Showing posts with label GEOGRAPHY. Show all posts
Showing posts with label GEOGRAPHY. Show all posts

భారత్‌ సరిహద్దులు - ఘర్షణలు

 

1) భారత్‌-చైనా యుద్ధం

– ప్రారంభం- 1962, అక్టోబర్‌ 20
-ముగింపు- 1962, నవంబర్‌ 21

– కారణం- జమ్ముకశ్మీర్‌ (ప్రస్తుత లఢక్‌)లోని ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని చైనా పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ దురాక్రమణ చేయడం.
-ఫలితం- చైనా సైన్యం విజయం. ఆక్సాయ్‌చిన్‌ ఆక్రమణ. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఊహాజనిత సరిహద్దు రేఖగా వాస్తవాధీన రేఖ (Line of Actual Control)ను ఏర్పాటు చేశారు.

2) నాథులా వివాదం

-దీనినే భారత్‌, చైనా యుద్ధం-1967 అని పిలుస్తారు.
– 1967, ఆగస్ట్ లో చైనా సైన్యం నాథులా పాస్ వద్ద చొరబడింది. దీంతో ఘర్షణ ప్రారంభమై 1967, సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగింది. సుమారు 400 మంది చైనా సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు.
-ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ.

3) చో లా వివాదం

-చో లా పాస్ సిక్కిం రాష్ట్రాన్ని చైనాలోని టిబెట్‌ ప్రాంతంలో కలుపుతుంది.
– 1967, అక్టోబర్‌ 1న చైనా దళాలు చో లా కనుమ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్‌ చేసి ఘర్షణలకు దిగింది.
– ఈ సంఘటనలో 83 మంది భారత సైనికులు చనిపోయారు.

4) అరుణాచల్‌ప్రదేశ్‌ వివాదం-1987

-1986లో అరుణాచల్‌ప్రదేశ్‌కు భారత్‌ రాష్ట్రహోదా ఇచ్చినప్పుడు చైనా నిరసన వ్యక్తం చేసింది.
– అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగం అని వాదిస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్‌డోరాంగ్‌ చు లోయలోకి ప్రవేశించి హెలిప్యాడ్‌లు, శాశ్వత నిర్మాణాలు నిర్మించడం ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి భారతసైన్యం ‘ఆపరేషన్‌ ఫాల్కన్‌ (Ope ration Falcon)ను ప్రారంభించింది.
-చైనా సైన్యం వెనక్కి తగ్గేంతవరకు భారతసైన్యం సరిహద్దుల్లోనే మోహరించింది.
-ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి అధికారిక సమావేశం జరిగింది.
-చర్చలకు రెండు దేశాలూ అంగీకరించాయి.
– ఈ ఘటన 1993 ఒప్పందానికి దారితీసింది.

1993 ఒప్పందం

-అప్పటి భారత ప్రధాని పీవీ నర్సింహారావు, చైనా అధ్యక్షుడు లీ పెంగ్‌ల మధ్య 1993, సెప్టెంబర్‌ 7న ‘సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందం (Border Peace and Tranquility Agreement)’ జరిగింది.

-ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ఏసీ పశ్చిమ, తూర్పు, మధ్య సెక్టార్ల కచ్చితమైన స్థానాలు గుర్తించారు.

-ఇరుపక్షాలు 15,000 మంది కంటే ఎక్కువ మందితో సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు.

భారత్‌-చైనా ఒప్పందం-1996

– అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.
-ఇది చైనా అధ్యక్షుడి తొలి భారత పర్యటన.
-ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మ్యాపుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది.

5) డెప్సాంగ్‌ ఘర్షణలు (Depsang Disputes) -2013

-ఈ ఘర్షణలు లఢక్‌ ప్రాంతంలోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ (డీబీవో) వద్ద జరిగాయి.
– 2013, ఏప్రిల్‌ 15న డీబీవో సమీపంలోని రాఖీనులా ప్రాంతం వద్ద శాశ్వత శిబిరాలను చైనా సైన్యం నిర్మించడంతో ఘర్షణలు జరిగాయి.

6) చుమార్‌ ఘర్షణ (Chumar Dispute)- 2014

-చుమార్‌ ప్రాంతం వద్ద చైనా ఒక హైవేను నిర్మించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది.
-భారత్‌ తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా హైవే నిర్మాణాన్ని నిలిపివేసింది.

7) డోక్లాం ఘర్షణ (Doklam Dispute)- 2017

– డోక్లాం అనేది భూటాన్‌లోని ఒక పీఠభూమి ప్రాంతం.

-ఇది భారత్‌, చైనా, భూటాన్‌లకు అత్యం త వ్యూహాత్మక ప్రదేశం.

-ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సిలిగురి ప్రాంతం (Chicken Neck)ను రక్షించే ప్రధాన భూభాగం.

-చైనా ప్రతిష్ఠాత్మక వన్‌ బెల్ట్ వన్‌ రోడ్‌ కార్యక్రమంలో భాగంగా, డోక్లాం మీదుగా రోడ్డు నిర్మాణాలను చేపట్టింది చైనా.

-దీంతో భారత్‌ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో 73 రోజుల పాటు ప్రతిష్టంభన జరిగింది.

8) 2020- గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ త్సో సరస్సు ఘర్షణలు (Galwan Valley Disputes)

-పాంగాంగ్‌ త్సో సరస్సు (గల్వాన్‌ లోయ) వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగడంతో (2020, మే 5) యుద్ధ వాతావరణం నెలకొంది.

– భారత సైనికులు 20 మంది, చైనా సైనికులు 40 మంది మరణించినట్లు అంచనా.

-2020, జూన్‌ 16 వరకు ఈ ఘర్షణలు కొనసాగాయి.

9) అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా నామకరణం

-2020, డిసెంబర్‌ 30న అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తమ పేర్లను పెట్టింది.

– అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమంటూ, దానిని ‘జన్‌గ్నాన్‌’ పేరుతో పిలుస్తున్నట్లు చైనా వాదిస్తుంది.

– ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలున్నాయి. అవి.. 1) సెంగ్కెజాంగ్‌ 2) దాగ్లుంగ్‌ జాంగ్‌, 3) మునిగాంగ్‌ 4) డుడింగ్‌, 5) మిగ్‌పెయిన్‌
6) గోలింగ్‌, 7) డంబా 8) మెజాగ్‌

-నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్‌జుబ్‌ రి, కున్‌మింగ్‌ జింగ్‌ పెంగ్‌ అని పేర్లు పెట్టింది.
– రెండు నదులకు జెన్‌యోగ్మీ, దులైని అని, ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టింది.
-గతంలో 2017లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లను పెట్టింది చైనా.

భారత అటవీ నివేదిక-2021

 

 -నివేదిక పేరు- ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్‌ఆర్‌)
-విడుదల చేసేది- ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా (పర్యావరణ, అటవీ అండ్‌ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ).

ఎడిషన్‌- 17

– తొలి ఎడిషన్‌- 1987 (ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి)
-డేటా పీరియడ్‌- 2019-20
-ఉపగ్రహం- రిసోర్సెస్ శాట్‌-2

ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు

1) రష్యా 2) బ్రెజిల్‌
3) కెనడా 4) యూఎస్ఏ
5) చైనా 6) ఆస్ట్రేలియా
7) డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
8) ఇండోనేషియా 9) పెరూ
10) భారత దేశం

– 2010-20 మధ్య అత్యధిక వార్షిక నికర అటవీ పెరుగుదల గల దేశాలు-

1) చైనా 2) ఆస్ట్రేలియా
3) భారత దేశం 4) చిలీ

-l దేశంలో మొత్తం కార్బన్‌ స్టాక్‌- 7204 మిలియన్‌ టన్నులు
-దేశంలో మొత్తం టైగర్‌ రిజర్వ్‍లు- 52 (అత్యధికం- మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర- 6 చొప్పున)
-దేశంలో టైగర్‌ రిజర్వ్‍ల విస్తీర్ణం- 74,710 చ.కి.మీ.
-దేశంలో మొత్తం పర్వత జిల్లాలు (Hill Districts)- 140 (అత్యధికం- జమ్ముకశ్మీర్‌-22, అరుణాచల్‌ ప్రదేశ్‌-16)

ముఖ్యాంశాలు

-మొత్తం అటవీ విస్తీర్ణం (Total Forest Area)- 24.62 శాతం (Forest+Tree )
-అటవీయేతర భూమి- 76.87 శాతం
-మొత్తం ఫారెస్ట్ కవర్‌ (Foresr Cover)- 21.71 శాతం

ఫారెస్ట్ ఏరియా/రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా

-ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా అటవీ భూమిగా చూపిన దానిని ఫారెస్ట్ ఏరియా లేదా రికార్డెడ్‌ ఫారెస్ట్‍ ఏరియా అని అంటారు. దీనికి చట్టబద్ధత (Legal Status) ఉంటుంది.

ఫారెస్ట్ కవర్‌ (Forest Cover)

– నిర్దిష్ట భూభాగంలోని చెట్ల శాతాన్ని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు. లేదా ఒక హెక్టార్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంగల భూభాగంలో 10 శాతం కంటే ఎక్కువ చెట్ల సాంద్రత ఉంది. దానిని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు.

అటవీ విస్తీర్ణం – విభజన

-అత్యంత దట్టమైన అడవి (Very Dense)- 99,779 చ.కి.మీ.- 3.04 శాతం
– మాధ్యమిక దట్టమైన అడవి (Moderate Dense)- 3,06,890 చ.కి.మీ. – 9.33 శాతం
-ఓపెన్‌ ఫారెస్ట్ (OF) – 3,07,120 చ.కి.మీ.- 9.34 శాతం
– మొత్తం ఫారెస్ట్ కవర్‌ – 7,13,789 చ.కి.మీ.- 21.71 శాతం
– ట్రీ కవర్‌ (చెట్లు)- 95,748 చ.కి.మీ.
– 2.91 శాతం

మొత్తం ఫారెస్ట్ ఏరియా

– 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం
l పొదలు (Scrubs)- 46,539 చ.కి.మీ. – 1.42 శాతం

ప్రత్యేకతలు

– టైగర్‌ రిజర్వ్, టైగర్‌ కారిడార్స్​‍, గిర్‌ ఫారెస్ట్‍లలో తొలిసారి ఫారెస్ట్ కవర్‌ను అంచనా వేశారు.
– అత్యధిక అటవీ పెరుగుదల కనిపించిన టైగర్‌ రిజర్వ్‍- బక్సా (పశ్చిమ బెంగాల్‌), అన్నామలై (తమిళనాడు), ఇంద్రావతి (ఛత్తీస్గఢ్‌), కవ్వాల్‌ (తెలంగాణ), భద్ర (కర్ణాటక), సుందర్బన్స్​‍ (పశ్చిమ బెంగాల్‌)
-అత్యధిక ఫారెస్ట్‍ కవర్‌ (97 శాతం) కలిగిన టైగర్‌ రిజర్వ్‍- పక్కే టైగర్‌ రిజర్వ్‍ (అరుణాచల్‌ ప్రదేశ్‌)
దేశంలో మొత్తం అటవీ భూమి: 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం

-అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలు (ఫారెస్ట్ + ట్రీ కవర్‌)

1) మధ్యప్రదేశ్‌ (94,689 చ.కి.మీ.)
2) మహారాష్ట్ర (61,952 చ.కి.మీ.)
3) ఒడిశా (61,204 చ.కి.మీ.)
4) ఛత్తీస్గఢ్‌ (59,816 చ.కి.మీ.)
5) అరుణాచల్‌ ప్రదేశ్‌ (51,540 చ.కి.మీ.)

ఫారెస్ట్ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌ (77,493 చ.కి.మీ.)
2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) ఛత్తీస్గఢ్‌
4) ఒడిశా
5) మహారాష్ట్ర

శాతం పరంగా అత్యధిక ఫారెస్ట్ కవర్‌ గల రాష్ట్రాలు

1) మిజోరం (84.53 శాతం)
2) అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33 శాతం)
3) మేఘాలయ (76 శాతం)
4) మణిపూర్‌ (74.34 శాతం)
5) నాగాలాండ్‌ (73.90 శాతం)

2019-21 మధ్య అత్యధిక అటవీ పెరుగుదల గల రాష్ట్రాలు

1) ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ.)
2) తెలంగాణ (638 చ.కి.మీ.)
3) ఒడిశా (537 చ.కి.మీ.)
4) కర్ణాటక (155 చ.కి.మీ.)

 2019-21మధ్య భారీగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయిన రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌ (-257 చ.కి.మీ.)
2) మణిపూర్‌ (-249 చ.కి.మీ.)
3) నాగాలాండ్‌ (-235 చ.కి.మీ.)
4) మిజోరం (-186 చ.కి.మీ.)

2019-21 మధ్య దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం- 2261 చ.కి.మీ.- ఫారెస్ట్ కవర్‌ 1540 చ.కి.మీ. + ట్రీ కవర్‌ 721 చ.కి.మీ.

-దేశంలో 33 శాతం కంటే అధికంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు/యూటీలు- 17

-తమ భౌగోళిక విస్తీర్ణంలో 75 శాతం మించి అటవీ భూమి గల రాష్ట్రాలు/యూటీలు- 5 (1. లక్షద్వీప్‌, 2. మిజోరం, 3. అండమాన్‌ నికోబార్‌ దీవులు, 4. అరుణాచల్‌ ప్రదేశ్‌, 5. మేఘాలయ)

ట్రీ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (12,108 చ.కి.మీ.)
2) రాజస్థాన్‌ (8733 చ.కి.మీ.)
3) మధ్యప్రదేశ్‌ (8054 చ.కి.మీ.)
4) కర్ణాటక (7494 చ.కి.మీ.)
5) ఉత్తరప్రదేశ్‌ (7421 చ.కి.మీ.)

శాతం పరంగా ట్రీ కవర్‌ అత్యధికం గల రాష్ట్రాలు/యూటీలు

1) చండీగఢ్‌ (13.16 శాతం)
2) ఢిల్లీ (9.91 శాతం)
3) కేరళ (7.26 శాతం)
4) గోవా (6.59 శాతం)

 ట్రీ అవుట్‌సైడ్‌ ఫారెస్ట్‍ అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (26,866 చ.కి.మీ.)
2) ఒడిశా (24,474 చ.కి.మీ.)
3) కర్ణాటక (23,676 చ.కి.మీ.)

వెదురు అరణ్యాలు అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌
2) అరుణాచల్‌ ప్రదేశ్‌
3) మహారాష్ట్ర

దేశంలో మడ అడవులు గల రాష్ట్రాలు/ యూటీలు – 9+3 = 12

1) ఆంధప్రదేశ్‌- 405 చ.కి.మీ.
2) గోవా- 27 చ.కి.మీ.
3) గుజరాత్‌- 1175 చ.కి.మీ.
4) కర్ణాటక- 13 చ.కి.మీ.
5) కేరళ- 9 చ.కి.మీ.
6) మహారాష్ట్ర- 324 చ.కి.మీ.
7) ఒడిశా- 259 చ.కి.మీ.
8) తమిళనాడు- 45 చ.కి.మీ.
9) పశ్చిమ బంగ- 2114 చ.కి.మీ.
10) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 616 చ.కి.మీ.
11) దమన్‌ దీవ్‌ అండ్‌ దాద్రానగర్‌ హవేలీ- 3 చ.కి.మీ.
12) పుదుచ్చేరి- 2 చ.కి.మీ.

అత్యధికంగా మడ అడవులు గల రాష్ట్రాలు

1) పశ్చిమ బంగ (2114 చ.కి.మీ.)
2) గుజరాత్‌ (1175 చ.కి.మీ.)
-యూటీ- అండమాన్‌ నికోబార్‌ దీవులు (616 చ.కి.మీ.)

ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు గల జిల్లాలు- 6 (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం). అత్యధికం తూర్పు గోదావరి (187.8 చ.కి.మీ.), అత్యల్పం పశ్చిమ గోదావరి (0 చ.కి.మీ.)
-దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం- 4992 చ.కి.మీ.

ఇతర అంశాలు

– దేశంలో మొత్తం అడవుల్లో 35.46 శాతం కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నాయి.
– 2030 నాటికి 45-64 శాతం అడవుల వాతావరణ మార్పులకు గురికానున్నాయి. దీనిలో
-అత్యంత ప్రభావం చెందేది- లడఖ్‌
-2019తో పోలిస్తే దేశంలో 79.4 మిలియన్‌ టన్నుల కార్బన్‌ స్టాక్‌ దేశంలో పెరిగింది.
-2019తో పోలిస్తే దేశంలో 17 చ.కి.మీ. మడ అడవులు పెరిగాయి.

-దేశంలో దట్టమైన అడవులు (VDF), ఓపెన్‌ ఫారెస్ట్ లలో పెరుగుదల కనిపించగా, మధ్యస్థ అడవుల్లో తగ్గుదల కనిపించింది.

అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) గోవా- 1271 చ.కి.మీ.
2) హర్యానా- 1559 చ.కి.మీ.
3) పంజాబ్‌- 3084 చ.కి.మీ.
4) సిక్కిం- 5841 చ.కి.మీ.

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు

1) హర్యానా- 3.53 శాతం
2) పంజాబ్‌- 6.12 శాతం
3) ఉత్తరప్రదేశ్‌- 7.22 శాతం
4) బీహార్‌- 7.90 శాతం

కేంద్ర పాలిత ప్రాంతాలు

1) జమ్ముకశ్మీర్‌- 20.199 చ.కి.మీ.
2) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 7171 చ.కి.మీ.
3) లడఖ్‌- 7 చ.కి.మీ.
4) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవ్‌- 214 చ.కి.మీ.
5) ఢిల్లీ- 103 చ.కి.మీ.
6) చండీఘర్‌- 35 చ.కి.మీ.
7) పుదుచ్చేరి- 13 చ.కి.మీ.
8) లక్షద్వీప్‌- 0 చ.కి.మీ.


శాతం పరంగా

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 86.93 శాతం
2) జమ్ముకశ్మీర్‌- 36.98 శాతం
3) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవి- 35.55 శాతం
4) చండీఘర్‌- 30.70 శాతం
l తెలంగాణ- 27,688 చ.కి.మీ. (24.70 శాతం)
l ఆంధ్రప్రదేశ్‌- 37,258 చ.కి.మీ. (22.86 శాతం)

ఫారెస్ట్ కవర్‌

l ఆంధ్రప్రదేశ్‌- 29,784 చ.కి.మీ. (18.28 శాతం)
l తెలంగాణ- 21,124 చ.కి.మీ. (18.93 శాతం)

పులుల గణన-2020

దేశంలోని మొత్తం పులులు- 2967 (2018), 2226 (2014 నాటికి)

రాష్ట్రాలు/జోన్ల వారీగా పులుల సంఖ్య

– శివాలిక్‌-గంగా మైదానం- 646
– మధ్య భారతదేశం+తూర్పు కనుమలు- 1033
– పశ్చిమ కనుమలు- 981
– పూర్వాంచల్‌ హిమాలయాలు+బ్రహ్మపుత్ర నదీలోయ- 219
– ఉత్తరాఖండ్‌- 442
-ఉత్తరప్రదేశ్‌- 173
– బీహార్‌- 31
– రాజస్థాన్‌- 69
-అరుణాచల్‌ ప్రదేశ్‌- 29
-అసోం- 190
– మధ్యప్రదేశ్‌- 526
-మహారాష్ట్ర- 312
-ఛత్తీస్గఢ్‌- 19
-జారండ్‌- 5
– ఒడిశా- 28
-తెలంగాణ- 26
-ఆంధ్రప్రదేశ్‌- 48
-గోవా- 3
-కర్ణాటక- 524
– కేరళ- 190
-తమిళనాడు- 264

సంవత్సరాలవారీగా పులుల పెరుగుదల

-2006- 1411
-2010- 1706
-2014- 2226
– 2018- 2967

ఇతర ముఖ్యాంశాలు

– ప్రపంచ పులుల వాటాలో భారతదేశ వాటా- 70 శాతం
-ప్రపంచంలో అత్యధిక పులుల కలిగిన దేశం- భారత్‌
– దేశంలోని మొత్తం టైగర్‌ రిజర్వ్ లు- 50
– దేశంలో ప్రతి 4 ఏండ్లకోసారి పులుల గణన జరుగుతుంది.
-దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించే సంస్థ- నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ)
-2018-19 పులుల గణన 76,651 పులుల ఫొటోలను తీసి గిన్నిస్ రికార్డు సాధించింది.
-141 వేర్వేరు ప్రాంతాలు
-26,838 ప్రదేశాలు
– 1,21,337 చ.కి.మీ. విస్తీర్ణం
-3,48,58,623 ఫొటోలు
– 76,651 పులుల ఫొటోలు, 51,777 చిరుతలు+ఇతర జంతువుల ఫొటోలు
-పులి కూనలు- 2461

పశ్చిమ కనుమలు

 

పశ్చిమ కనుమలు

వీటిని సహ్యాద్రి పర్వతాలుగా కూడా పిలుస్తారు. ఇవి.. రెండు రకాలు.

  1. ఉత్తర సహ్యాద్రి శ్రేణులు (Northern)

  2. దక్షిణ సహ్యాద్రి శ్రేణులు (Southern Sahyadri)

1) ఉత్తర సహ్యాద్రి శ్రేణులు (Northern)

-ఇవి తపతి నదికి దక్షిణంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో విస్తరించాయి.

-వీటి సగటు ఎత్తు 1200 మీ., ఇవి దక్కన్‌ నాపలు లేదా లావా శిలలతో ఏర్పడ్డాయి.

– సహ్యాద్రి కనుమలు కొంకణ్‌ తీరాన్ని (మహారాష్ట్ర, గోవా), మహారాష్ట్రలోని దక్కన్‌ పీఠభూమి ప్రాంతాన్ని వేరుపరుస్తాయి.

-వీటిలో ఉన్న శిఖరాలు

1) కల్సూబాయి (1646 మీ.) ఇది మహారాష్ట్రలో ఎత్తయిన శిఖరం

2) సాల్వేర్‌ (1567 మీ.)

3) ధోడప్‌ (1451 మీ.)

4) మహాబలేశ్వర్‌ (1438 మీ.)

5) హరిశ్చంద్రగఢ్‌ (1424 మీ.)

– వీటిలో ఉన్న వేసవి విడుదులు- మహాబలేశ్వర్‌, లోనావాలా ఖండాలా, మాథరన్‌, అంబోలి.

2) దక్షిణ సహ్యాద్రి శ్రేణులు (Southern Sahyadri)

-ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఎ) నీలగిరి కొండలు (Blue Mountain)

– ఇవి తమిళనాడు, కర్ణాటక, కేరళ ట్రైజంక్షన్‌ వద్ద ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించిన పశ్చిమ కనుమలు. ఇవి ‘షోల’ అడవులకు ప్రసిద్ధి.

– వీటిలో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2637 మీ.). ఈ శిఖరం పాదాల చెంతన వేసవి విడిది అయిన ‘ఊటీ (ఉదక మండలం)’ ఉంది.
– మాకుర్తి శిఖరం (2,554 మీ.) దీనిలోనే ఉంది.

— తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం నీలగిరి కొండల్లోని ‘గుడలూరు’. వీటిలో నివసించే తెగలు కోట, తోడ, ఇరుల, కురుంబ.

– దేశంలో మొట్టమొదటి బయోస్పియర్‌ రిజర్వ్ ను 1986లో నీలగిరి కొండల్లోనే ప్రారంభించారు.

– సైలెంట్‌ వ్యాలీ, ముదుమలై, మాకుర్తి, నాగర్‌హూల్‌, బందీపూర్‌ నేషనల్‌ పార్క్​‍లు, వైనాడ్‌, సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ నీలగిరుల్లోనే ఉన్నాయి.

– నీలగిరి కొండలకు తూర్పునగల సత్యమంగళం వైల్డ్​‍లైఫ్‌ శాంక్చువరీ పశ్చమ, తూర్పు కనుమల జీవ ఆవాసాలకు అనుసంధానంగా ఉంది.

-ఈ నీలగిరి కొండల దిగువనే కోయంబత్తూర్‌ పట్టణం ఉంది.

బి) అన్నామలై కొండలు

– అన్నామలై అంటే ఏనుగుల కొండలు అని అర్థం.

-ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన శ్రేణులు.

– దీనిలో ఎత్తయిన శిఖరం అనైముడి (2,695 మీ.).

– అత్యధిక వర్షపాతం పొందే పశ్చిమ కనుమల్లోని భాగం.

– ఇరవికులం నేషనల్‌ పార్క్​‍, పరాంబికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ పర్వతాల్లో ఉంది.

సి) పళని కొండలు

– అన్నామలై కొండలకు తూర్పు వైపునగల పర్వతాలు, ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

– వీటిలో ఎత్తయిన శిఖరం వందరావు శిఖరం (2,533 మీ.).

-ఇక్కడ ఉన్న వేసవి విడిది ‘కొడైకెనాల్‌’.


పశ్చిమ కనుమల్లోని ముఖ్యమైన శిఖరాలు

1) అనైముడి శిఖరం (2,695 మీ.)– ఇది అన్నామలై పర్వత శ్రేణిలో, ఇడుక్కి (కేరళ)లో ఉంది. దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో, అన్నామలై కొండల్లో, కేరళ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరం. దీనిని దక్షిణ భారత్‌లో ఎవరెస్ట్ అంటారు. ఇది ఇరవికులం నేషనల్‌ పార్క్​‍లో ఉంది.

2) దొడబెట్ట శిఖరం (2,637 మీ.)- దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో రెండో ఎత్తయిన శిఖరం. తమిళనాడులో, నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరం.

3) వందరావు శిఖరం- ఇది తమిళనాడులోని పళని కొండల్లో ఎత్తయిన శిఖరం.

4) ముల్లయనగిరి శిఖరం (1930 మీ.)– ఇది కర్ణాటకలో ఎత్తయిన శిఖరం. బాబా బుడాన్‌ కొండల్లో ఉంది.

5) దేవరమల్లి శిఖరం (1922 మీ.)- ఇది కేరళలో కార్డమమ్‌ కొండల్లో ఎత్తయిన శిఖరం. పెరియార్‌ నది ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది.

6) కుద్రేముఖ్‌ శిఖరం (1892 మీ.)- ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది.

7) కల్సూబాయి శిఖరం (1646 మీ.)- ఇది మహారాష్ట్ర లోని సహ్యాద్రి కొండల్లో ఉంది. ఇది మహారాష్ట్రలోనే ఎత్తయిన శిఖరం.

– దేశంలో ప్రసిద్ధమైన జలపాతం ‘జోగ్‌ జలపాతం (253 మీ.). ఇది కర్ణాటకలో ‘శరావతి నది’పై ఉంది.

 

పశ్చిమ కనుమల్లోని ప్రధాన కనుమలు

1) థాల్‌ఘాట్‌ (కాసర ఘాట్‌) కనుమ- ఇది మహారాష్ట్ర లోని ముంబై, నాసిక్‌లను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 160’ని ఈ కనుమ గుండా నిర్మించారు.

2) నానేఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, జున్నార్‌లను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్‌ హైవే 61’ని నిర్మించారు.

3) భోర్‌ ఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, పుణెలను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 48’ని ఈ కనుమ గుండా నిర్మించారు.

4) అంబెనాలి కనుమ- ఇది మహారాష్ట్రలోని రాయగఢ్‌, సతారాలను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్‌ హైవే 72’ను నిర్మించారు.

5) అంబఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, కొల్హాపూర్‌లను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 66’ను ఈ కనుమ గుండా నిర్మించారు.

6) పాల్‌ఘాట్‌ (పాలక్కాడ్‌ ఘాట్‌) కనుమ– ఇది కేరళలో పాలక్కాడ్‌ (కేరళ), కోయంబత్తూర్‌ (తమిళనాడు)లను కలుపుతుంది. ఇది ఉత్తరాన నీలగిరి పర్వతాలకు, దక్షిణాన అన్నామలై కొండలకు మధ్యలో ఉంది. ఈ కనుమ 24 నుంచి 30 కి.మీ. వెడల్పు ఉంది. భరత్‌పూజ నది ఈ కనుమ గుండా ప్రవహిస్తుంది. ‘నేషనల్‌ హైవే 544’ను ఈ కనుమ గుండా నిర్మించారు.

7) శెన్‌ కోట్టె ఘాట్‌ (శెంగోళైఘాట్‌) కనుమ- ఇది తమిళనాడులోని కొల్లమ్‌, మధురైలను కలుపుతుంది. పాల్‌ఘాట్‌ కనుమ తరువాత పశ్చిమ కనుమల్లో రెండో పెద్దది. దీనిని ‘దక్షిణ తమిళనాడు ముఖద్వారం’ అంటారు.



విశ్వం/ గ్రహాల ఆవిర్భావ సిద్ధాంతాలు

 

  • బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం         -           అబ్బై జార్జ్ లెమిత్రి (బెల్జియం)
  • డోలనా సిద్ధాంతం              -           అలెస్ శాండేజ్
  • స్టడీస్టేట్ సిద్ధాంతం             -           హెర్మన్ బోండీ, థామస్ గోల్డ్, ఫ్రెడ్ హయ్‌లే
  • వాయు సిద్ధాంతం              -           ఇమాన్యువల్ కౌంట్ (జర్మనీ)
  • గ్రహాల పరికల్పన సిద్ధాంతం  -          బాంబర్లీన్, మౌల్టన్ (అమెరికా)
  • నెబ్యులార్ (నిహారిక పరికల్పన) సిద్ధాంతం  -  లాప్లెస్ (ఫ్రెంచ్)
  • టైడల్ (తరంగాల) హైపోథీసిస్  -  జీన్స్, జెఫ్రీన్ (బ్రిటన్)
  • బైనరీస్టార్ (ద్వి నక్షత్ర) థియరీ   -        లిటిల్‌టన్, రసెల్
  • ఫొటో ప్లానెట్ సిద్ధాంతం             -        కూపియర్
  • డస్ట్ అండ్ గాసియస్ థియరీ      -       అట్టోమన్ × స్కిమిడ్
  • ఫిజన్ సిద్ధాంతం                        -       రాసేగన్
  • విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం   -        ఆల్ఫ్‌వెన్
  • ద్రవీభవన పరికల్పన                -         హెరాల్డ్ సి ఉరే
  • భూకేంద్ర సిద్ధాంతం                   -          టాలమీ (క్రీ.శ. 140)
  • సూర్యకేంద్ర సిద్ధాంతం               -         కోపర్నికస్ (క్రీ.శ. 1543)

భారతదేశంలో అటవికజాతులు

  1. అబోర్స్...........................అస్సాం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలలో
  2. అవతామీలు.....................అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలో
  3. బడగాలు.........................నీలగిరి. తమిళనాడు రాష్ట్రంలో ప్రాంతం
  4. బైగాలు.......................... మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో అటవిక ప్రాంతాలలో
  5. భోటియాలు..................... ఉత్తర ప్రదేస్ లోని గర్వాల్, కుమావన్ ప్రాంతాలు.
  6. బిర్ హారులు.................... హజరీ భాగ్, బీహార్ రాష్ట్రంలో కొంత భాగంలో
  7. చెంచులు........................ ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రెండు రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో
  8. చూటియాలు.....................అస్సాం రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో మాత్రమే.
  9. గడ్డీలు............................. హిమాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతాలలో
  10. గల్లంగులు......................... ఈశాన్య హిమాలయ ప్రాంతం
  11. గారోలు............................. మేఘాలయ రాష్ట్రంలో కొంట/అటవీ ప్రాంతంలో
  12. గోండులు........................... మధ్య ప్రదేశ్, బీహారు, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్
  13. జరవాలు........................... అండమాన్ దీవులలో మాత్రమే
  14. ఖాసులు........................... ఉత్తర ప్రదేశ్ లోని జంసార్ . బాబర్ ప్రాంతము
  15. ఖాశీలు............................. అస్సాం, మేఘాలయ రెండు రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో
  16. ఖోండులు......................... ఒడిషా రాష్ట్రం లోని కొండ ప్రాంతాలలో
  17. కోలులు............................ మధ్య ప్రదేశ్ రాష్ట్రం అటవీ ప్రాంతాలలో
  18. కోలములు......................... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే
  19. కోటాలు............................. నీలగిరి ప్రాంతం, తమిళ నాడు రాష్ట్రం.
  20. కుకీలు.............................. మణిపూర్ ప్రాంతంలో
  21. లేప్పాలు........................... సిక్కిం రాష్ట్రములో కొండ ప్రాంతములో
  22. లుషాయీలు....................... త్రిపురలో మాత్రమే
  23. మినాలు............................ రాజస్థాన్ రాష్ట్రములో మాత్రమే
  24. మురియాలు....................... మధ్య ప్రదేశ్ లోమి బస్థర్ ప్రాంతంలో
  25. ముకిరీలు........................... అస్సాం రాష్ట్రంలో
  26. మెంపాలు........................... అరుణాచల్ రాష్ట్రములో
  27. నాగాలు.............................. నాగాలాండ్, అస్సాం రాష్ట్రంలో. వీరిలో ఉప తెగలు: అంగామీలు, సెమీలు, ఆవోలు, తంఘుకూలు, లాయోరాలు.
  28. ఒయారాన్లు లేదా కురుకులు...... బీహారు, ఒడిషా రాష్ట్రాలలో
  29. అంజులు.............................. అండమాన్ నికోబార్ దీవులు....
  30. సంతాలులు.......................... బెంగాల్ లోని బీర్బం ప్రాంతం, బీహార్ లోని హాజరీ బాగ్ ప్రాంతం, రాంచీ లోని పలమావు ప్రాంతం.#
  31. సెంటినలీలు.......................... అండమాన్ నికోబారు దీవులలో కొన్ని ప్రాంతాలలో.
  32. షాంపెన్లు............................. అండమాన్, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలు.
  33. తోడాలు.............................. తమిళ నాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతం.
  34. ఉరలీలు............................. కేరళలో మాత్రమే
  35. వర్లీలు................................ వీరు మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రమే నివసిస్తారు.

ప్రపంచంలోని అటవికజాతులు

 

అఫ్రిడిస్ తెగ➖పాకిస్తాన్

అకుంట్సు (అకుంట్సు లేదా అకున్సు) తెగ➖బ్రెజిల్

అవా తెగ➖బ్రెజిల్

బటక్ తెగ➖ఇండోనేషియా

బాంటస్ తెగ➖ఆఫ్రికా

బెర్బర్స్ తెగ➖మొరాకో, అల్జీరియా, ట్యునీషియా

బోయర్స్ తెగ➖దక్షిణాఫ్రికా

బిండిబు తెగ➖పశ్చిమ ఆస్ట్రేలియా

కోసాక్స్ తెగ➖రష్యా

ఎస్కిమోస్ తెగ➖గ్రీన్‌ల్యాండ్, కెనడా

ఫ్లెమింగ్స్ తెగ➖బెల్జియం

గౌచో తెగ➖ఉరుగ్వే, అర్జెంటీనా

హమిట్స్ తెగ➖ఆఫ్రికా

జరావాస్ తెగ➖అండమాన్ మరియు నికోబార్ దీవులు

కొరోవై తెగ➖పాపువా (న్యూ గినియా)

కిర్గిజ్ (కిర్గిజ్) తెగ➖మధ్య ఆసియా

కికుయు తెగ➖కెన్యా

కుర్దులు (కుర్దిష్) తెగ➖ఇరాక్

మాగ్యార్స్ తెగ➖హంగేరి

మావోరీస్ తెగ➖న్యూజిలాండ్

మసాయి తెగ➖తూర్పు ఆఫ్రికా

నీగ్రోస్ తెగ➖ఆఫ్రికా

పాపువాన్ తెగ➖న్యూ గినియా

పిగ్మీ తెగ➖కాంగో బేసిన్ (ఆఫ్రికా)

రెడ్ ఇండియన్స్ తెగ➖ఉత్తర అమెరికా

సెంటినెలీస్ తెగ➖అండమాన్ మరియు నికోబార్ దీవులు

వేదాలు తెగ➖శ్రీలంక

జులస్ తెగ➖దక్షిణాఫ్రికా

జో తెగ➖బ్రెజిల్

ఆంధ్రప్రదేశ్ - 26 కొత్త జిల్లాల స్వరూపం

         రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం  నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
          ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. 
 
  • ప్రకాశం జిల్లా (Praksam District) పెద్ద జిల్లా - 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
  • విశాఖపట్నం (Visakhapatnam) అతి చిన్న జిల్లా – 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
  • కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా
  • అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు) 9.54 లక్షల జనాభాతో చిన్న జిల్లా
 

 


 

1.శ్రీకాకుళం జిల్లా

  • కేంద్రం – శ్రీకాకుళం
  • 8 నియోజకవర్గాలు: ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట.
  • రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16)
  • మొత్తం 30 మండలాలు.
  • జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ,
  • జనాభా 21.91 లక్షలు ఉంది.

 

2. విజయనగరం జిల్లా

  • కేంద్రం - విజయనగరం
  • 7 నియోజకవర్గాలు: రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట.
  • రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15)
  • మొత్తం మండలాలు 26 ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,846 చ.కి.మీ.
  • జనాభా 18.84 లక్షలు ఉంది.

 

3.  మన్యం జిల్లా

  • కేంద్రం – పార్వతీపురం
  • 4 నియోజకవర్గాలు: పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు.
  • రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10).
  • మొత్తం 16 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,935 చ.కి.మీ.
  • జనాభా 9.72లక్షలు ఉంది.

 

4. అల్లూరి సీతారామరాజు జిల్లా

  • కేంద్రం – పాడేరు
  • 3 నియోజకవర్గాలు: పాడేరు, అరకు, రంపచోడవరం.
  • రెవెన్యూ డివిజన్లు కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11).
  •  మొత్తం 22 మండలాలు.
  • జిల్లా వైశాల్యం 12,251 చ.కి.మీ.
  • జనాభా 9.54 లక్షలు ఉంది.


5. విశాఖపట్నం జిల్లా

  • కేంద్రం – విశాఖపట్నం
  • 6 నియోజకవర్గాలు: భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక.
  • రెవెన్యూ డివిజన్లు కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5)
  • మొత్తం 10 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 928 చ.కి.మీ.
  • జనాభా 18.13 లక్షలుగా ఉంది.

 

6. అనకాపల్లి జిల్లా

  • కేంద్రం – అనకాపల్లి
  • 7 నియోజకవర్గాలు: పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి.
  • రెవెన్యూ డివిజన్లు నర్సీపట్నం(10), అనకాపల్లి(15).
  • 25 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 4,412 చ.కి.మీ.
  • జనాభా 18.73 లక్షలు ఉంది.

 

7. తూర్పుగోదావరి జిల్లా

  • కేంద్రం – కాకినాడ
  • 7 నియోజకవర్గాలు: తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం.
  • రెవెన్యూ డివిజన్లు పెద్దాపురం(12),కాకినాడ(7)
  • మొత్తం 19 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,605 చ.కి.మీ.
  • జనాభా 19.37 లక్షలు ఉంది.

 

8. కోనసీమ జిల్లా

  • కేంద్రం – అమలాపురం
  • 7 నియోజకవర్గాలు: రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం.
  • రెవెన్యూ డివిజన్లు రామచంద్రాపురం(8), అమలాపురం(16).
  • మొత్తం 24 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,615 చ.కి.మీ.
  • జనాభా 18.73 లక్షలు ఉంది.

 

9. రాజమహేంద్రవరం జిల్లా

  • కేంద్రం – రాజమహేంద్రవరం
  • 7 నియోజకవర్గాలు: అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం.
  • రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10).
  • 20 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,709 చ.కి.మీ.
  • జనాభా: 19.03 లక్షలు ఉంది.

 

10. నరసాపురం జిల్లా

  • కేంద్రం – భీమవరం
  • 7 నియోజకవర్గాలు: ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.
  • రెవెన్యూ డివిజన్లు నరసాపురం(8), కొత్తగా భీమవరం(11).
  • మొత్తం 19 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ.
  • జనాభా 17.80 లక్షలు ఉంది.

 

11. పశ్చిమగోదావరి జిల్లా

  • కేంద్రం – ఏలూరు
  • 7 నియోజకవర్గాలు: ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు కలిపి.
  • రెవెన్యూ డివిజన్లు ఏలూరు(12), జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6).
  • మొత్తం 27 మండలాలు ఉన్నాయి.
  • జిల్లా వైశాల్యం 6,413 చ.కి.మీ.
  • జనాభా: 20.03 లక్షలుగా ఉంది.

 

12. కృష్ణా జిల్లా

  • కేంద్రం – మచిలీపట్నం
  • 7 నియోజకవర్గాలు: గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ.
  • రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12).
  • మొత్తం 25 మండలాలు.
  • జిల్లా వైశాల్యం: 3,775 చ.కి.మీ.
  • జనాభా: 17.35 లక్షలు.

 

13. ఎన్టీఆర్ జిల్లా

  • కేంద్రం – విజయవాడ
  • 7 నియోజకవర్గాలు: పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు.
  • రెవెన్యూ డివిజన్లు విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
  • మొత్తం కలిపి 20 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం 3,316 చ.కి.మీ.
  • జనాభా: 22.19 లక్షలు.

 

14. గుంటూరు జిల్లా

  • కేంద్రం – గుంటూరు
  • 7 నియోజకవర్గాలు: తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి కలుపుకొని.
  • రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8).
  •  మొత్తం 18 మండలాలు.
  • జిల్లా వైశాల్యం: 2,443 చ.కి.మీ.
  • జనాభా: 20.91 లక్షలు.

 

15. బాపట్ల జిల్లా

  • కేంద్రం – బాపట్ల
  • 6 నియోజకవర్గాలు: వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల.
  • రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
  • మొత్తం 25 మండలాలు ఉండనున్నాయి.
  • జిల్లా వైశాల్యం : 3,829 చ.కి.మీ,
  • జనాభా : 15.87 లక్షలు ఉంది.

 

16. పల్నాడు జిల్లా

  • కేంద్రం – నరసరావుపేట
  • 7 నియోజకవర్గాలు: పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి.
  • రెవెన్యూ డివిజన్లు గురజాల (14), నరసరావుపేట(14)
  • మొత్తం 28 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 7,298 చ.కి.మీ,
  • జనాభా : 20.42 లక్షలు.

 

17. ప్రకాశం జిల్లా

  • కేంద్రం – ఒంగోలు
  • 8 నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి.
  • రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
  • మొత్తం 38 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 14,322 చ.కి.మీ,
  • జనాభా : 22.88 లక్షలు.

 

18. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

  • కేంద్రం – నెల్లూరు
  • 8 నియోజకవర్గాలు: కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు.
  • రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12)
  • మొత్తం 35 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 9,141 చ.కి.మీ,
  • జనాభా : 23.37 లక్షలు.

 

19. కర్నూలు జిల్లా

  • కేంద్రం – కర్నూలు
  • 8 నియోజకవర్గాలు: పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు.
  • రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17)
  • మొత్తం 28 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 8,507 చ.కి.మీ,
  • జనాభా : 23.66 లక్షలు.

 

20. నంద్యాల జిల్లా

  • కేంద్రం – నంద్యాల
  • 6 నియోజకవర్గాలు: నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు.
  • రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10)
  • మొత్తం 27 మండలాలు.
  • వైశాల్యం : 9,155 చ.కి.మీ,
  • జనాభా : 16.87 లక్షలు.

 

21. అనంతపురం జిల్లా

  • కేంద్రం – అనంతపురం
  • 8 నియోజకవర్గాలు: రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌.
  • రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8)
  • మొత్తం 34 మండలాలు.
  • వైశాల్యం : 11,359 చ.కి.మీ
  • జనాభా : 23.59 లక్షలు.

 

22. శ్రీసత్యసాయి జిల్లా

  • కేంద్రం – పుట్టపర్తి
  • 6 నియోజకవర్గాలు: మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి.
  • రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
  • మొత్తం 29 మండలాలు ఉంటాయి.
  • వైశాల్యం : 7,771 చ.కి.మీ,
  • జనాభా : 17.22 లక్షలు.

 

23. వైఎస్సార్‌ కడప జిల్లా

  • కేంద్రం – కడప
  • 7 నియోజకవర్గాలు: కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు.
  • రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12)
  • మొత్తం 34 మండలాలు ఉన్నాయి.
  • వైశాల్యం : 10,723 చ.కి.మీ,
  • జనాభా : 19.90 లక్షలు.

 

24. అన్నమయ్య జిల్లా

  • కేంద్రం – రాయచోటి
  • 6 నియోజకవర్గాలు: రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి.
  • రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
  • మొత్తం 32 మండలాలు.
  • వైశాల్యం : 8,459 చ.కి.మీ,
  • జనాభా : 17.68 లక్షలు.

 

25. చిత్తూరు జిల్లా

  • కేంద్రం – చిత్తూరు
  • 7 నియోజకవర్గాలు: నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు.
  • రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15)
  • మొత్తం కలిపి 33 మండలాలు ఉంటాయి.
  • వైశాల్యం : 7,210 చ.కి.మీ,
  • జనాభా : 19.85 లక్షలు

 

26. శ్రీ బాలాజీ జిల్లా

  • కేంద్రం – తిరుపతి
  • 7 నియోజకవర్గాలు: సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి కలుపుని.
  • రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11)
  • మొత్తం 35 మండలాలు.
  • జిల్లా వైశాల్యం : 9,176 చ.కి.మీ,
  • జనాభా : 22.18 లక్షలు ఉంది.