కుటుంబం రకాలు

  • కుటుంబాలు, అందులోని బంధాలు, మూలపురుషులు, వంశ క్రమాలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలోని సభ్యులు భిన్నమైన సామాజిక విధులు, బాధ్యతలు నిర్వహిస్తుంటారు.  
  • మనిషి సామాజిక జీవనానికి కుటుంబమే మూలం. పుట్టుకతో, పెళ్లితో ఆ బంధాలు ఏర్పడతాయి. 
  • కుటుంబంలో భాగమైన వ్యక్తి రకరకాల విధులు నిర్వహిస్తారు. అందులో దైహిక, సామాజిక, ఆర్థిక, లైంగిక, విద్య, సాంస్కృతిక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. 

ప్రాథమిక కుటుంబం (వ్యష్ఠి/కనిష్ఠ కుటుంబం): దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం. ఈ కుటుంబంలో పెరిగే పిల్లలు వారి సమాజ ఆచారాలు, కట్టుబాట్లను ప్రథమంగా తెలుసుకుంటారు. 

సమ్మిశ్ర కుటుంబం (Composite family): సంతానానికి వివాహం అయితే కుటుంబం ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమ్మిశ్ర కుటుంబంగా మారుతుంది. వివాహం తర్వాత పుట్టింట్లో కూతుర్లు ఉండాలా, కుమారులు ఉండాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎప్పుడూ అధికంగా ఉంటుంది.

విస్తృత కుటుంబం: నివాస స్థల విధానాన్ని అనుసరించి విస్తృత కుటుంబంలోని పలు రకాలు ఉంటాయి.

నివాస స్థల సూత్రం (Rule Of Residence)

విస్తృత కుటుంబ స్వరూపం (The Farm of extended family)

1. పతి స్థానిక నివాసం (Patrilocal Residence)

1. పతి స్థానిక విస్తృత కుటుంబం (Patrilocal extended family)

2. పత్నిస్థానిక నివాసం (Matrilocal Residence) 2. పత్నిస్థానిక విస్తృత కుటుంబం (Matrilocal extended family)
3. ద్విస్థానిక నివాసం (Bilocal Residence) 3. స్థానిక విస్తృత కుటుంబం (Bilocal extended family)
4. మాతుల స్థానిక నివాసం (Avunculocal Residence) 4. మాతుల స్థానిక విస్తృత కుటుంబం (Avunculocal extended family)

* విస్తృత కుటుంబంలో రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ తరాలవారు ఉంటారు.

పతి స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు సోదరులు, వారి భార్యలు, వారి అవివాహితులైన కొడుకులు, కూతుళ్లు, వివాహితులైన కొడుకులు, వారి భార్యలు, కొడుకుల సంతానం ఉంటారు. ఈ రకమైన కుటుంబానికి తండి లేదా తండ్రి అన్న కుటుంబానికి పెద్దగా ఉంటారు. సమష్టి సంపాదనను కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. 

పత్ని స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు అక్కాచెల్లెలు ఉంటారు. అవివాహితులైన, వివాహితులైన ఆడబిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు ఉంటారు. ఈ కుటుంబంలో స్త్రీలలో జేష్ఠురాలిదే అధికారం. 

ద్విస్థానిక విస్తృత కుటుంబం: దంపతులు, వారి కుమారుల్లో కొంతమంది, కూతుళ్లలో కొంతమంది, వారి మనుమలలో కొంతమంది, మనుమరాలు సభ్యులుగా ఉంటారు. ఈ రకమైన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. 250 సమాజాల్లో కేవలం 10 సమాజాల్లోనే ఇలాంటి కుటుంబాలున్నాయని జార్జ్‌పీటర్‌ ముర్డాక్‌ తెలిపారు.

మాతుల స్థానిక విస్తృత కుటుంబం: ఈ కుటుంబంలో దంపతులు, వారి సంతానంతో పాటు అతడి అక్క, చెల్లెళ్ల కొడుకుల్లో చాలామంది అతడి కూతురిని వివాహం చేసుకొని వారి సోదరి కొడుకుతో కలిసి ఒకే నివాసంలో ఉంటారు. 

బహుభార్యత్వ కుటుంబం: 

చుక్చీ, కిప్సీజీ, లఖోర్, లసు (మాతుల ప్రకారం తమ భర్తలతో కాపురం చేస్తారు), మర్న్‌గిన్, బైగా, మరియ, తనాల వంటి గిరిజన తెగల్లో కనిపిస్తుంది.  

1) లైంగిక సంబంధాల వల్ల ఒకరి భార్యలంతా సమానమైన హక్కులతో ఉంటారు. 

2) ప్రతి భార్యకు ప్రత్యేక నివాస స్థలం/ అందరూ ఒకే గృహంలో కాపురం చేయవచ్చు. 

3) పెద్ద భార్యకు ప్రత్యేక అధికారం, హక్కులు ఉండొచ్చు. 

బహుభర్తృత్వ కుటుంబం: ఖాసా, తోడాలు, తియ్యాన్‌ అనే గిరిజన తెగల్లో ఇది కనిపిస్తుంది. 

కేంద్రక కుటుంబం (Nuclear Family): ఇందులో భార్య, భర్త, అవివాహిత పిల్లలు ఉంటారు.

ప్రకార్య ఉమ్మడి కుటుంబం (Functional Joint Family): రక్త సంబంధం ఉన్న రెండు కుటుంబాలు, విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే ఉమ్మడి అధికారం కింద కార్యకలాపాలు సాగిస్తారు. 

ప్రకార్య, గణనీయ ఉమ్మడి కుటుంబం (Functional & Substantial Family): ఆస్తి విషయంలో ఉమ్మడిగా కార్యకలాపాలు సాగించడం దీని ప్రధాన లక్షణం.

ఉపాంత ఉమ్మడి కుటుంబం: రెండు తరాల కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు. 

సంప్రదాయ ఉమ్మడి కుటుంబం: రెండు లేదా మూడు తరాలవారు కలిసి ఉండటం దీని ప్రత్యేకత.

 

వంశానుక్రమం

  • పితృ వంశీయ కుటుంబం: తండ్రిని మూలజనకుడిగా పరిగణించి తన సంతానానికి తండ్రి బంధువులతో పొత్తు పెట్టుకొని తండ్రి వంశకర్తగా ఉంటారు. 
  • మాతృ వంశీయ కుటుంబం: తల్లి వంశకర్తగా ఉంటారు.
  • ద్వంద్వ వంశానుక్రమం: ఒక వ్యక్తి తన మాతృ వర్గం, పితృ వర్గంతో పొత్తు కుదుర్చుకొని రెండు పక్షాల వారిని మూలపురుషులుగా గ్రహించే కుటుంబం.

 

మరికొన్ని వివరాలు

  • సహజీవనం: వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం. 
  • డింక్‌ కుటుంబాలు: ఆర్థిక భద్రత ఉన్న కొందరు వివాహితులు, ఉద్యోగాలు చేసే దంపతులు సంతానాన్ని వద్దనుకోవడం.
  • కిబ్బట్జ్‌ కుటుంబ వ్యవస్థ: పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా పిల్లల గృహంలో నివసించడం. ఈ రకమైన వ్యవస్థ ఇజ్రాయెల్‌లో ఉంది.
  • జన్మప్రాప్త: వ్యక్తి తాను జన్మించిన కుటుంబంలో సభ్యుడిగా ఉండటం.
  • ధ్యాంతి: ఖాసా తెగ స్త్రీని పుట్టింట్లో పిలిచే విధానం.
  • ర్యాంతి: ఖాసా తెగ స్త్రీని అత్తవారింట్లో పిలిచే విధానం
  • ఘోస్ట్‌ మ్యారేజ్‌: దీన్ని న్యూయెర్లు, ఇవాన్‌ ఫ్రిచెర్డ్‌ అధ్యయనం చేశారు. 
  • ఈంగ్‌: ఖాసి తెగలోని కుటుంబం పేరు. 
  • ఇల్లోమ్‌: ఇది నంబూద్రి సమూహంలోని కుటుంబం.
  • స్త్రీల మార్పిడి: స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం బర్మాలోని కచ్చిన్‌ కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. 

 

సిద్ధాంతాలు

  • స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతపాదించినవారు ప్లీస్‌ 
  • పితృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: దీన్ని అరిస్టాటిల్, ప్లేటో, హెన్రీ మెయిన్‌ ప్రతిపాదించారు. 
  • మాతృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: బ్రిఫాల్డిస్‌ ప్రతిపాదించారు. 
  • పరిణామక్రమ కుటుంబ సిద్ధాంతం: మోర్గాన్‌ ప్రతిపాదించారు. 
  • ఏకపత్ని కుటుంబ సిద్ధాంతం: వెస్టర్‌ మార్క్‌ ప్రతిపాదించారు. 
  • బహుళ కారక కుటుంబ సిద్ధాంతం: మైకేవర్, రాల్ఫ్‌లింటన్‌ ప్రతిపాదించారు.