బ్రిటిష్ కాలంలో విద్యా సంస్కరణలు

             వారెన్ హేస్టింగ్స్ 1781లో కలకత్తాలో మదర్సాను స్థాపించారు. ఆ త‌ర్వాత 1791లో బెనారస్ లో (కాశీ) సంస్కృత కళాశాలను జొనాథన్ డంకన్ నెల‌కొల్పారు.

స‌ర్ విలియం జోన్స్

  • 1784లో రాయల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను జోన్స్‌ స్థాపించారు. ఇతను మనుస్మృతి ఆంగ్లములోకి అనువదించాడు.
  • కాళిదాసు సంస్కృతంలో రాసిన శకుంతల నాటకాన్ని ఆంగ్లంలోనికి అనువదించి ప్రచురించాడు.
  • భారతదేశంలో విద్యావ్యాప్తికి మొదటిసారిగా లక్ష రూ. లక్ష‌ను 1813 చార్టర్ చట్టం ద్వారా కేటాయించారు.
  • 1835లో మెకాలే ప్రతిపాదించిన తీర్మానానికి మెకాలే మినిట్ అని పేరు పెట్టారు. దీని ప్రకారం ఆంగ్ల మాద్యమం అధికారికంగా గుర్తించబడింది.
  • ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలని అధికారికంగా 1944లో ప్ర‌క‌టించారు.

ఉడ్స్ డిస్పాచ్ 1854

  • విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని ఉడ్స్ డిస్పాచ్ ప్ర‌తిపాదించింది.
  • భారత్‌లో ఆంగ్ల విద్యావ్యాప్తికి దీన్ని మాగ్నాకార్టాగా భావిస్తారు.
  • దేశంలో ఆధునిక విద్యా చరిత్రలో ఇదో మైలురాయి.
  • తొలిసారి 1857లో కలకత్తా, మద్రాస్, బొంబాయి నగరాల్లో 3 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు.
  • పంజాబ్‌లో 1882లో, అలహాబాద్‌లో 1887లో విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు.

హంటర్ కమీషన్ 1882

  • ఈ క‌మీష‌న్‌ను లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేశారు.
  • 1854లో ఉడ్స్ డిస్పాచ్ సూచించిన విధానాలను, అమలు చేసిన విధానాన్ని పరిశీలించడానికి, అలాగే అవసర‌మైన సిఫార్సులు చేయడానికి హంటర్ కమీషన్ ఏర్పాటు చేశారు.
  • భారత్‌లో విద్యా విధానాన్ని సమీక్షించ‌డానికి ఏర్పాటు చేసిన మొదటి కమీషన్.

కమీషన్ సూచనలు

  • ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలి
  • ప్రతిభ ఉపకార వేతనాలు ఇవ్వాలి
  • ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం నిధులివ్వాలి
  • మ‌తాల‌కు అతీతంగా బోధ‌న జ‌ర‌గాలి
  • స్కూళ్ల‌ను ఇన్‌స్పెక్ట‌ర్లు త‌నిఖీ చేయాలి

1901 – లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణ శకానికి నాంది పలికాడు.

థామస్ రిలే కమీషన్ (1902)

  • లార్డ్ క‌ర్జ‌న్ ఏర్పాటు చేశాడు.
  • కమీషన్ అధ్యక్షుడు థామస్ రిలే. ఈయ‌న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో న్యాయ సభ్యుడు.
  • క‌మిష‌న్‌లో స‌భ్యులు సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి, జస్టిస్ గురుదాస్ బెనర్జీ (కలకత్తా హైకోర్టు జడ్జి)
  • యూనివర్సిటీ విద్యావిదానాన్ని సమీక్షించ‌డానికి ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీ సిఫారసు ప్ర‌కారం విశ్వవిద్యాలయ చట్టంను 1904లో ఏర్పాటు చేశారు.

హార్టోగ్ కమిటీ (1929)

  • పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది.

శాడ్ల‌ర్ కమిటీ (1917)

  • డిగ్రీ స్థాయిలో కాలపరిమితి 3 సంవ‌త్స‌రాలుగా నిర్ణయించారు.

1917లో లార్డ్ చేమ్స్ ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయం పని తీరును సమీక్షించుటకు శాడ్లర్ కమిటీని నియ‌మించాడు.

స‌ప్రూ క‌మిటీ (1934)

  • వృత్తివిద్య ఆవశ్యకతను తెలియజేశాడు.

(1944)

  • కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయ తరహా విద్యను భారత్ లో అభివృద్ధిపరచాలని కమిటీ సూచించింది.
  • 1919 మాంటేగు-చేమ్స్ ఫర్డ్ సంస్కరణల ద్వారా మొట్టమొదటిసారిగా విద్య భారతీయుల ఆధీపత్యంలోకి వచ్చింది.
  • దేశంలో తొలి మ‌హిళా గ్రాడ్యుయేట్ (1st Woman graduate in India) – కాదంబిని గంగూలీ