బెంగాల్ ఆక్ర‌మ‌ణ‌ (1764)

 

  • భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు అధికారాన్ని స్థాపించిన తొలి రాష్ట్రం – బెంగాల్
  • బెంగాల్లో బ్రిటిష్ అధికార స్థాపకుడు – రాబర్ట్ క్లైవ్
  • దేశాన్ని మొగల్ చక్రవర్తి షాజహాన్ పలించే రోజుల్లో ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వర్తక స్థావరాలను బెంగాల్లో స్థాపించింది.
  • బెంగాల్ సుబాలోని వర్తక స్థావరాలు: హుగ్లీ, కాశీంబజార్, ఒరిస్సాలోని బాలాసోర్, హరిహారపురం.
  • 1651లో సంవత్సరానికి 3 వేల రూపాయలు మొగల్ చక్రవరి షాజహాన్కు చెల్లించి రహదారి పన్ను లేకుండా అనుమతి పొందినది – ఆంగ్లేయులు (ఈస్ట్ ఇండియా కంపెనీ వారు)
  • 1672 ఔరంగజేబు బెంగాల్ గవర్నర్ షయిస్తాఖాన్ వీరికి దిగుమతి పన్ను విధించాడు.
  • వీరు చెల్లించడానికి నిరాకరించడంతో కంపెనీ అధికారులను షయిస్తాఖాన్ నిర్బంధించాడు. దీనికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు బెంగాల్లో విధ్వంసం సృష్టించారు.
  • ఆంగ్లేయ అధికారుల చర్యలను తీవ్రంగా పరిగణించిన ఔరంగజేబు కఠిన చర్యలు తీసుకున్నాడు. వారి వ్యాపారాలను స్తంభింపజేశాడు. దీంతో ఆంగ్లేయులు చక్రవర్తిని కలిసి క్షమాపణ అడిగి సంధి చేసుకున్నారు.
  • 1700 నాటికి చక్రవర్తి అనుమతితో కలకత్తాను పొంది ఫోర్ట్ విలియం కోటను కట్టుకున్నారు.
  • ఔరంగజేబు తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తుల అసమర్థతను గ్రహించిన ఆంగ్లేయులు బెంగాల్లో స్వతంత్రంగా వ్యవహరించారు.

ముర్షీద్ కులీ ఖాన్

  • ఔరంగజేబు కాలంలో ఇతను బెంగాల్ గవర్నర్‌గా నియమించబడ్డాడు.
    1707లో ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కాబట్టి స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు ముర్షీద్ కులీఖాన్.
  • ఇతను ముర్షీదాబాద్ అనే నగరాన్ని కట్టి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
  • పాలనను పునర్వ్యస్థీకరించి హిందువులకు, ముస్లింలకు సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించాడు.
  • భారతీయ, విదేశీ వ్యాపారాలను ప్రోత్సహించి వర్తక, వాణిజ్యాల విస్తరణ చేపట్టాడు.
  • విదేశీ వర్తక కంపెనీల కార్యకలాపాల మీద కచ్చితమైన నియంత్రణ పాటించడం, ఔరంగజేబు (1691) ఫరూఖ్సియార్ (1717) జారీ చేసిన ఫర్మానాల ద్వారా ఈస్టిండియా కంపెనీ సమకూర్చిన ప్రత్యేక హక్కులను ఆ కంపెనీ ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా నివారించాడు.
  • ఇతని తరువాతి పాలకులు: షుజా ఉద్దౌలా, హైదర్జంగ్, ఆలీవర్ది ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం, నాజీం ఉద్దౌలా.
  • ముర్షిద్ మరణించిన తరువాత ఇతని అల్లుడు షుజా ఉద్దౌలా, తరువాత హైదర్జంగ్ బెంగాల్ను పాలించారు.
  • బీహార్లో డిప్యూటీ గవర్నర్ అయిన ఆలీ వర్ధి ఖాన్, హైదర్జంగ్ను చంపి 1741లో బెంగాల్ను ఆక్రమించాడు.
  • ఆలీవర్దీ ఖాన్ కాలంలో దక్షిణ భారతదేశం కర్ణాటక యుద్దాలు మొదలయ్యాయి.
  • 1756లో ఆలీ వర్దీ ఖాన్ మరణించడంతో అతని మనువడు సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు.

సిరాజ్ ఉద్దౌలా

  • ఇతని అసలు పేరు మీర్జా మహమ్మద్. ఆలివర్దీ ఖాన్ 3వ కూతురు కొడుకు. తన తరువాతి వారసుడిగా సిరాజ్ ఉద్దౌలానే అలీవర్దీ ఖాన్ ప్రకటించాడు.
  • ఇతని పట్టాభిషేకంను బ్రిటిష్ వారు బహిష్కరించారు. ఇతనే బెంగాల్ చివరి స్వంతంత్ర నవాబు.
  • బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చంద్రనాగూర్
  • బ్రిటీష్ వారి ప్రధాన వర్తక స్థావరం – కలకత్తా
  • ఇదే టైంలో దక్షిణ భారత్లో బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదలైంది.
  • బెంగాల్లో బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
  • సిరాజ్ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపేయాలని ఆజ్ఞలను జారీ చేశాడు. చంద్రనాగూర్లో ఉన్న ఫ్రెంచి వారు దీనిని అంగీకరించగా బ్రిటిషర్లు తిరస్కరించారు. దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కాశీంబజార్పై దాడి చేసి బ్రిటిష్ స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 146 మందిని ఓ చీకటి గదిలో బంధించాడు.

కలకత్తా చీకటి గది ఉదంతం

  • సిరాజ్ ఫోర్ట్ విలియంను 1756 జూన్ 20న ఆక్రమించాడు.
  • క్రీ.శ. 1756లో సిరాజ్ ఆంగ్లేయుల వర్తక స్థావరం అయిన కాశీంబజార్ను ముట్టడించి కలకత్తాను ఆక్రమించాడు.
  • కలకత్తాను ఆక్రమించిన సిరాజ్ అక్కడ దొరికిన 146 మంది బ్రిటిష్ సైనికులను ఓ (18x10X14 కొలతల గది) చీకటి గదిలో బంధించగా ఇందులో 23 మందే బ్రతికినట్లు హల్వెల్ ప్రకటించడాన్ని కలకత్తా చీకటి గది ఉందంతం అంటారు.
  • కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజ్ కలకత్తాకు పెట్టిన పేరు – అలీసాగర్
  • కలకత్తాకు నియమింపబడిన సాలకుడు – మాణిక్ చంద్
  • బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కు బహుమానాలిచ్చి కలకత్తాను మళ్లీ ఆక్రమిస్తాడు.
  • తర్వాత క్రీ.శ. 1757 ఫిబ్రవరి 9న బ్రిటిషర్లతో సిరాజ్ అలీసాగర్ సంధి చేసుకుంటాడు.
  • అంతవరకు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాపై వారి హక్కును గుర్తించాడు.
    ఆలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్రనాగూర్ను ముట్టడిస్తాడు.
  • ఈ ముట్టడిలో ఓడిన ఫ్రెంచ్ వాళ్లకు సిరాజ్ ఆశ్రయం ఇస్తాడు.

ప్లాసీ యుద్ధం (1757 జూన్ 23)

  • ఈ యుద్ధం సిరాజ్, రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది.
  • యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కు మద్దతు తెలిపిన కుట్రదారులు:
    మీర్ జాఫర్ – సిరాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు (మీర్ భక్షి), మిరాన్ – మీర్ జాఫర్ కొడుకు, అమీన్ చంద్ – వ్యాపారి (మధ్యవర్తి), మాణిక్ చంద్ – కలకత్తా (ఇన్చార్జ్), జగత్ సేట్ – బెంగాల్లో అత్యంత ధనికుడు
    రాయ్ దుర్లభ్, ఖాదీమ్ ఖాన్ – సిరాజ్ యొక్క సైనిక అధికారులు
  • 1757లో జూన్ 23న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ‘సిరాజ్-ఉద్-దౌలా’ను ఓడించాడు.
  • మీర్ మదన్, మోహన్ లాల్ సైనికులు సిరాజ్ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
  • పారిపోతున్న సిరాజ్ను మీర్ జాఫర్ కుమారుడు మిరాన్ పట్టుకొని ఉరితీశాడు.
  • 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. (1757-1760).
  • ఈ యుద్ధానంతరం బెంగాలులోనూ, తరువాత భారత్లో సర్వాధిపత్యం చెలాయించడానికి ఆంగ్లేయులకు మార్గం సుగమమయింది.
  • యుద్ధ నష్ట పరిహారం కింద రూ. 177 లక్షలు, కలకత్తా సమీపంలోని 24 పరగణాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించాయి.
  • కంపెనీ తొలిసారి 1757లో కలకత్తాలో టంకశాల తెరిచింది. తమ అధికారులకు పెద్ద జీతాలు ఇవ్వడం ప్రారంభించింది.
  • వీటన్నింటి కన్నా ముఖ్యంగా ప్లాసీ యుద్ధంతో దేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ పెద్ద ఎత్తున ప్రారంభమైంది.
  • క్రీ.శ 1760లో ఆంగ్లేయులు మీర్ జాఫర్ను తొలగించి మీర్ ఖాసింను అతని స్థానంలో బెంగాల్ నవాబుగా నియమించారు.
  • కృతజ్ఞతగా మీర్ ఖాసిం ఆంగ్లేయులకు బుర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను ఇచ్చాడు.
  • మీర్ఖాసిం బెంగాల్ రాజధానిని ముర్షీదాబాద్ నుంచి మాంఘీర్కు మార్చారు.
    క్రీ.శ. 1760లో క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్లాక కొంతకాలం హాల్వెల్ గవర్నర్గా చేశాడు. ఆ తర్వాత వాన్సిట్టార్ట్ బెంగాల్ గవర్నర్గా చేశాడు.
  • క్రీ.శ 1763లో ఆంగ్లేయులు మీర్ ఖాసింనూ బెంగాల్ నవాబుగా తొలగించారు. తర్వాత మళ్లీ మీర్ జాఫర్ గవర్నరయ్యాడు.
  • భారత్లో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసింది, తూర్పు ఇండియా కంపెనీ ఓ రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్ధం – ప్లాసీ యుద్ధం

మీర్ జాఫర్

  • ఇతను 24 పరగణాల జమిందారీ హక్కులను బ్రిటీష్ వారికి ఇచ్చాడు.
    1760 నాటికి బెంగాల్ ఖజానా ఖాళీ అవడంతో మీర్ జాఫర్ బహుమానాలు ఇవ్వలేదు.
  • దేశం నుంచి బ్రిటన్కు సంపద తరలిపోవడం మీర్ జాఫర్ కాలం నుంచి ప్రారంభమైంది.
  • ఇతన్ని తొలగించి ఇతని అల్లుడు మీర్ ఖాసింను ఆంగ్లేయులు బెంగాల్ నవాబును చేశారు.
  • ఆంగ్లేయుల మీర్ ఖాసింను బెంగాల్ నవాబుగా ప్రకటించడం 1760వ విప్లవంగా ప్రసిద్ధికెక్కింది.

మీర్ ఖాసిం

  • బెంగాల్ నవాబుగా ప్రకటించగానే మిడ్నాపూర్, చిట్టగాంగ్, బుర్ద్వాన్ ప్రాంతాలను బ్రిటిషర్లకిచ్చాడు.
  • ఖాసిం సమర్ధుడైన పాలకుడు. పాలనో బ్రిటిష్ జోక్యం ఉండొద్దని రాజధానిని ముర్షిదాబాద్ నుంచి మాంఘీర్కు మార్చాడు.
  • బెంగాల్ వర్తకులెవరూ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించడంతో ఖాసిం, బ్రిటిష్ వాళ్ల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
  • చిన్న చిన్న యుద్ధాల్లో ఖాసిం ఓడిపోయి అవధ్కు పారిపోయాడు.
  • 1763లో జాఫర్ మళ్లీ బెంగాల్ నవాబుగా నియమించబడ్డాడు.
  • ఖాసిం అవధ్ పాలకుడైన ఘిజాఉద్దౌలాతో, మొగల్ చక్రవర్తి రెండో షా ఆలంతో కలిసి బ్రిటిష్కు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేశాడు.
  • 1764లో బ్రిటిష్ జనరల్ మన్రో ఈ కూటమిని బక్సార్ యుద్ధంలో ఓడించాడు.
  • దీంతో బెంగాల్ (పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా) పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది.
  • ఫ్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబు దర్బారులో రెసిడెంట్ నియమించబడిన ఇంగ్లిష్ అధికారి ల్యూక్ స్క్రాష్టన్.

బక్సార్ యుద్ధం (1784)

  • అవధ్ నవాబు ఘిజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, మీర్ ఖాసీం కూటమికి, బ్రిటిషు వారికి క్రీ.శ. 1764లో బీహార్లోని బక్సార్ నగరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మీర్ ఖాసీం కూటమి ఓడింది.
  • యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినది – సర్ హెక్టర్ మన్రో
    ఆంగ్లేయుల బెంగాల్కు వాస్తవ పాలకులుగా మార్చిన యుద్ధమిది.

అలహాబాద్ సంధి (1785)

  • బక్సార్ యుద్ధంలో ఓడిన ఘాజా ఉద్దౌలా, రెండవ షాఅలం బ్రిటిషర్లతో (రాబర్ట్ క్లైవ్) అలహాబాద్ సంధి కుదుర్చుకున్నారు.
  • ఈ సంధి ప్రకారం – ఒరిస్సా, బెంగాల్, బీహార్లలోని దివానీ హక్కులను రెండవ షాఆలం ఆంగ్లేయులకు సొంతం చేశాడు.
  • బక్సార్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ – నాన్సి టార్ట్.
  • బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు -వసీం-ఉద్-దౌలా

వసీం-ఉద్-దౌలా

  • మీర్ జాఫర్ మరణం తర్వాత ఇతని కొడుకును నవాబుగా ప్రకటించాడు.
    నవాబు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ కాలంలో ఆంగ్లేయులకు కీలుబొమ్మగా మారాడు.
  • ఆంగ్లేయులు ఇతనికి భరణం ఇచ్చి స్వయం పాలన చేపట్టాడు.
  • 1772లో బెంగాల్ నవాబు నజీం ఉద్దౌలాకు 6 లక్షల భరణం ఇచ్చి బెంగాల్లో ఈస్టిండియా కంపెనీ ప్రత్యక్ష పాలనను బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ నెలకొల్పారు.
  • 1765లో ఆలహాబాద్ ఒప్పందం తర్వాత రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశ పెట్టాడు. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్గా వచ్చి ద్వంద పాలన రద్దు చేసింది వారెన్ హేస్టింగ్స్.

బెంగాల్ – ద్వంద్వపాలన (1765-72)

  • బెంగాల్లో ద్వందపాలనను ఏర్పాటు చేసింది – రాబర్ట్ క్లైవ్ (1765)
    రద్దు చేసింది – వారన్ హేస్టింగ్స్ (1772)
  • బెంగాల్లో ద్వందపాలన విధానం అమల్లో ఉన్నకాలం – 1765-72
  • బెంగాల్ కరువు వచ్చిన సంవత్సరం – 1770
  • దేశంలో తూర్పు ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కింద ఏర్పడిన తొలి రాష్ట్రం – బెంగాల్
  • అలాంటి ఆరాచకం. లంచగొండితనం, అవినీతి, దోపిడి ఏ దేశంలో ఎన్నడూ చూడలేదు అని బెంగాల్లో ద్వంద పాలనపై వ్యాఖ్యానించింది – రాబర్ట్ క్లైవ్