ముర్షీద్ కులీ ఖాన్ | Murshid Quli Khan
- ఔరంగజేబు కాలంలో ఇతను బెంగాల్ గవర్నర్‌గా నియమించబడ్డాడు.
- 1707లో ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కాబట్టి స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు ముర్షీద్ కులీఖాన్.
- ఇతను ముర్షీదాబాద్ అనే నగరాన్ని కట్టి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
- పాలనను పునర్ వ్యవస్థీకరించి హిందువులకు, ముస్లింలకు సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించాడు.
- భారతీయ, విదేశీ వ్యాపారాలను ప్రోత్సహించి వర్తక, వాణిజ్యాల విస్తరణ చేపట్టాడు.
- విదేశీ వర్తక కంపెనీల కార్యకలాపాల మీద కచ్చితమైన నియంత్రణ పాటించడం,
ఔరంగజేబు (1691) ఫరూఖ్‌సియార్ (1717) జారీ చేసిన ఫర్మానాల ద్వారా
ఈస్టిండియా కంపెనీ సమకూర్చిన ప్రత్యేక హక్కులను ఆ కంపెనీ ఉద్యోగులు
దుర్వినియోగం చేయకుండా నివారించాడు.
- ఇతని తరువాతి పాలకులు షుజా ఉద్దౌలా, హైదర్జంగ్, ఆలీవర్ది ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం, నాజీం ఉద్దౌలా.
- ముర్షిద్ మరణించిన తరువాత ఇతని అల్లుడు షుజా ఉద్దౌలా, తరువాత హైదర్జంగ్ బెంగాల్ను పాలించారు.
- బీహార్‌లో డిప్యూటీ గవర్నర్ అయిన ఆలీ వర్ధి ఖాన్, హైదర్జంగ్ను చంపి 1741లో బెంగాల్‌ను ఆక్రమించాడు.
- ఆలీవర్దీ ఖాన్ కాలంలో దక్షిణ భారతదేశం కర్ణాటక యుద్దాలు మొదలయ్యాయి.
- 1756లో ఆలీ వర్దీ ఖాన్ మరణించడంతో అతని మనువడు సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు.