి 2011లో నిర్వహించారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొంటున్నాయి.
నిర్మాణం: కేంద్ర ఎన్నికల సంస్థ రాజ్యాంగ సంస్థ, శాశ్వతసంస్థ.
324 ఆర్టికల్ ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
324 (1) ఆర్టికల్ ప్రకారం కింది విధులు నిర్వహిస్తుంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధులను 3 రకాలుగా పేర్కొనవచ్చు. అవి..
ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని సవరించడం
పార్లమెంట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు పర్యవేక్షణ
రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి గుర్తులను కేటాయించడం
పార్లమెంట్, రాష్ట్రశాసన సభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌కు సలహా ఇస్తుంది.
3. అర్ధన్యాయసంబంధమైన విధులు- (క్వాజీ జుడీషియల్)
రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలను విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ‘క్వాజీ జుడీషియల్ పవర్' అంటారు.
నోట్: ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు వచ్చిన వివాదాలను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ వివాదమైనా బాధితులు ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టులోనే దాఖలు చేయాలి.
నోట్: ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలైన అంశాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని మక్కల్ శక్తి కచ్చి Vs ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2011) కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది.
రాజ్యాంగం
అనేది మారుతూ, సజీవంగా ఉండే పత్రం. ఏ దేశ రాజ్యాంగం పవిత్రమైనది, స్థిరమైనది,
మార్చడానికి వీలులేనిదిగా ఉండదు. సమాజంలో మార్పులకు, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా
సవరణలకు వీలుగా ఉంటుంది. సాధారణంగా రాజ్యాంగాలను సాధారణ మెజారిటీతో లేదా ప్రత్యేక
మెజారిటీతో సవరిస్తారు.
సవరణ
అంటే కొత్త ప్రకరణలను చేర్చడం, ప్రకరణ తొలగించడం, పూర్తిగా తొలగించడం. ఒక
ప్రకరణలోని అంశం స్థానంలో మౌలిక అంశాన్ని చేర్చడం (Substitute) మొదలైనవి.
అంశాలన్నింటిని సవరణలు (Amendment)గానే పరిగణిస్తారు.
పద్ధతులు
368వ ఆర్టికల్ రాజ్యాంగ సవరణ
పద్ధతిని వివరిస్తుంది. రాజ్యాంగాన్ని 3 పద్ధతుల్లో సవరించే వీలుంది.
1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే
సవరణ పద్ధతి
2. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే
సవరణ పద్ధతి
3. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ, సగానికి కంటే
ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా జరిగే సవరణ పద్ధతి.
నోట్: రాజ్యాంగాన్ని సవరించే అధికారం
పార్లమెంటుకు ఉంటుంది.
1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సవరణ
ప్రక్రియను సవరించే అధికారం ఉంది.
2. ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలు
3. రాజ్యాంగ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి
రాదు
4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను రాజ్యాంగ
విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు.
5. సవరణ అధికారాల్లో మార్పులు, కూర్పులు, రద్దు
చేసే అంశంలో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.
నోట్: 368వ ఆర్టికల్‌ను ఇప్పటివరకు
రెండుసార్లు సవరించారు. 1971లో 24వ రాజ్యాంగ సవరణ, 1976లో 42వ రాజ్యాంగ సవరణ. 24వ
రాజ్యాంగ సవరణ ద్వారా 1, 3 క్లాజులు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4, 5 క్లాజులు
చేర్చారు. సుప్రీంకోర్టు 1980లో మినర్వామిల్స్ కేసులో 4, 5 క్లాజులు రాజ్యాంగ
విరుద్ధమని, మౌలికస్వరూపానికి విఘాతం కలిగిస్తాయని తీర్పుచెప్పింది.
ముఖ్యాంశాలు
అంశాలు
పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ
ద్వారా రాజ్యాంగంలోని పలు అంశాలు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరిస్తారు.
ప్రత్యేక మెజారిటీ అంటే పార్లమెంటులో ప్రతిసభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ
సభ్యులు (50శాతం కంటే ఎక్కువ) హాజరై ఓటువేసే సభ్యుల్లో మూడింట రెండు వంతులకు
తక్కువకాని మెజారిటీ సభ్యులు.
ప్రాథమిక హక్కులు (12-35
వరకు ఆర్టికల్స్)
ఆదేశిక సూత్రాలు (36-51 వరకు
ఆర్టికల్స్)
మొదటి, మూడో పద్ధతిలో
పేర్కొన్న ఇతర అన్ని అంశాలు.
పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ
రాష్ర్టాల ఆమోదం: సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను పార్లమెంటు తన ప్రత్యేక
మెజారిటీ ద్వారా సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తుంది. మిగిలిన రాష్ర్టాల్లో ఏ
ఒక్క రాష్ట్రం కాని, కొన్ని రాష్ర్టాలు కాని, అన్ని రాష్ర్టాలు ఈ బిల్లుపై చర్య
తీసుకోలేకపోయినా పరవాలేదు. సగం రాష్ర్టాలు ఆమోదించడంతో ఈ లాంఛనం పూర్తవుతుంది. ఈ
బిల్లుపై రాష్ర్టాలు తమ ఆమోదం ఇవ్వడానికి ఎటువంటి కాలపరిమితి లేదు.
ముఖ్యమైన సవరణలు
రాజ్యాంగసభనే తాత్కాలిక
పార్లమెంటుగా సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా 31(A), 31(B) ఆర్టికల్స్ కొత్తగా
చేర్చారు. 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చారు.
ముఖ్యాంశాలు
ఈ సవరణ ద్వారా అనేక ప్రకరణలను
సవరించారు. రాష్ర్టాల పునర్‌వ్యవస్ధీకరణకు సంబంధించిన రాజ్యాంగ
సవరణగా పేరుగాంచింది.
ముఖ్యాంశాలు
సుప్రీంకోర్టు సలహా ద్వారా
రాజ్యాంగ సవరణ చేశారు. భారత్, పాక్ మధ్య సరిహద్దు వివాద పరిష్కారం చేయడానికి
చేసిన సవరణ ఇది. సవరణకు సంబంధించిన ముఖ్యాంశం బేరుబారి ప్రాంతాన్ని రెండుభాగాలుగా
చేసి కొంత ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేశారు.
దాద్రానగర్ హవేలీని
కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం చేశారు.
గోవా, డామన్-డయ్యూలను భారత్‌లో
విలీనం చేశారు.
పాండిచ్చేరి ప్రాంతాన్ని
కేంద్రపాలిత ప్రాంతంగా భారత్‌లో చేర్చారు. దీంతోపాటు పాండిచ్చేరికి
ప్రత్యేకశాసనసభ, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
హైకోర్టు న్యాయమూర్తుల పదవీ
విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు పెంచారు. హైకోర్టులో పదవీ విరమణ చేసిన
న్యాయమూర్తులను తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించే అవకాశం కల్పించారు. హైకోర్టు
అధికార పరిధిని విస్తరించారు.
సింధీ భాషను అధికార భాషగా 8వ
షెడ్యూల్‌లో చేర్చారు. 15వ అధికార భాషగా సింధీ కొనసాగుతుంది.
పార్లమెంటుకు ప్రాథమిక
హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించారు. 13(4)
ఆర్టికల్‌ను చేరుస్తూ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనా న్యాయసమీక్ష పరిధిలోకి రాదు.
31(C) ఆర్టికల్‌ను రాజ్యాంగంలో
చేర్చారు. దీని ప్రకారం ఆదేశిక సూత్రాల్లోని 39(b), 39(c) అమలుకు చట్టాలు
చేస్తే న్యాయస్థానం ప్రశ్నించరాదు. ఈ చట్టాలు ప్రాథమిక హక్కులకు మినహాయింపు.
291 ఆర్టికల్ ప్రకారం భరణాలను
సంస్థానాధీశులకు చెల్లించేవారు. ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగం నుంచి తొలగించారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,
ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయసమీక్ష పరిధి
కిందకు రావు.
42వ
రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత అతిపెద్ద సవరణగా పేరుగాంచింది.
మొరార్జీదేశాయ్
ప్రభుత్వం రాజ్యాంగంలో సమగ్రమైన మార్పుల కోసం 44వ రాజ్యాంగ సవరణ చేసింది.
ఈ సవరణ
అమలు తేదీ- 1979 జూన్ 20, 1979 ఆగస్ట్ 1, 1979 సెప్టెంబర్ 6
ముఖ్యాంశాలు
2) సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి.
3) పార్లమెంట్ చేసిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే ఏ వ్యక్తినీ ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచకూడదు.
4) 2 నెలలు దాటిన నివారక నిర్బంధానికి సలహాసంఘం అనుమతి తప్పక ఉండాలి.
ముఖ్యాంశాలు: 1) అంతర్గత అశాంతి అనే పదాన్ని
తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.
2) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్
నెలలోపు (30 రోజులు) ఆమోదించాలి. ఈ సవరణ కంటే ముందు 2 నెలలుగా ఉండేది.
3) అత్యవసర పరిస్థితి ప్రకటనను ఒకసారి
ప్రకటించాక తిరిగి రద్దుచేసేంతవరకు నిరవధికంగా కొనసాగేది. కానీ ఈ సవరణ అత్యవసర
పరిస్థితిని ప్రకటించిన మొదటి 6 నెలల తర్వాత ప్రతి 6 నెలల పొడిగింపునకు పార్లమెంట్
అనుమతి తప్పక ఉండాలి.
రాజీవ్‌గాంధీ
ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి ఈ సవరణ చేశారు.
అమలు తేదీ
1985, మార్చి 1
సవరణకు
గురైన ఆర్టికల్స్ 101, 102, 190, 191
పార్టీ
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నూతనంగా చేర్చిన Xవ షెడ్యూల్‌లో చేర్చారు.
326వ
ఆర్టికల్‌ను సవరించారు.
అమలు తేదీ
1989, మార్చి 28
ముఖ్యాంశం:
ఓటుహక్కు కనీస వయో పరిమితిని 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించారు.
239(ఎఎ),
239(ఎబి) ఆర్టికల్స్‌ను చేర్చారు.
ఈ సవరణ
1992, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: 239(ఎఎ) ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత
ప్రాంతాన్ని ‘జాతీయ రాజధాని ప్రాంతం’గా పరిగణిస్తారు. దాని పరిపాలకుడిని
లెఫ్టినెంట్ గవర్నర్ అని పిలుస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక
శాసనసభ ఉటుంది.
239(ఎబి)
ఆర్టికల్ ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు
తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుపుతుంది.
ఆర్టికల్
54, 239(ఎఎ)లను సవరించారు.
1992,
డిసెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం:
ఢిల్లీ, పాండిచ్చేరి
అసెంబ్లీ సభ్యులకు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గణంలో భాగస్వామ్యం
కల్పించారు.
ఆర్టికల్
280ను సవరించి 280 (3)(బిబి)ను చేర్చారు.
243,
243(ఎ) నుంచి 243(ఓ) వరకు మొత్తం 16 ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు.
IXవ
భాగాన్ని తిరిగి చేరుస్తూ ‘ది పంచాయత్స్' అని పొందుపర్చారు.
XIవ
షెడ్యూల్‌ను నూతనంగా చేర్చారు.
సవరణ అమలు
తేదీ 1993, ఏప్రిల్ 24
ముఖ్యాంశం:
పంచాయతీ సంస్థలకు దేశమంతా ఒకే మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ, వాటికి రాజ్యాంగబద్ధత
కల్పించారు.
పంచాయతీ
సంస్థలకు 29 అంశాలల్లో రాష్ట్రప్రభుత్వాలు అధికారాలు కల్పించాలి.
ఆర్టికల్
280ను సవరించి 280(3)(సి)ను చేర్చారు.
243(పి)
నుంచి 243(2(జి)) ఆర్టికల్స్ చేర్చారు.
9(ఎ)వ
భాగాన్ని చేరుస్తూ ‘ది పంచాయతీస్' అని పొందుపర్చారు.
XIIవ
షెడ్యూల్‌ను నూతనంగా చేర్చారు.
1993, జూన్
1 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం:
నగరపాలక సంస్థలకు
దేశమంతా ఒక మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
నోట్: రాష్ట్రప్రభుత్వాలు నగరపాలక సంస్థలను
ఏర్పాటు చేసి మొత్తం 18 అంశాల్లో అధికారాలు కల్పించారు.
IXవ
షెడ్యూల్‌ను సవరించారు.
1994,
ఆగస్ట్ 31 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: న్యాయసమీక్ష పరిధి నుంచి బయటపడటానికి
తమిళనాడు ప్రభుత్వం కొన్ని తరగతులకు కల్పించిన రిజర్వేషన్ (విద్య, ఉద్యోగాల్లో
రిజర్వేషన్లను 69 శాతం పెంచుతున్న) చట్టాన్ని IXవ షెడ్యూల్‌లో చేర్చారు.
ఈ సవరణ
ద్వారా 16వ క్లాజ్ ఆర్టికల్‌కు క్లాజ్ (4ఎ)ను చేర్చారు.
1995, జూన్
17 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ప్రమోషన్స్‌లో
(ప్రభుత్వ ఉద్యోగాల) రిజర్వేషన్ కల్పించడం.
ఈ సవరణ
ద్వారా IXవ షెడ్యూల్‌ను సవరించారు.
1995,
ఆగస్ట్ 30 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: ఈ సవరణ ద్వారా బీహార్, కర్నాటక, కేరళ,
ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు సంబంధించి 27
భూసంస్కరణ చట్టాలను IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో
చట్టాల సంఖ్య 284కు పెరిగింది.
ఈ సవరణ
ద్వారా 16వ ఆర్టికల్‌కు క్లాజ్ 4బి ని చేర్చారు.
2000, జూన్
9 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం:
335 ఆర్టికల్‌లో
పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన రిజర్వేషన్ల కోటా ఆ ఏడాదిలో
భర్తీకాకపోవచ్చు. అలా భర్తీకాని ఖాళీలు ఈ సవరణ ద్వారా తర్వాత ఏడాది గాని, ఆపై
ఏడాదులకు సంబంధించిన రిజర్వేషన్ల కోటాలో కలపాలి. ఒక ఏడాదిలో రిజర్వేషన్ల శాతం 50
శాతం మించింది లేదా అన్న విషయాన్ని నిర్ధారించడంలో ఆ ఏడాది రిజర్వేషన్ కోటాలో
కలిసి ఉన్న గతేడాది ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోరాదు.
ఈ సవరణ
ద్వారా 243(ఎం) ఆర్టికల్‌ను సవరించారు.
2000,
సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: అరుణాచల్ ప్రదేశ్‌లో పూర్తిగా
గిరిజనులే నివసిస్తున్న కారణంగా అక్కడ ఎస్సీల కోసం పంచాయతీల్లో రిజర్వేషన్స్
కల్పించాల్సిన అవసరంలేదని ఈ సవరణ పేర్కొంటుంది.
దీని
ద్వారా 16(4ఎ) ఆర్టికల్‌ను సవరించారు.
2002,
జనవరి 4 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల
పదోన్నతిలో ఏదైనా తరగతికి చెందిన ‘పదోన్నతి విషయాల్లో’ అనే పదాల స్థానంలో
‘పదోన్నతికి చెందిన విషయాల్లో ఏదైనా తరగతికి చెందిన పర్యవసాన (తత్ఫలిత)
సీనియారిటీతో కూడిన’ అనే పదాలు చేర్చారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు
ఈ సవరణ చేశారు.
51(ఎ), 45
ఆర్టికల్స్‌ను సవరించారు.
21(ఎ)
ఆర్టికల్‌ను నూతనంగా చేర్చారు.
2002,
డిసెంబర్ 12 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: 6-14 ఏండ్ల మధ్య వయస్సుగల పిల్లలందరికి
విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా చేసింది. అదేవిధంగా 45వ ఆర్టికల్‌లో ఆరేండ్లలోపు
పూర్వ ప్రాథమిక విద్యాహక్కును చేర్చారు.
ఈ సవరణ
ద్వారా 338(ఎ) ఆర్టికల్‌ను చేర్చారు.
2003,
సెప్టెంబర్ 28 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: ఈ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ
కమిషన్లను రాజ్యాంగం ప్రకారం వేరుచేశారు. అంటే జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ
కమిషన్‌లుగా ఏర్పాటు చేశారు.
338
ఆర్టికల్: జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణం
338(ఎ)
ఆర్టికల్: జాతీయ ఎస్టీ కమిషన్ నిర్మాణం
75, 164
ఆర్టికల్స్‌ను సవరించారు. 361(బి) ఆర్టికల్‌ను చేర్చారు.
Xవ
షెడ్యూల్‌ను కూడా సవరించారు.
ముఖ్యాంశం:
మంత్రివర్గంలోని
మంత్రుల సంఖ్య చట్టసభలోని సభ్యుల సంఖ్యలో 15 శాతానికి పరిమితం చేసేందుకు
ఉద్దేశించింది. చిన్న రాష్ర్టాల్లో ఈ సంఖ్య 12కు తగ్గరాదు.
75(1ఎ),
75(1బి), 164(1ఎ), 164(1బి) ఆర్టికల్స్‌ను చేర్చారు.
Xవ
షెడ్యూల్ కింద సభ్యత్వం కోల్పోయినప్పుడు వారిని కేంద్రమంత్రిగా లేదా
రాష్ట్రమంత్రిగా నియమించరాదు.
ఈ సవరణ
ద్వారా 15 ఆర్టికల్‌కు 5వ క్లాజ్‌ను చేర్చారు.
2006,
జనవరి 20 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశాలు:
సామాజికంగా,
విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారు లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఓబీసీలకు ప్రభుత్వ,
ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్ ప్రభుత్వం కల్పించవచ్చు.
నోట్: 30(1) ఆర్టికల్ ప్రకారం మైనారిటీ
విద్యాసంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్స్ వర్తించవు.
94వ
రాజ్యాంగ సవరణ చట్టం- 2006
ఈ సవరణ
ద్వారా ఆర్టికల్ 164(1)ను సవరించారు.
2006, జూన్
12 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: బీహార్ మంత్రిమండలిలో షెడ్యూల్డ్
తెగల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడాన్ని తొలగిస్తూ దాని
స్థానంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ర్టాల గవర్నర్లు
తప్పనిసరిగా ఆయా రాష్ర్టాల్లో గిరిజన మంత్రిత్వ శాఖల ఏర్పాటు చేయాలని సవరించారు.
VIIIవ
షెడ్యూల్‌ను సవరించారు.
2011,
సెప్టెంబర్ 23 నుంచి అమలులోకి వచ్చింది.
ముఖ్యాంశం: VIIIవ షెడ్యూల్‌లో 15వ ఎంట్రీ అయిన ‘ఒరియా’ పదం స్థానంలో ‘ఒడియా’ అనే పదాన్ని చేర్చారు.
97వ రాజ్యాంగ సవరణ చట్టం-2011
ఈ సవరణ ద్వారా 19(సి) ఆర్టికల్‌ను సవరించారు. నూతనంగా చేర్చిన ప్రకరణలు 43 (బి), 243 (జడ్ హెచ్) 243 (జడ్ టీ) వరకు. రాజ్యాంగంలో 9 (బి) భాగాన్ని చేర్చారు.
సవరణ అమలు తేదీ- 2012 జనవరి 12
ముఖ్యాంశాలు
ఆర్టికల్ 19(సి)లో కో-ఆపరేటివ్ సొసైటీలు (సహకార సంఘాలు) అనే పదాన్ని చేర్చారు. దీని ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించారు. 43 (బి) ఆర్టికల్ ప్రకారం సహకార సంఘాల ఏర్పాటు, వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి.
9 (బి) భాగాన్ని రాజ్యాంగంలో చేరుస్తూ సహకార సంఘాల గురించి 243 (ZCH) నుంచి 243 (Z (T)) వరకు ఆర్టికల్స్‌ను చేర్చారు.
98వ రాజ్యాంగ సవరణ చట్టం-2012
ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో 371 (J) ఆర్టికల్‌ను చేర్చారు.
సవరణ అమలు తేదీ- 2013 జనవరి 1
ముఖ్యాంశాలు
కర్ణాటక రాష్ట్రంలోని 6 జిల్లాలకు సంబంధించి నూతనంగా ఆర్టికల్ 371 (J)ని చేర్చారు. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో నిజాం పాలనలో ఉండి తర్వాత కర్ణాటక రాష్ట్రంలో చేర్చిన జిల్లాలు ఆరు. అవి..
గుల్బర్గా, బీదర్, రాయ్‌చూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి
ఈ జిల్లాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఈ ప్రకరణలో ఉన్నాయి. వీటికి ఒక ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయడం, గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు, నిధుల కేటాయింపు, ప్రత్యేక విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు వంటి అంశాలు ప్రకరణ 371 (J)లో ఉన్నాయి.
99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014
ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో 3 ప్రకరణలు చేర్చారు. అవి.. 124(ఎ), 124 (బి), 124 (సి ). ఆర్టికల్స్ 124, 127, 128, 217, 222, 224(ఎ) 231లను సవరించారు.
సవరణ అమలు తేదీ- 2015 ఏప్రిల్ 13
ముఖ్యాంశాలు
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై సిఫారసు చేసేందుకు జాతీయన్యాయ నియామకాల కమిషన్, దీనికి అనుగుణంగా న్యాయనియామకాల కమిషన్ ఏర్పాటయ్యాయి. వీటికి అనుగుణంగా నూతన ప్రకరణలు చేర్చారు.
121వ రాజ్యాంగ సవరణ బిల్లు-2014ను లోక్‌సభ 2014 ఆగస్టు 13న, రాజ్యసభ 2014 ఆగస్టు 14న ఆమోదించాయి. 17 రాష్ర్టాలు, రాష్ట్రపతి ఆమోదించినది 2014 డిసెంబర్ 31న.
121వ రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014లో గెజిట్‌గా ప్రచరించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించడాన్ని తొలగిస్తూ జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్‌ను తీసుకురావడడానికి 99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014ను చేశారు.
సుప్రీంకోర్టు అడ్వకేట్స్ రికార్డ్ అసోసియేషన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో 99వ రాజ్యంగ సవరణ చట్టాన్ని కొట్టివేసింది.
నోట్: జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు 5గురు జడ్జిల బెంచ్ (4:1) 2015 అక్టోబర్ 16న NJAC/99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014ను కొట్టివేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది.
100 వ రాజ్యాంగ సవరణ చట్టం-2015
ఈ సవరణ ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులను సవరిస్తూ 1వ షెడ్యూల్‌ను సవరించారు.
సవరణ అమలు తేదీ- 2015 జూలై 31
ముఖ్యాంశాలు
అస్సాం రాష్ట్రంలోని భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన కొంత భూభాగాన్ని భారతదేశానికి ఈ చట్టం ద్వారా బదిలీచేశారు.
ఈ చట్టం వల్ల భారతదేశం బంగ్లాదేశ్ నుంచి 7110 ఎకరాల ప్రాంతాన్ని (51 గ్రామాలు) పొందింది. బంగ్లాదేశ్ భారత్ నుంచి 17,160 ఎకరాలు (111 గ్రామాలు) పొందింది.
నోట్: భారత్-బంగ్లాదేశ్ ఒప్పందం- 1974 ప్రకారం ఇరుదేశాల మధ్య సరిహద్దుల మార్పుకోసం అంగీకారం కుదిరింది. దీనికి రాజ్యాంగ సవరణ అమలుకాలేదు.
100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొదటి షెడ్యూల్‌ను సవరించడంతో అమల్లోకి వచ్చింది.
నోట్: భారత్ తన పొరుగువారితో పంచుకునే అంతర్జాతీయ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు అతిపెద్దది (మొత్తం 4096 కి.మీ).
ముఖ్యాంశాలు
1. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని హరించివేస్తుంది.
2. కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయవ్యవస్థను వేరుచేయాలని రాజ్యాంగం పేర్కొంటుంది.
3. ‘న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి’ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం.
4. ‘జాతీయ న్యాయనియామకాల కమిషన్' నిర్మాణం విరుద్ధం.
5. కొలీజియం రాజ్యాంగబద్ధమైనది. కొనసాగుతుంది.
నోట్: ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం సిఫారసును రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి కొలీజియం సిఫారసును ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. చివరికి కొలీజియం సిఫారసు మేరకే రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలి.
కొలీజియం
దీనిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు ఉంటారు.
చైర్మన్- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జాతీయ న్యాయ నియామకాల కమిషన్
(ఎన్‌జీఏసీ)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్రపతి నామినేట్ చేసిన ఇద్దరు న్యాయనిపుణులతో కలిసి మొత్తం 6గురు సభ్యులు ఉంటారు.
చైర్మన్- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
101 వ రాజ్యాంగ సవరణ చట్టం-2016
ఈ సవరణ ద్వారా భారత్ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారింది. జీఎస్టీ అమలు కోసం ఈ సవరణ చేశారు.
ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ప్రకరణలు- 246(ఎ), 269(ఎ), 279(ఎ)
ఈ సవరణ 248, 249, 250, 268, 269, 270, 271, 286, 366, 368 ప్రకరణలను మార్పుచేసింది.
ఈ సవరణ ద్వారా VI & VII షెడ్యూళ్లను సవరించింది.
VIIవ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర జాబితాలో సవరణ చేశారు.
కేంద్రజాబితా- 84వ ఎంట్రీలో ఉన్న అంశాలను తొలగించి, కొత్త అంశాలను చేర్చారు. అదేవిధంగా ఈ జాబితాలోని 92, 92సి ఎంట్రీలను రద్దు చేశారు.
రాష్ట్ర జాబితా 52, 55 ఎంట్రీలు రద్దయ్యాయి.
54, 62 ఎంట్రీల్లో ఉన్న అంశాలను తొలగించి, కొత్త అంశాలను చేర్చారు.
ఈ సవరణ ద్వారా 268(ఎ) ఆర్టికల్‌ను తొలగించారు.
నోట్: సవరణ అమలు తేదీ 2017 జూలై 1. అయితే జీఎస్టీ 2012 సెప్టెంబర్ 1 నాటికే పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వ కాలం (మన్మోహన్‌సింగ్)లో పార్లమెంట్‌లో 115వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు (2011). కానీ లోక్‌సభ రద్దుకావడంతో వీగిపోయింది. తరువాత మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లును 2014 డిసెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2015 మే 6న లోక్‌సభ, 2016 ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించాయి.
2016 ఆగస్టు 12న అసోం రాష్ట్రం మొదటిసారిగా జీఎస్టీని ఆమోదించింది.
2016 సెప్టెంబర్ 8 నాటికి 20 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదే రోజున రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
122వ రాజ్యాంగ సవరణ బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది.
నోట్: 246(ఎ) ఆర్టికల్- వస్తువులు, సేవలపై విధించే పన్నులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు.
269(ఎ) ఆర్టికల్: అంతర్‌రాష్ట్ర వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించి వస్తువులు, సేవలపై పన్ను విధింపు, పన్ను వసూలు గురించి తెలుపుతుంది.
279(ఎ) ఆర్టికల్- జీఎస్టీ మండలి.
102వ రాజ్యాంగ సవరణ చట్టం-2018
ఈ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చారు.
సవరణ అమలు తేదీ 2018 ఆగస్టు 11
123వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 2017 పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లును లోక్‌సభ 2018 ఆగస్టు 2న, రాజ్యసభ 2018 ఆగస్టు 8న ఆమోదించాయి.
ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్స్ 338(బి), 342(ఎ), 366(26).
338(బి) ఆర్టికల్- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది.
342(ఎ) ఆర్టికల్- ఏదైనా ఒక తరగతిని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినదిగా (SEBC) తెలియజేయడానికి రాష్ట్రపతికి ఉన్న శక్తి గురించి వివరిస్తుంది.
SEBC జాబితాను మార్చడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.
నోట్: ఏదైనా రాష్ట్రం ఒక వర్గాన్ని SEBC గా మార్చాలని భావిస్తే గవర్నర్ సిఫారసు మేరకు దానిని SEBCగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
366 (26): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచించడానికి, ఉపసంహరణల చట్టం కింద ప్రస్తుతం కొనసాగుతున్న NCBC చట్టాన్ని ఉపసంహరించుకుని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటవుతుంది.
ఈ ఆర్టికల్ ప్రకారం SEBC జాబితా (OBC)ను కేంద్రం సవరిస్తుంది.
1993లో జాతీయ బీసీ కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.
జాతీయ బీసీ కమిషన్ పేరును NESEBC (National Commission For Socially, Educationally Backword Clsasses)గా మార్చారు.
103వ రాజ్యాంగ సవరణ చట్టం
ఈ సవరణ ద్వారా 15(6), 16(6) ఆర్టికల్స్‌ను చేర్చారు.
ముఖ్యాంశాలు
అగ్రకులాల్లోని (రిజర్వ్ చేయని కేటగిరీ) ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చు.
ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడానికి ఈ చట్టం ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లకు క్లాజ్ 6ను చేర్చారు.
15(6) ఆర్టికల్: సమాజంలోని అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS) ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో 10శాతం వరకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు.
16(6) ఆర్టికల్: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం వరకు రిజర్వేషన్ కల్పించవచ్చు.
ఇందిరా సాహ్నీ కేసు-1992: సుప్రీంకోర్టు ఈ కేసులో SC, ST, BCలకు రిజర్వేషన్ల గురించి కింది విధంగా పేర్కొంది.
SC, ST, BC రిజర్వేషన్స్ కోటా 50 శాతానికి మించకూడదు.
ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించరాదు.
అగ్రకులాలవారికి (ఈబీసీ) రిజర్వేషన్స్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం.
అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్ కోటా 50 శాతం మించవచ్చు.
సామాజిక, విద్యాపరంగా వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ కల్పించాలి.
46వ ఆర్టికల్ ప్రకారం సమాజంలోని బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడానికి పరిమితులు
వార్షికాదాయం 8లక్షల కన్నా తక్కువ ఉండాలి.
5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమిని లేదా పట్టణంలో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఇల్లు లేదా నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 చదరపు గజాలు ఉండాలి.
బీసీ కమిషన్ నిర్మాణం