🔥 విద్యార్హత :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

🔥 వయస్సు

18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు లోపు వయస్సు గల వారి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ వర్గాల వారికి క్యాటగిరి వారీగా వయోసడలింపు కలదు.

 

🔥 దరఖాస్తు విధానం:

ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

 

🔥 ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.


 

 

GROUP 1 MAINS 2025 QUESTION PAPERS

 


 Paper in Telugu

  Click here to download/view pdf file

 Paper in English

  Click here to download/view pdf file

 Paper - I - General Essay

  Click here to download/view pdf file

 Paper-II - History and Cultural

and Geography of India and Andhra Pradesh

  Click here to download/view pdf file





కుటుంబం రకాలు

  • కుటుంబాలు, అందులోని బంధాలు, మూలపురుషులు, వంశ క్రమాలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలోని సభ్యులు భిన్నమైన సామాజిక విధులు, బాధ్యతలు నిర్వహిస్తుంటారు.  
  • మనిషి సామాజిక జీవనానికి కుటుంబమే మూలం. పుట్టుకతో, పెళ్లితో ఆ బంధాలు ఏర్పడతాయి. 
  • కుటుంబంలో భాగమైన వ్యక్తి రకరకాల విధులు నిర్వహిస్తారు. అందులో దైహిక, సామాజిక, ఆర్థిక, లైంగిక, విద్య, సాంస్కృతిక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. 

ప్రాథమిక కుటుంబం (వ్యష్ఠి/కనిష్ఠ కుటుంబం): దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం. ఈ కుటుంబంలో పెరిగే పిల్లలు వారి సమాజ ఆచారాలు, కట్టుబాట్లను ప్రథమంగా తెలుసుకుంటారు. 

సమ్మిశ్ర కుటుంబం (Composite family): సంతానానికి వివాహం అయితే కుటుంబం ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమ్మిశ్ర కుటుంబంగా మారుతుంది. వివాహం తర్వాత పుట్టింట్లో కూతుర్లు ఉండాలా, కుమారులు ఉండాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎప్పుడూ అధికంగా ఉంటుంది.

విస్తృత కుటుంబం: నివాస స్థల విధానాన్ని అనుసరించి విస్తృత కుటుంబంలోని పలు రకాలు ఉంటాయి.

నివాస స్థల సూత్రం (Rule Of Residence)

విస్తృత కుటుంబ స్వరూపం (The Farm of extended family)

1. పతి స్థానిక నివాసం (Patrilocal Residence)

1. పతి స్థానిక విస్తృత కుటుంబం (Patrilocal extended family)

2. పత్నిస్థానిక నివాసం (Matrilocal Residence) 2. పత్నిస్థానిక విస్తృత కుటుంబం (Matrilocal extended family)
3. ద్విస్థానిక నివాసం (Bilocal Residence) 3. స్థానిక విస్తృత కుటుంబం (Bilocal extended family)
4. మాతుల స్థానిక నివాసం (Avunculocal Residence) 4. మాతుల స్థానిక విస్తృత కుటుంబం (Avunculocal extended family)

* విస్తృత కుటుంబంలో రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ తరాలవారు ఉంటారు.

పతి స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు సోదరులు, వారి భార్యలు, వారి అవివాహితులైన కొడుకులు, కూతుళ్లు, వివాహితులైన కొడుకులు, వారి భార్యలు, కొడుకుల సంతానం ఉంటారు. ఈ రకమైన కుటుంబానికి తండి లేదా తండ్రి అన్న కుటుంబానికి పెద్దగా ఉంటారు. సమష్టి సంపాదనను కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. 

పత్ని స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు అక్కాచెల్లెలు ఉంటారు. అవివాహితులైన, వివాహితులైన ఆడబిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు ఉంటారు. ఈ కుటుంబంలో స్త్రీలలో జేష్ఠురాలిదే అధికారం. 

ద్విస్థానిక విస్తృత కుటుంబం: దంపతులు, వారి కుమారుల్లో కొంతమంది, కూతుళ్లలో కొంతమంది, వారి మనుమలలో కొంతమంది, మనుమరాలు సభ్యులుగా ఉంటారు. ఈ రకమైన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. 250 సమాజాల్లో కేవలం 10 సమాజాల్లోనే ఇలాంటి కుటుంబాలున్నాయని జార్జ్‌పీటర్‌ ముర్డాక్‌ తెలిపారు.

మాతుల స్థానిక విస్తృత కుటుంబం: ఈ కుటుంబంలో దంపతులు, వారి సంతానంతో పాటు అతడి అక్క, చెల్లెళ్ల కొడుకుల్లో చాలామంది అతడి కూతురిని వివాహం చేసుకొని వారి సోదరి కొడుకుతో కలిసి ఒకే నివాసంలో ఉంటారు. 

బహుభార్యత్వ కుటుంబం: 

చుక్చీ, కిప్సీజీ, లఖోర్, లసు (మాతుల ప్రకారం తమ భర్తలతో కాపురం చేస్తారు), మర్న్‌గిన్, బైగా, మరియ, తనాల వంటి గిరిజన తెగల్లో కనిపిస్తుంది.  

1) లైంగిక సంబంధాల వల్ల ఒకరి భార్యలంతా సమానమైన హక్కులతో ఉంటారు. 

2) ప్రతి భార్యకు ప్రత్యేక నివాస స్థలం/ అందరూ ఒకే గృహంలో కాపురం చేయవచ్చు. 

3) పెద్ద భార్యకు ప్రత్యేక అధికారం, హక్కులు ఉండొచ్చు. 

బహుభర్తృత్వ కుటుంబం: ఖాసా, తోడాలు, తియ్యాన్‌ అనే గిరిజన తెగల్లో ఇది కనిపిస్తుంది. 

కేంద్రక కుటుంబం (Nuclear Family): ఇందులో భార్య, భర్త, అవివాహిత పిల్లలు ఉంటారు.

ప్రకార్య ఉమ్మడి కుటుంబం (Functional Joint Family): రక్త సంబంధం ఉన్న రెండు కుటుంబాలు, విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే ఉమ్మడి అధికారం కింద కార్యకలాపాలు సాగిస్తారు. 

ప్రకార్య, గణనీయ ఉమ్మడి కుటుంబం (Functional & Substantial Family): ఆస్తి విషయంలో ఉమ్మడిగా కార్యకలాపాలు సాగించడం దీని ప్రధాన లక్షణం.

ఉపాంత ఉమ్మడి కుటుంబం: రెండు తరాల కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు. 

సంప్రదాయ ఉమ్మడి కుటుంబం: రెండు లేదా మూడు తరాలవారు కలిసి ఉండటం దీని ప్రత్యేకత.

 

వంశానుక్రమం

  • పితృ వంశీయ కుటుంబం: తండ్రిని మూలజనకుడిగా పరిగణించి తన సంతానానికి తండ్రి బంధువులతో పొత్తు పెట్టుకొని తండ్రి వంశకర్తగా ఉంటారు. 
  • మాతృ వంశీయ కుటుంబం: తల్లి వంశకర్తగా ఉంటారు.
  • ద్వంద్వ వంశానుక్రమం: ఒక వ్యక్తి తన మాతృ వర్గం, పితృ వర్గంతో పొత్తు కుదుర్చుకొని రెండు పక్షాల వారిని మూలపురుషులుగా గ్రహించే కుటుంబం.

 

మరికొన్ని వివరాలు

  • సహజీవనం: వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం. 
  • డింక్‌ కుటుంబాలు: ఆర్థిక భద్రత ఉన్న కొందరు వివాహితులు, ఉద్యోగాలు చేసే దంపతులు సంతానాన్ని వద్దనుకోవడం.
  • కిబ్బట్జ్‌ కుటుంబ వ్యవస్థ: పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా పిల్లల గృహంలో నివసించడం. ఈ రకమైన వ్యవస్థ ఇజ్రాయెల్‌లో ఉంది.
  • జన్మప్రాప్త: వ్యక్తి తాను జన్మించిన కుటుంబంలో సభ్యుడిగా ఉండటం.
  • ధ్యాంతి: ఖాసా తెగ స్త్రీని పుట్టింట్లో పిలిచే విధానం.
  • ర్యాంతి: ఖాసా తెగ స్త్రీని అత్తవారింట్లో పిలిచే విధానం
  • ఘోస్ట్‌ మ్యారేజ్‌: దీన్ని న్యూయెర్లు, ఇవాన్‌ ఫ్రిచెర్డ్‌ అధ్యయనం చేశారు. 
  • ఈంగ్‌: ఖాసి తెగలోని కుటుంబం పేరు. 
  • ఇల్లోమ్‌: ఇది నంబూద్రి సమూహంలోని కుటుంబం.
  • స్త్రీల మార్పిడి: స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం బర్మాలోని కచ్చిన్‌ కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. 

 

సిద్ధాంతాలు

  • స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతపాదించినవారు ప్లీస్‌ 
  • పితృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: దీన్ని అరిస్టాటిల్, ప్లేటో, హెన్రీ మెయిన్‌ ప్రతిపాదించారు. 
  • మాతృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: బ్రిఫాల్డిస్‌ ప్రతిపాదించారు. 
  • పరిణామక్రమ కుటుంబ సిద్ధాంతం: మోర్గాన్‌ ప్రతిపాదించారు. 
  • ఏకపత్ని కుటుంబ సిద్ధాంతం: వెస్టర్‌ మార్క్‌ ప్రతిపాదించారు. 
  • బహుళ కారక కుటుంబ సిద్ధాంతం: మైకేవర్, రాల్ఫ్‌లింటన్‌ ప్రతిపాదించారు.

కుటుంబం

  • సామాజిక జీవితంలో అత్యంత ప్రధానమైనది కుటుంబం. మనిషి మనుగడకు మూలం అక్కడి నుంచే మొదలవుతుంది. తరతరాలకు తరగని అనుబంధాలతో సాగుతుంది. 
  • పుట్టుక లేదా వివాహంతో బంధం ఏర్పడి ఒకే ఇంటిలో నివసించే సమూహమే కుటుంబం. సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పురోగతులకు ఇదే పునాది. 
  • ప్రపంచంలో పలు రకాల కుటుంబ వ్యవస్థలున్నాయి. వీటిలో పాటించే భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తుల బాధ్యతలు ఆసక్తికరంగా ఉంటాయి. 
  •  కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా కుటుంబం వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో అధికభాగం కుటుంబంతోనే గడుస్తుంది. 
  • మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ. దానికి వివాహం పునాది వేస్తుంది. 
  • ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. 
  • వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. 
  • ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. మన జీవితం మొత్తం కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది. 
  • "Family" అనే పదం రోమన్‌ పదం ఫాములస్‌ (Famulus) నుంచి వచ్చింది. ఫాములస్‌ అంటే సేవకుడు. 
  • Family అనే పదం ఫెమీలియా (Familiya) అనే లాటిన్‌ పదం నుంచి ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫెమీలియా అంటే కుటుంబం. 
  • కుటుంబానికి ప్రాధాన్యాన్నిస్తూ మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 
  • కుటుంబాలు అనే భావన గురించి మొదట చెప్పినవారు అరిస్టాటిల్, ప్లేటో.
  • నేటి సమాజంలో కుటుంబం అంటే భార్య, భర్త, వారి సంతానం మాత్రమే. 
  • 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అనే చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది.
  •  ఏంగెల్స్, కార్ల్‌మార్క్స్, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబం ఒక పరిణామ క్రమంలో బలపడిన బంధంగా భావించారు. సామాజికంగా ఆమోదం పొందిన స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి లేదా జీవ వ్యవస్థను కుటుంబం అంటారు.
  • స్త్రీ, పురుషులు ఒకే ప్రదేశంలో నివసించడం వల్ల కుటుంబాలు ఏర్పడినట్లు మోర్గాన్‌ అనే సామాజికవేత్త అభిప్రాయపడ్డాడు.

 

నిర్వచనాలు

     1955కు ముందు కుటుంబ నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలు అని పేర్కొంటారు.

తొలి నిర్వచనాలు:  

  • వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం - రాబర్ట్‌ హెచ్‌.లూయీ. 
  • వివాహం, తల్లిదండ్రుల విధులు-బాధ్యతలు, వారి సంతానం కలిసి నివసించడమే కుటుంబం - రాల్ఫ్‌లింటన్‌. 
  • లూయూ, లింటన్‌ల అభిప్రాయం ప్రకారం కుటుంబం ఉనికి సర్వసాధారణమైంది.
  • జార్జిపీటర్‌ ముర్డాక్‌ అనే మానవ శాస్త్రవేత్త 192 సమాజాలను పరిశీలించి ఒకేచోట నివసించడం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహమే కుటుంబమని అభిప్రాయపడ్డారు.

ఆధునిక నిర్వచనాలు:  

  • వివాహం, చట్టబద్ధమైన పితృత్వ, మాతృత్వాలు, దంపతులు పరస్పరం ఒకరిపై మరొకరు లైంగికపరమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే కుటుంబం - లీచ్‌. 
  • ప్రాథమిక బంధువర్గ సమూహం; లైంగిక, ప్రత్యుత్పత్తి, ఆర్థిక, విద్యాపరమైన విధుల్ని నిర్వహించేదే కుటుంబం - మెల్‌ఫోర్డ్, స్మిత్‌గ్రీన్, ప్రిన్స్‌పీటర్, కాథలిన్‌ గఫ్‌.
  • స్టీఫెన్స్‌ ప్రకారం వివాహ ఒప్పందం 4 ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.1) భార్య, భర్తల మధ్య ఉండే పరస్పర సంబంధం 2) కలిసి నివసించడం 3) తల్లిదండ్రుల హక్కులు 4) బాధ్యతలు

 

కుటుంబం విధులు

జార్జి ముర్డాక్‌ ప్రకారం..

  • దైహిక విధులు: లైంగికపరమైన ఆనందం, సహచర్యం, ప్రేమానురాగాలను తృప్తిపరుచుకుంటూ సంతానాన్ని కని, వారిని సంరక్షించి, బాధ్యతాయుత సమాజ సభ్యులుగా తీర్చిదిద్దడం.
  • సామాజిక విధులు: సామాజిక నియంత్రణలో కుటుంబం ప్రధానపాత్ర పోషిస్తుంది. సంస్కృతిని నేర్పిస్తుంది. పరస్పర మైత్రి, అన్యోన్య సహకారం, రక్షణ, సామాజిక నియంత్రణను కలిగి ఉంటుంది.
  • ఆర్థిక విధులు: ఆర్థిక భద్రత ఇస్తుంది. శ్రమ విభజన కలిగి ఉంటుంది. ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, వస్త్రాలు, అంతస్థు, అధికారాలను కలిగి ఉంటుంది.
  • లైంగిక విధి: భార్య, భర్తల మధ్య సంబంధం.. ఆమోదం పొందిన లైంగిక సంబంధానికి సాధనంగా ఉండటంతో పాటు, కుటుంబ వ్యవస్థ రూపొందేందుకు పునాది అవుతుంది. కొన్ని గిరిజన తెగల్లో మాత్రం దాంపత్య సంబంధం కుటుంబం ఏర్పడేందుకు కారణం కాకపోవచ్చు. ఉదా: న్యూ గినియాలోని బనారో తెగ, తూర్పు ఐరోపాలోని కొన్ని తెగలు (ఒక వ్యక్తి భార్య ఆమె మామ గారి బంధువు ద్వారా ఒక శిశువుకు జన్మనిచ్చే వరకు ఆ వ్యక్తి (భర్త) భార్యను సమీపించకూడదు).
  • విద్యావిధులు: కుటుంబం విద్యాపరమైన విధులను కూడా నిర్వర్తిస్తుంది.
  • ప్రత్యుత్పత్తి విధి: కుటుంబాల ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
  • సాంస్కృతిక విధి: కుటుంబం సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా పనిచేస్తుంది. అలవాట్లు, పద్ధతి, జీవనశైలి, ఆచారాలు, విద్య - విజ్ఞాన అంశాలు, సాంస్కృతిక అంశాలు, కళలు, విద్యా అవకాశాలను కుటుంబం కల్పిస్తుంది.

 

మైకేవర్‌ ప్రకారం కుటుంబ విధులు రెండు రకాలు. 

  • ఆవశ్యకమైనవి: పిల్లల్ని కనడం, పెంచడం, గృహ సదుపాయం. 
  • అనావశ్యకమైనవి: మత బోధన, విద్య, ఆర్థిక, ఆరోగ్యం, వినోదం.


కుటుంబం లక్షణాలు

  • కుటుంబ లక్షణాలు ప్రధానంగా 

1) విశ్వవాప్తం 

2) పరిమిత పరిమాణం 

3) సమాజంలో కేంద్రస్థానం 

4) కుటుంబ సభ్యుల బాధ్యతలు 

5) సామాజిక నియమాలు 

6) శాశ్వతం-తాత్కాలికం 

7) నిర్ణీత ఆవాస స్థలం

 

  • మజుందార్, మదన్‌లు కింది నాలుగు కుటుంబ లక్షణాలను తెలిపారు.

-వ్యవస్థీకృతమైన లైంగిక సంబంధం
-వంశానుక్రమం గురించి తెలుపడం
-కుటుంబ ఆర్థిక వ్యవస్థ
-ఒకేచోట నివసించడం

  • మెకైవర్, ఫేజ్‌లు తమ సొసైటీ అనే గ్రంథంలో కుటుంబానికుండే ముఖ్య లక్షణాలను తెలిపారు. అవి..

1) విశ్వవ్యాప్తం
2) ఆప్యాయత అనురాగాలు
3) అధ్యయన కేంద్రం
4) కేంద్ర స్థానం
5) పరిమితమైన పరిమాణం
6) సభ్యుల మధ్య బాధ్యతాయుత తత్వం
7) సాంఘిక క్రమం
8) శాశ్వతం, పరివర్తన

విశ్వవాప్తం

-అన్ని రకాల సమాజాల్లో ఉంటుంది. ప్రపంచమంతటా సర్వత్రా వ్యాపించి ఉంది.
-సమాజంలోని ప్రాథమిక సామాజిక సంస్థ, కుటుంబం లేకుండా సమాజమే లేదు.
-అన్ని కాలాల్లో, పరిణామ వికాసాల్లోనూ కుటుంబం సమాజంలో ఉంటుంది.
-మానవజాతి మనుగడకు కావాల్సిన అన్ని మూల అంశాలు కుటుంబంలో ఉంటాయి.
-జీవి శరీరానికి జీవకణం ఎలాగో సమాజానికి కుటుంబం అలాంటిదే.
-250 సమూహాలను అధ్యయనం చేసిన తర్వాత ముర్డాక్ కుటుంబం అనేది విశ్వవ్యాప్తం అనే భావనను పొందుపరిచాడు.
-అన్ని రకాల నాగరికతల్లో కుటుంబం ఉందని మాలినోవ్‌స్కీ పేర్కొన్నారు. ఇలా కుటుంబంలేని మానవ సమాజం లేదు.

ఆప్యాయత అనురాగాలు/ఉద్వేగపరమైన ఆధారం

-వైవాహిక, రక్తసంబంధం ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి వారి మధ్యగల ప్రేమానురాగాలు ఇందుకు పునాదిగా పనిచేస్తాయి.
-ఇలా ఉద్వేగాలు, సెంటిమెంట్లతో ఏర్పడి ఉంటుంది. సమాజాలు అయినటువంటి సమూహం, సంతానం, మాతృత్వం, పితృత్వం, సంరక్షణ లాంటి అంశాలు ప్రేమ, అనురాగాలు లాంటి అంశాలను కలిగి ఉంటాయి.

అధ్యయన కేంద్రం

-మానవుడు జన్మించినప్పుడు దైవిక ప్రాణిగానే పరిగణింపబడుతాడు. అతడికి సామాజిక విలువలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా సామాజిక అంశాలను తాను పెరుగుతున్నకొద్దీ నేర్చుకుంటాడు. దీన్నే సామాజీకరణం అంటారు.
-ఈ సామాజీకరణ వ్యక్తులకు భాష, నైపుణ్యాలు, వృత్తులు, సంస్కృతి వంటి ముఖ్యమైన సామాజిక అంశాలను నేర్పుతుంది. కుటుంబం ప్రాథమిక సామాజీకరణ సాధనంగా పనిచేస్తుంది.
-ఇది వ్యక్తికి అతిముఖ్యమైన అధ్యయన కేంద్రం కుటుంబం

పరిమితమైన పరిమాణం

-సమాజంలోని అన్ని సామాజిక సంస్థలు, సమూహాల కంటే కుటుంబం చిన్నది. ఉదా: మతం, విద్య, బంధుత్వం

కేంద్రస్థానం

-సమాజంలో అన్ని సంస్థల్లోనూ కుటుంబం కేంద్ర లేదా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. అందుకే కుటుంబం సమాజాలకు ఒక ప్రాథమిక యూనిట్‌గా వ్యవహరిస్తాం.
-ప్రతి వ్యక్తి ముందుగా కుటుంబంలో సభ్యుడవుతాడు. ఆ తర్వాత సమాజ సభ్యుడవుతాడు.
-కుటుంబం సభ్యుల్ని తమ అవసరాలను తీర్చే ద్వితీయ సమూహాల్లో పాల్గొనేందుకు సమాయత్త పరుస్తుంది.
-ఇలా కుటుంబం సామాజిక నిర్మాణంలో కేంద్ర స్థానాన్ని కలిగి ఉంది. సమాజ నిర్మాణం కుటుంబాల కలయికవల్ల ఏర్పడుతుంది. కుటుంబం అనేది మొత్తం సమాజంపై ప్రభావాన్ని చూపుతుంది.

సభ్యులు మధ్య బాధ్యతాయుత తత్వం

-కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమానురాగాలుంటాయి. వాటికి తమ కుటుంబసభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతగా పాటుపడుతారు. ఇటువంటి బాధ్యత కుటుంబం చేపట్టడంవల్ల కుటుంబం సుస్థిరంగాను, ఒడుదొడుకులు లేకుండా సాఫీగా ఉంటుంది.
-ప్రతి కుటుంబసభ్యులకు ఒకరిపై మరొకరికి కచ్చితమైన బాధ్యతలు నిర్వచించాల్సినవి ఉంటాయి (తల్లిదండ్రుల పట్ల పిల్లలకు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు).
-కుటుంబ సామరస్యత అనేది బాధ్యతలను ఎంత సౌమ్యంగా నిర్వర్తిస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది.

సాంఘిక నియంత్రణ/క్రమయుతం

-ఎలాంటి నడవడిక ఉండాలో ఉండకూడదో కుటుంబం తన సభ్యులకు జానపద రీతులు, ఆంక్షలు, సాంఘిక ప్రమాణాలు మొదలైనవాటిని పరికరాలుగా ఉపయోగించి బోధిస్తుంది.
 

శాశ్వతం, పరివర్తన

-కుటుంబాన్ని ఒక సామాజిక వ్యవస్థగా తీసుకుంటే అది మానవజాతి పుట్టుక నుంచి ఇప్పటివరకు శాశ్వతంగా ఉంటూ వస్తున్న వ్యవస్థ. కానీ కుటుంబం అనేది పరివర్తనం చెందుతుంది. కుటుంబంలో కొత్త సభ్యులు పుట్టడం, వయసుమీరినవారు గతించడం, వివాహం ద్వారా మళ్లీ కొత్త సభ్యులు రావడం జరుగుతుంది. ఇలా కుటుంబం మార్పులకు లోనవుతూ నిరంతరం కొనసాగుతుంది.

శాస్త్రవేత్తల అభిప్రాయాలు

  • మైకేవర్‌: పిల్లల్ని కనడం, పెంచడం, విధుల్ని నిర్వహించడానికి, స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం. 
  • రీమాండ్‌ఫర్‌: ఈయన కుటుంబానికి త్రికోణ స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ నమూనాలో ఒకవైపు భర్త, మరోవైపు భార్య, మూడో వైపు వారి సంతానం ఉంటుంది.
  • బర్డస్, లాక్‌: వివాహబంధం, రక్తసంబంధం లేదా దత్తతతో ఏకమై ఒకే ఇంటిలో నివసించేదే కుటుంబం.
  • ఐరావతి కార్వే: ఒకే పైకప్పు కింద నివసిసున్న, ఒకే వంటగదిలో చేసిన ఆహారాన్ని తింటూ, ఒకే ఆస్తిని కలిసి అనుభవిస్తూ కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొంటూ, ఒకరికొకరు బంధువులయ్యే వ్యక్తుల సమూహమే ఉమ్మడి కుటుంబం.
  • సమ్నర్, మోర్గాన్‌: వీరి అధ్యనాల ప్రకారం పూర్వం మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది.
  • ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌: ది ఆరిజన్‌ ఆఫ్‌ ఫ్యామిలీ, ప్రైవేట్‌ ప్రాపర్టీ అండ్‌ ది స్టేట్‌  అనే రచనల్లో కుటుంబంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.