విపత్తు నిర్వహణ - బిట్స్ 1
- భూకంపాలు సాధారణంగా ఏ సమయంలో వస్తాయి ? - రాత్రివేళల్లో
- సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఎప్పుడు రూపొందించింది ? - 1963 సంవత్సరంలో
- 2011 మార్చి 11న సంభవించిన సునామీ కారణంగా జపాన్‌లో సర్వనాశనం అయిన నగరం ఏది ? - షెన్‌డారు
- భూకంపం తరంగాలను నమోదు చేసేది ఏది ? - సిస్మోగ్రాఫ్
- భూకంపం సమయంలో విడుదలైన శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రతా కొలమానం ఏది ?- రిక్టర్ స్కేలు
- భూకంపాలు రోజులో ఎప్పుడు సంభవిస్తే అధిక ప్రమాదాలు జరుగుతాయి ? - రాత్రి సమయంలో
- పసిఫిక్ అగ్నివలయ ప్రాంతం వేటిని కలిగి ఉంటుంది ? - వరుస అర్ధచంద్రాకారంలో ఉండే అగ్నిపర్వతాలు, లోతైన సముద్రపు ట్రెంచ్‌లు
- సాధారణంగా ఏ వైపరీత్యం భూకంపం వలన కలుగుతుంది ?- సునామీలు
- ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలు ఏవి ? - ఐసో సిస్మల్ రేఖలు
- భారతదేశ భూభాగాన్ని ఎన్ని భూకంపపు ప్రాంతాలుగా గుర్తించారు? - 5
- 2004 డిసెంబర్ 26వ తేదీన సంభవించిన సునామీ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఎన్ని జిల్లాలు ప్రభావితమయ్యాయి ? - 9 జిల్లాలు
- కోస్తా ప్రాంతంలో వచ్చే అత్యంత విధ్వంసకర విపత్తు ఏది ? - సునామీ
- 2011లో జపాన్‌లోని భూకంప సునామీల నేపథ్యంలో ఏ ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాలను మూసివేశారు? - మియాగి, పుకుషియా
- భూకంపాల తీవ్రతను ఏ భావనతో కొలుస్తారు ? - పరిమాణం
- మన దేశంలో ఒకటికంటే ఎక్కువగా విపత్తులకు గురయ్యే ప్రాంతం ఏది ? - హిమాలయ పర్వత ప్రాంతం
- మొట్టమొదటిసారి ముందస్తు సునామీ హెచ్చరికను 1920లో ఎక్కడ జారీచేశారు ? - హవారు
- తుపాను భూమిమీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు ?- టైపూన్లు
- సునామీ అనే పదం ఏ దేశానికి సంబంధించినది ? - జపాన్
- సునామీకి అర్థం ఏమిటి ? - హార్బర్ వేవ్
- సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం ? - సముద్ర అంతర్గత భూకంపం
- సముద్రంలో సునామీలు ఏ కారణంతో ఏర్పడతాయి ? - పలకలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల
- సునామీల వేగం సముద్ర అంతర్భాగంలో ఎంత ఉంటుంది ?- 800 కిలోమీటర్లు
- 2004 డిసెంబర్ 26వ తేదీన సునామీ ఏ ప్రాంతంలో సంభవించింది ? - ఆగేయ ఆసియా
- ప్రపంచంలో లోతైన అగాధాలు, అగ్నిపర్వత ద్వీప వక్రతలు కలిగిన ప్రాంతం ఏది ? - అగ్నివలయం
- సునామీలు ఏర్పడటానికి ప్రధానమైన చర్య ఏది ? - సబ్ డక్సన్ మండలం
- సబ్ డక్సన్ మండలం అనగా ఏమి ? - సముద్రపు భూ అంతర్భాగంలో పలక ఖండపలకలోనికి చొచ్చుకు పోవడం.
- అగ్నివలయ ప్రాంతం పరిధిలోకి వచ్చే దేశాలు,ప్రాంతాలు ఏవి?- ఫిజి, పపువా న్యూగినియా, ఫిలిప్పైన్స్, జపాన్, రష్యా తూర్పుతీరం, అలాస్కా దక్షిణ, ఉత్తర అమెరికా పశ్చిమ తీర ప్రాంతం
- అగ్నివలయ ప్రాంతం ఏ మహా సముద్రానికి సంభవించినది ? - పసిఫిక్
- భూకంప సముద్ర తరంగం అనగా ఏమి ? - సునామీ
- సునామీ ఏర్పడిన ప్రాంతం నుంచి అది ఏ దిశగా ప్రయాణిస్తుంది ? - అన్ని వైపులకు
- సముద్ర డోలనా పరిమితి ఎంత ? - గంటకు 700 నుంచి 1000 కిలోమీటర్ల వేగం
- ప్రపంచం మొత్తం మీద సంభవించే సునామీల్లో 75 శాతం పసిఫిక్ మహాసముద్రంలో ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? - ఫసిఫిక్ అగ్నివలయ ప్రాంతం
- కాకట్రోవ అగ్నిపర్వత విస్ఫోటనం వలన ఏ దేశంలో సునామీలు ఏర్పడతాయి ? - ఇండోనేషియా
- సునామీలకు సంబంధించి విధ్వంసం ప్రధానంగా వేటిమీద ఆధారపడి ఉంటుంది ? - భూకంప తీవ్రత, నీటి పరిమాణం, తీరరేఖ ఆకృత్యలపై
- మధ్యధరా సముద్రంలో ఏర్పడిన సునామీలు ఏ దేశానికి చెందినవి ? - టర్కీ
- భూగర్భ పలకల చలనం సంవత్సరానికి ఎంత ఉంటుంది ? - 1 నుంచి 10 సెంటీమీటర్లు
- 2011లో జపాన్‌లో సంభవించిన సునామీ కారణంగా చోటుచేసుకున్న పరిణామాల్లో కొన్ని ఏవి ? - జపాన్‌దీవులు 8 అడుగులు పశ్చిమానికి కదిలాయి. కొరియం అనే ద్వీపకల్పం ఐదు సెంటీమీటర్ల మేర పైకి లేచింది.
- సాధారణంగా సముద్రగర్భంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంతగా ఉన్నపుడు సునామీలు సంభవిస్తాయి ? - 7.5
- జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించింది? - 2011 మార్చి 11సునామీలు ఏ విషయంలో సముద్ర తరంగాలు ఉత్పత్తి చేసే పవనంతో విభేదిస్తాయి ? - సముద్ర భూతలం కల్లోలం నుంచి శక్తి నీటికి బదిలీ అవుతుంది.
- ఇటీవలి కాలంలో తూర్పు, దక్షిణ ఆసియాను సునామీ ఎప్పుడు తాకింది ? - 2004 డిసెంబర్ 26
- అతి తీవ్రస్థాయిలో భూకంపం సంభవించి, భారీ నష్టం కలగడానికి ఆస్కారం కలిగిన ప్రాంతాన్ని ఎన్నవ జోన్‌గా
పేర్కొంటారు ? - ఐదవ జోన్ - భూకంప సమయంలో ప్రకంపనం చాలా ఎక్కువగా ఎక్కడ ఉంటుంది ? - ఆదికేంద్రం సమీపంలో
- భూకంపానికి సంబంధించి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని (Elastic rebound hypothesis)
ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ? - హెచ్.ఎఫ్.రీడ్ - భూకంపాలలో దాదాపు 68 శాతం ఎక్కడ ఉద్భవిస్తున్నాయి ?- ఆఫ్రికాలోని పగుళలోయ
- భూకంపం సంభవించినపుదు పరిమాణ, తీవ్రతలో తేడా ఏమిటి ? - పరిమాణం మారదు, తీవ్రత మారుతుంది
- భూకంప పరిమాణం దేనిని కొలుస్తుంది ? - భూకంపం సంభవించినపుడు విడుదలయ్యే శక్తి పరిమాణాన్ని
- భూకంప తీవ్రత ఎలా ఉంటుంది ?- ప్రారంభ కేంద్రం నుంచి దూరం పోయే కొద్దీ తగ్గుతుంది
- మన దేశంలో ఎంత శాతం భూమి భూకంపాలకు గురి అవుతుంది ? - 100 శాతం
- మన దేశంలో ఎంత శాతం భూమి మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయి వరకు భూకంపాలకు గురి అవుతుంది? -
59 శాతం - ప్రపంచవ్యాప్తంగా 75 శాతం వరకు అగ్నిపర్వతాలు ఏ స్థితిలో ఉన్నాయి ? - క్రియాశీల, నిద్రాణ
- ప్రస్తుతం దేశంలో ఎన్ని వాతావరణ కేంద్రాలను శాటిలైట్‌తో అనుసంధానం చేశారు ? - 250
- తుపాను ఏర్పడే వాతావరణ ఆవరణాన్ని ఏ పేరుతో పిలుస్తారు ? - టోపో ఆవరణం
- తుఫాను కారణంగా సంభవించే వైపరీత్యాలు ఏవి ? - బలమైన గాలి, వరదలు, తుపాను ఉప్పెన
- సైక్లోన్ చుట్టూ తిరుగుతూ ఉనన బలమైన గాలులతో తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహం ఏది ? - తుపాను ఉప్పెన
- తుఫాను కేంద్రభాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు ? - కన్ను
- మన దేశంలో ఎంత శాతం భూభాగం తుఫానులకు గురవుతోంది ? - 12 శాతం
- తుఫానులు ఏర్పడటానికి కారణాలు ఏవి ? - సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం, సాపేక్ష ఆర్ద్రత ఎక్కువగా ఉండటం, వాతావరణ అనిశ్చితి
- ఒడిశా రాష్ట్రాన్ని సూపర్ సైక్లోన్ ఎప్పుడు తాకింది ? - 1999 అక్టోబర్ 29
- 1,40,000 మంది చనిపోవడానికి కారణమైన తుఫానును ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం ఎప్పుడు చవిచూసింది? - 1911
- రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు, ఉగ్రదాడులు ఏ రకమైన వైపరీత్యాలు ? - మానవ సంబంధ వైపరీత్యాలు
- తరచుగా భూకంపాలు, తుపాన్లు, వరదలు వంటి అనేక వైపరీత్యాలకు గురిఅయ్యే రాష్ట్రం ఏది ? - గుజరాత్
- వేగాన్నిబట్టి విపత్తులు ఎన్ని రకాలు ? - రెండు రకాలు. 1) నిదానంగా ప్రారంభమయ్యే విపత్తులు 2) వేగంగా వచ్చే విపత్తులు
- కారణాలను బట్టి విపత్తులు ఎన్ని రకాలు ?- రెండు రకాలు 1) సహజ విపత్తులు2) మానవ సంబంధ విపత్తులు
- సహజ విపత్తులకు ఉదాహరణలు ఏవి ? - సునామీ, భూకంపం, తుఫాను, కరువు
- మానవ సంబంధ విపత్తునకు ఉదాహరణలు ఏవి ? - ఉగ్రవాదం, అణుబాంబులు, యుద్ధాలు
- జీవ సంబంధ విపత్తులు ఏవి ? - మహమ్మారి వ్యాధులు, కీటకాల దాడులు, ఆహారం విషతుల్యం కావడం
- ప్రస్తుతం సునామీ చేరికతో నీరు, వాతావరణ సంబంధిత విపత్తులు ఎన్ని ఉన్నాయి ? - 12
- విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎందుకు తక్కువగా ఉంటుంది ? - వనరుల కొరత
- దుర్భలత్వాలు ఎన్ని రకాలు. అవి ఏవి ? - మూడు రకాలు. భౌతిక, సామాజిక, ఆర్థిక దుర్భలత్వాలు
- ఏదైనా విపత్తు సంభవించినపుడు చేయవలసిన పనులు ఏవి ? - అత్యవసర సహాయక చర్యలు, పునరావాసం, పునర్నిర్మాణం, ఉపశమనం, సంసిద్ధత సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ది ఎపిడిమియాలజీ ఆన్ డిజాస్టర్స్ అనే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు ? - 1987
- ముప్పును అంచనా వేయడంలో ఉన్న అవరోధాలు ఏవి ? - కేంద్రీయ గణాంకాల సేకరణ రికార్డు లేకపోవడం, ముప్పును అంచనా వేయడంలో అవగాహన లేకపోవడం
- దేశంలో అధిక విపత్తుకు గురయ్యే ప్రాంతాలు ఎన్ని ?అవి ఏవి ? - ఐదు ప్రాంతాలు. 1. హిమాలయ ప్రాంతాలు 2. ఒండ్రు మైదానాలు 3. తీర ప్రాంతాలు 4. ఎడారి ప్రాంతం 5. ద్వీపకల్ప ప్రాంతంలోని కొండల ప్రాంతం
- హిమాలయ ప్రాంతం ప్రత్యేకత ఏది ?- భూకంపాలు, భూతాపాలు ఎక్కువ
- మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఏ విపత్తులకు గురవుతున్నాయి ? - వరదలకు
- తీర ప్రాంతాలు ఏ విపత్తులకు గురవుతున్నాయి ? - తుపాన్లు, గాలివానలు
- హిమాలయాలు భూకంపాలు, భూతాపాలకు గురవడానికి ప్రధానకారణం ? - విరూప కారక చలనాలు